గుప్పెడంతమనసు మార్చి 15 ఎపిసోడ్


ధరణి ఏడుస్తూ వెళ్లిపోవడం గమనించిన రిషి.. భోజనం తర్వాత వంటగదిలోకి వెళ్లి వదినా అని వెతుకుతాడు.. ఇంతలో ధరణి వచ్చి ఏం రిషి ఇలా వచ్చావని అడుగుతుంది. 
ధరణి: జీవితం ఇలా ఉండాలని అలా ఉండాలని ఊహించుకుంటాం అన్నీ జరగవు కదా 
రిషి: కొన్ని సార్లు మనం ఎంత ప్రయత్నించినా జరగని పనులు అప్పుడప్పుడు అలవోకగా అవుతాయి..ఇన్నాళ్లు అన్నయ్య రాకపోవడం మీరు ఓపికగా వెయిట్ చేయడం గ్రేట్..శైలేంద్ర అన్నయ్య త్వరలోనే వస్తాడు..నేను చొరవ తీసుకుంటాను...
ధరణి: వస్తాడో రాడో అనికూడా డౌట్ వచ్చింది
రిషి: శైలేంద్ర అన్నయ్యతో నేను మాట్లాడతాను...
ఇదంతా చాటుగా వింటున్న దేవయాని..వసుధారని తిట్టుకుంటుంది
ధరణి: ఇప్పటివరకూ నేను పెద్దత్తయ్యగారిని శైలేంద్ర గురించి అడగలేదు
ధరణి ఇప్పుడు అడుగుతుందా ఏంటి..రిషికి ఎందుకు అంత ఇంట్రెస్ట్..ఆ వసుధార వల్లనే అనుకుని రుసరుసలాడుకుంటుంది.. శైలేంద్ర విషయంలో కలగజేసుకోవద్దని రిషితో మాట్లాడాలా అనుకుంటుంది... రిషినేరుగా వసుధార రూమ్ కి వెళ్లడం గమనిస్తుంది దేవయాని...


Also Read: రిషి మనసుకి రంగులతో ట్రీట్మెంట్ ఇచ్చిన వసు, గుప్పెడంతమనసులో త్వరలో మరో కొత్త క్యారెక్టర్!


రూమ్ లోకి వెళ్లిన రిషి వసుధారా అని పిలిచి గదిలో లేకపోవడంతో మేడపైకి వెళ్లిచూస్తాడు..అక్కడ వాళ్ల నాన్నతో మాట్లాడుతుంది. ఈ ఇంటికి కోడలిగా వచ్చాను..కోడలినే కానీ కోడలిని కాను..ఇక్కడ నేను ఎంత హ్యాపీగా ఉన్నానో..హోలీ పండుగ చాలా బాగా చేసుకున్నాను నాన్నా.. పండుగలో ఎన్నిరంగులో..రిషిసార్ హోలీ పండుగను ఎంతబాగా ఎంజాయ్ చేశారో అంటూ మాట్లాడుతూ వెనక్కు తిరిగిచూసి రిషిని గమనిస్తుంది. నాన్నా మళ్లీ కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తుంది..
రిషి:నీకోసం అంతా వెతికి ఇక్కడకు వచ్చాను..మీ అమ్మా నాన్నకి బాగానే కలరింగ్ ఇస్తున్నావ్ కదా
వసు: కలర్స్ పండుగ చేసుకున్నాకదా
రిషి: ప్రతి విషయం చెప్పాలా
వసు: వాళ్లే అడుగుతారు కదా సార్.. 
రిషి: అందర్నీ మభ్యపెడుతున్నావా..
వసు: నిజం ఏంటో మీరు చెప్పాక ఇంకేం మాట్లాడాలి...మీరు నాకోసం రావాలా..కాల్ చేస్తే నేనే వచ్చిదాన్ని కదా
రిషి: నువ్వు నా గదికి వచ్చే టైం రాలేదు..అందుకే నేను వచ్చాను
వసు: మనం అన్న పదం అందంగా వినిపించేది..ఇప్పుడు అర్థం మారింది
రిషి: దాపరికాలు లేని ప్రేమను అడిగాను...బంధమే దాపరికం అయింది..
వసు: నేను వెన్నెల కోసం ఎదురుచూస్తున్నాను
రిషి: అమావాస్య రోజు వెన్నెల కోసం ఎదురుచూడడాన్ని ఏమంటారు
వసు; అమావాస్య అయినా సగం రోజులే కదా..
రిషి: మన ప్రేమని చూడు..మన బంధాన్ని కాదు.. దగ్గరున్నామా దూరం ఉన్నామా...
వసు: దగ్గర ఉన్నాం..కానీ..దగ్గర కాలేకపోతున్నాం..
రిషి: ఇద్దర్నీ ఓ గీత వేరుచేస్తోంది..ఆ గీత గీసింది నువ్వే వసుధార...
వసు రిషిని వెతుక్కుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది దేవయాని...మళ్లీ చాటుగా వాళ్ల మాటలు వింటుంది...
రిషి:అందమైన కల హఠాత్తుగా మెలుకువ వచ్చినట్టుందని రిషి అనగానే.. చేయిపట్టుకుట్టుంది వసుధార.. నువ్వు వచ్చాక కొత్తగా పుట్టానేమో అనిపిస్తుంది కానీ ...అని వసు చేతులు వదిలేస్తాడు..నిజాన్ని కాదనలేను..ప్రేమను కాదనలేను..
వసు: మన మధ్య ప్రేమ ఏంతుందో దూరం కూడా అంతే ఉంది..ఇదే భయపెడుతోంది నన్ను
ఇదే కదా నాకు కావాల్సింది..నాకు పనికొచ్చేది ఇదే అని నవ్వుకుంటుంది దేవయాని...
రిషి వెళ్లిపోతాడు...ఈ దూరం ఈ భారం మీరే తగ్గించాలి సార్ అనుకుంటుంది వసుధార...


ALso Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారు బాగా సంపాదిస్తారు కానీ మానసికంగా కృంగిపోతారు అంతలోనే ధైర్యంగా దూసుకెళ్తారు


జగతి-మహేంద్ర: ధరణిని కావాలని ఇబ్బందిపెడుతోంది అక్కయ్య.. అందుకే ఆవిడ మనసు మార్చాలని చూడడం కన్నా శైలేంద్రని రప్పించే ప్రయత్నం చేయడం మంచిది... సమయం చూసి నేను రిషికి చెబుతాను ఈవిషయంలో నువ్వు తొందరపడి ధరణికి లేనిపోని తలనొప్పులు తీసుకురావొద్దు అని చెబుతుంది జగతి...


తెల్లారేసరికి ధరణి కాఫీ తీసుకురా అని ఫణీంద్ర అడిగితే.. దేవయాని కాఫీ పట్టుకుని ఎంట్రీ ఇస్తుంది.  అంతా షాక్ అవుతారు.. సరదాగా ఈ రోజు అందరకీ నా చేత్తో కాపీ ఇవ్వాలని అనిపించింది అంటుంది.. నువ్వేం చేస్తున్నావు ధరణి అని జగతి అంటే.. నన్ను వద్దన్నారు అంటుంది ధరణి. అందరకీ కాఫీ ఇస్తుంది దేవయాని... జగతి-మహేంద్ర ఇద్దరూ అనుమానంగా చూసుకుంటారు..
దేవయాని: ఈ రోజు ఇంట్లో పూజ చేస్తున్నాం..ఎవ్వరూ కాలేజీకి వెళ్లడం లేదు.. ఈ రోజు ఇంట్లో సత్యనారాయ స్వామి వ్రతం చేస్తున్నాం..
మహేంద్ర: సడెన్ గా వ్రతం ఏంటి..
దేవయాని: కొత్తగా పెళ్లైన దంపతులు ఇంట్లో ఉండగా..వ్రతం చేసుకోవడం ఆచారం కదా..నీకు జగతికి ఇలాంటివి పట్టవు అందుకే నేనే అన్నీ సిద్ధం చేయించాను..
రిషి: ఈ రోజు కాలేజీలో చాలా పనులున్నాయి..
దేవయాని: కాలేజీ పనులు ఎప్పుడూ ఉండేవే..నేను చెబుతున్నా కదా..అంతా ఇంట్లోనే ఉండాలి..
ఫణీంద్ర: ఎవ్వరికీ చెప్పకుండా ఈ హడావుడి ఏంటి
దేవయాని: చెప్పాల్సింది ఏముంది...మన ఇంటివరకే చేసుకుందాం..కొందరు ముత్తైదువులను పిలుస్తున్నాం
జగతి-మహేంద్ర ఇద్దరూ లోపలకు వెళ్లిపోతుండగా... వ్రతానికి కావాల్సినవి నేను తెప్పించాను నువ్వు కంగారు పడకు అంటుంది దేవయాని..
వసు-రిషి ఇద్దరూ ఇబ్బందిగా ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటారు...
దేవయాని: ఇదే కదా నాకు కావాల్సింది అనుకుంటుంది దేవయాని...


జగతి-మహేంద్ర
వదిన ప్రవర్తన ఏదో తేడాగా ఉంది జగతి అని మహేంద్ర అంటే..అవును మహేంద్ర అక్కయ్య ఏం చేసినా అందులో ఏదో ఉంటుందని రిప్లై ఇస్తుంది. అయినా అన్నయ్యా వదినా వ్రతం చేస్తారేమో అని సర్దిచెప్పుకుంటారు..కానీ ఏదో ఉందని మాత్రం ఫిక్సవుతారు...


మరోవైపు వ్రతానికి అన్నీ సిద్ధం చేస్తారు..జగతిని పిలిచిన దేవయాని..ఇల్లంతా కళగా కనిపిస్తోంది కదా ఇంట్లో ఏదైనా పూజ జరిగితే ఆ కళే వేరు.. మనసుకి ఆనందంగా ఉంటుంది..మీరు నన్ను గయ్యాళిలా చూస్తారు కానీ మీరనుకున్నంత గయ్యాళిని కాదు నేను..ఈ వ్రతాన్ని మనం ఇద్దరం కలసి ఎలాంటి ఆంటంకం లేకుండా జరిపిద్దాం సరేనా అంటుంది... ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నారని జగతి అడుగుతుంది.. చెప్పాలి కదా ...సరే..నా వెంట రా అని తీసుకెళుతుంది...