మురారీ ముకుంద మాటలు గుర్తు చేసుకుని ఉలిక్కిపడి నిద్రలేచి కూర్చుంటాడు. అటు కృష్ణ గది మొత్తం అందంగా డెకరేట్ చేసి మురారీని పిలవడానికి వస్తుంది. తను టెన్షన్ గా ఉండటం చూసి ఏమైందని అడుగుతుంది. వాళ్ళ పెద్దమ్మ విషెస్ చెప్పలేదని బర్త్ డే రోజు కూడా మాట్లాడటం లేదని ఫీల్ అవుతున్నారు వీళ్ళ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవాలని కృష్ణ కోరుకుంటుంది. అటు ముకుంద ఇంటి టెర్రస్ మీద డెకరేట్ చేసి కేక్ తీసుకొచ్చి మురారీ కోసం ఎదురుచూస్తుంది. తను దొంగచాటుగా టెన్షన్ గా వస్తాడు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా పెద్దమ్మ వాళ్ళు చూస్తే బాగోదని అంటాడు. మురారీకి విషెస్ చెప్పి ముకుంద కేక్ కట్ చేయిస్తుంది. తనకి ఉంగరం గిఫ్ట్ గా ఇస్తుంది. నా ప్రేమ గుర్తుగా ఇక చిన్న గిఫ్ట్ అని మురారీ వేలికి ఉంగరం తొడిగి మన ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే అంటుంది. ఇక మనల్ని ఎవరూ వేరు చేయలేరని సంతోషపడుతుంది. అప్పుడే ఫోన్ మోగడంతో అదంతా కల అని అర్థం అవుతుంది. ఇప్పుడు రావడం కుదరదని మురారీ మెసేజ్ పంపిస్తాడు. అది చూసి ముకుంద కన్నీళ్ళు పెట్టుకుంటుంది.


Also Read: వామ్మో, రాహుల్ జగత్ కంత్రిగాడు- రాజ్ మైండ్ పొల్యూట్, కావ్య మాటలు నమ్మనట్టేనా?


కృష్ణ మురారీ కోసం కేక్ తీసుకొచ్చి కట్ చేయిస్తుంది. అది ముకుంద కంట పడుతుంది. కేక్ కృష్ణకి తినిపించబోతుంటే ముకుంద రావడం చూసి ఆగిపోతాడు. ఏమైంది ఒంట్లో బాగోలేదా అంటుంది. మురారీకి ప్రేమగా కేక్ తినిపిస్తుంది. అది చూసి ముకుంద ఏడుస్తూ వెళ్ళిపోతుంది. తర్వాత కృష్ణ, మురారీ సంతోషంగా గడుపుతారు. భవానీ మురారీ గది దగ్గరకి వస్తుంది. పెద్దమ్మ నాతో మాట్లాడవా నన్ను క్షమించవా అని మురారీ నిద్రలో కలవరిస్తాడు. అది చూసి భవానీ మనసులో హ్యపీ బర్త్ డే మురారీ నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అనుకుని బాధగా వెళ్ళిపోతుంది. ముకుంద ఒంటరిగా కూర్చుని కృష్ణతో సంతోషంగా ఉండటం గుర్తు చేసుకుని బాధపడుతుంది.


Also Read: జరగబోయేది మన పెళ్ళే అంటూ చిత్రకి వార్నింగ్ ఇచ్చిన అభిమన్యు- రొమాన్స్ లో తేలిపోతున్న యష్ జంట


నేను ఎంత చేరువ అవాలని అనుకుంటే అంతగా నా నుంచి దూరంగా వెళ్తున్నావ్. నువ్వు దూరంగా ఉన్నా నేను ఉండలేను. ఎందుకంటే నిన్ను చూడగానే నాలో ప్రేమ పుట్టలేదు, నువ్వు వదిలేయగానే మర్చిపోవడానికి. నువ్వు మారిపోయావు, ఇది నీలో వచ్చిన మార్పు లేదంటే కృష్ణ తీసుకొచ్చిన మార్పు అర్థం కావడం లేదు. ఫలితం ఏదైనా నచ్చని నిజాన్ని మనసు అంగీకరించలేదు. ఇంతకముందు నా మౌనం కూడా అర్థం చేసుకునే వాడివి కానీ ఇప్పుడు నేను నోరు తెరిచి చెప్పినా కూడ అర్థం చేసుకోవడం లేదు. నీ కుటుంబం కోసం నువ్వు చేయాల్సింది నువ్వు చేశావు. నా ప్రేమ కోసం నేను చేయాల్సింది నేను చేస్తాను ఇది కత్తి దూయలేని యుద్ధం నా ప్రాణం పోయినా సరే నా ప్రేమని బతికించుకుంటానని అనుకుంటుంది.