వేద యష్ ని చెంప పగలగొట్టడం గుర్తి చేసుకుని విన్నీ సంతోషంగా నవ్వుతూ ఉంటాడు. ‘నా గుండె చప్పుడు నువ్వే, నా ప్రాణం నువ్వే, నా ఊపిరి నువ్వే. నువ్వు పుట్టింది నాకోసమే అర్థం చేసుకోవు ఏంటి. బెస్ట్ ఫ్రెండ్ కాదు వరల్డ్స్ బెస్ట్ లవర్. నువ్వు నాకే దక్కాలి. పనికిమాలిన యశోధర్ కి పెళ్ళానివి ఏంటి నేను ఒప్పుకోను. నీ దృష్టిలో యష్ ని చెడ్డవాడిని చేయడం కోసం చాలా సార్లు ట్రై చేశాను. మీ ఇద్దరిని విడదీసి నాతో పాటు అమెరికా తీసుకెళ్లిపోతాను. నువ్వు నాకే సొంతం’ అని వేద ఫోటో చూస్తూ మాట్లాడతాడు. ఒక అమ్మాయిని కూడా కిడ్నాప్ చేయలేకపోయారా అని రౌడీల మీద అరుస్తాడు. వేద ఇంకా గదికి రాలేదు ఏంటా అని యష్ ఎదురుచూస్తూ ఉంటాడు.


Also Read: యష్, వేద విడాకులు- విలన్ గా తన అసలు రంగు బయటపెట్టిన విన్నీ


బెస్ట్ సీఈవో అయినంత ఈజీ కాదు బెస్ట్ హజ్బెండ్ అవడం. తనని ఇంప్రెస్ చేసి సోరి చెప్పి కుల చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని యష్ అనుకుంటాడు. అప్పుడే వేద గదిలోకి బెడ్ చక్కగా సర్ది పెట్టడం చూసి లోలోపల మురిసిపోయిన పైకి మాత్రమ కోపంగా ఉన్నట్టు బిల్డప్ కొడుతుంది. వేద సైలెంట్ గా వెళ్ళి సోఫాలో పడుకుండిపోతుంది. నిద్రపోతున్న వేదని చూస్తూ మురిసిపోతాడు. తెల్లారి లేచి నిద్రపోతున్న వేద దగ్గరకి వెళ్ళి అలగడానికి ముందు ఉంటుంది. అయినా ఇందులో నా తప్పు కూడా ఉంది కదా. లేవగానే సోరి చెప్పాలి. ఖుషిని రెడీ చేస్తే కాస్త కూల్ అవుతుందని అనుకుంటాడు. వెళ్ళి ఖుషిని నిద్రలేపుతాడు. మమ్మీ ఏది అని అడుగుతుంది. అలసిపోయి నిద్రపోతుంది మమ్మీ లేచేసరికి రెడీ అయి సర్ ప్రైజ్ ఇవ్వాలని అంటాడు. ఖుషిని స్కూల్ కి రెడీ చేస్తాడు.


వేద నిద్రలేచేసరికి ఖుషి వస్తుంది. నిన్ను ఎవరు రెడీ చేశారని వేద అడుగుతుంది, డాడీ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. యష్ తనతో మాట్లాడటానికి ట్రై చేస్తుంటే వేద మాత్రం కోపంగా పట్టించుకోకుండా ఉంటుంది. అభిమన్యు నెక్లెస్ చూస్తుంటే చిత్ర వస్తుంది. అది తన మెడలో వేయబోతాడు. మాళవిక కోసం కొంటున్నా అని చెప్తాడు. సిటీలోనే కొత్త మోడల్ కొలత కోసం తెలియాలి వేసుకోమని నగల వ్యాపారి కూడా చెప్పడంతో తప్పక చిత్ర ఆ నెక్లెస్ వేసుకుంటుంది. పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిందని అభిమన్యు తనకి బిస్కెట్ వేయడానికి చూస్తాడు కానీ చిత్ర రూడ్ గా మాట్లాడేసి వెళ్తుంది. ఖుషిని రెడీ చేస్తే కూల్ అయిపోతానా ఏంటి? రెండు మూడు రోజులైనా మిస్టర్ యారగెంట్ తో సీరియస్ ఉండాలని అనుకుంటుంది. మళ్ళీ వెంటనే ఈరోజు ఆయనతో బాగుండాలని అనుకుంటుంది.


Also Read: ఇద్దరం కొండెర్రిపప్పలమేనన్న రాహుల్- కావ్య దుగ్గిరాల ఇంటికి సరైన కోడలన్న ధాన్యలక్ష్మి


వేద ఫోన్ చూసుకునేసరికి మిస్టడ్ కాల్స్ 20 ఉంటాయి. తిరిగి కాల్ బ్యాక్ చేసేసరికి ఆమె తిడుతుంది. ఒక బాధ్యత కలిగిన డాక్టర్ అయి ఇలా చేస్తారా? లైఫ్ లో మీ మొహం కూడా చూడనని కోపంగా తిట్టేసి ఫోన్ పెట్టేస్తుంది. ఆ మె మాటలకి వేద చాలా బాధపడుతుంది. కోపంగా యష్ బయటకి వచ్చి ఫోన్ సైలెంట్ లో పెట్టిందేవరని అడుగుతుంది. యష్ నేనే అని చెప్పడంతో వేద సీరియస్ గా చూస్తుంది.