వీళ్లంతా ఎక్కడకు వెళ్లారు..కనీసం చెప్పలేదని దేవయాని ఫైర్ అవుతుంది. ఫణీంద్ర కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో రిషి, వసు, జగతి, మహేంద్ర, ధరణి అంతా వస్తారు. ఎక్కడికి వెళ్లారు ఏంటిది అని విరుచుకుపడుతుంది...ఇంతలో వసుధార హ్యాపీ హోలీ అని దగ్గరకు వెళుతుంది..ఆగు ఆగు అని అంటుంది దేవయాని. ఇంతలో రిషి కూడా హ్యాపీ హోలీ అంటాడు. ఏంటి వసుని తిడదాం అనుకుంటే రిషి ఇలా బుక్ చేశాడనుకుంటుంది దేవయాని. ఫణీంద్ర: నన్ను మీ వదినను కూడా పిలిస్తే వచ్చేవారం కదాదేవయాని: ఎక్కడో బస్తీలో ఆడివస్తే..సంబరపడతారేంటిఫణీంద్ర: పండుగ ఎక్కడైనా పండుగే కదా దేవయానిరిషి: ఆటపాటలు అవన్నీ ఎంత బావున్నాయో దేవయాని: అవి కూడా ఉన్నాయాధరణి: అవును అత్తయ్యగారు ఆ డప్పులు మెడలో వేసుకుని స్టెప్పులేస్తే చాలాబావుందిమండిపడిన దేవయాని..రిషి నీకు రంగులు పడవు..నిన్ను పెంచిన నాకు తెలుసు వెళ్లి ఫ్రెష్ అవ్వు అంటూ పంపించేస్తుంది. ఒకరి తర్వాత ఒకరు జాగ్రత్తగా అక్కడి నుంచి జారుకుంటారు. పైకి వెళ్లిన రిషి.. వసు వచ్చేదాక ఎదురుచూస్తూ ఉంటాడు. 

Also Read: ప్రేమరంగుల్లో మునిగితేలుతున్న రిషిధార- కొడుకుని చూసి మురిసిన జగతి, రగిలిపోతున్న దేవయాని

రిషి:‘వసుధార ఈ రంగులు కడిగి పోతాయి ఏమో కానీ.. ఈ ఆనందం చాలా రోజులు ఉండిపోతుంది’ వసు:‘అవును సార్.. నాకు అదే అనిపించింది. థాంక్యూ సార్’ రిషి:‘వసుధారా థాంక్స్ నేను చెప్పాలి’ దేవయాని చాటుగా వింటూ ఉంటుంది.రిషి:‘ఈ రోజు ఇంత సంతోషంగా ముగిసినందుకు నువ్వే కారణం.. డాడ్‌తో కలిసి హోలీ సంబరాలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి’వసు: ‘మీ ఆనందమే నా ఆనందం సార్.. ప్రపంచంలో రంగులకి చాలా శక్తి ఉంది సార్.. అవి మనసుకి ట్రీట్మెంట్ చేస్తాయి. అయినా అన్ని రంగుల్లో మీ కళ్లల్లో మెరుపు.. పెదవుల మీద చిరునవ్వు.. ఇవే గొప్ప సంతోషాన్ని ఇచ్చాయిఇద్దరి మాటలూ చాటుగా వింటున్న దేవయాని...రగిలిపోతూ ఉంటుంది..గోడపక్కనున్న దేవయానిని రిషి చూస్తాడు...దేవయాని: దొరికిపోయాను అనుకున్న దేవయాని...‘హా రిషీ.. అది.. ఇలా వెళ్తున్నాను.. కాళ్లకు చీర తట్టుకుంది అందుకే ఆగాను అంటూ కవర్ చేస్తుందివసుకి  మాత్రం అర్థమవుతుంది

Also Read: మార్చి 14 రాశిఫలాలు, ఈ రాశివారు అహాన్ని అదుపులో ఉంచుకోవాలి లేదంటే ఊహించనివి చాలా జరుగుతాయి!

జగతీ, మహేంద్రలు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ల మాటలు కూడా దేవయాని చాటుగా వింటుంది. ‘వసు రిషీ చాలా రోజులు తర్వాత సంతోషంగా ఉన్నారు జగతీ.. మనకి అది చాలు’ అంటాడు మహేంద్ర. ఈ ఇంట్లో నేనుతప్ప అందరూ సంతోషంగా ఉన్నారు అనుకుంటుూ వెళ్లిపోతుంది దేవయాని. వసు రిషీలు.. కాఫీని కప్పు, సాసర్‌లో పోసుకుని షేర్ చేసుకుని తాగుతూ ఉంటారు.ఇంతలో రిషి చేతికి హోలీ రంగులు సరిగా వదల్లేదని వసు.. ఆయిల్, కాటన్ తీసుకుని.. క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో దేవయాని రావడంతో..‘హా పెద్దమ్మా.. రంగుల్ని క్లీన్ చేస్తోంది’ అంటాడు. దేవయాని: నన్ను కూడా పిలిచి ఉంటే బావుండేది నీ సంతోషాన్ని చూసి ఉండేదాన్ని. ‘అయినా ఆ మురికి వాడలో చేసుకునేకంటే ఇక్కడే చేసుకోవచ్చు కదా.. అందరం ఇక్కడే ఉండేవాళ్లం’ రిషి: ‘కరెక్టే కదా వసుధార.. నాకెందుకు ఈ ఐడియా రాలేదు’దేవయాని: ‘ఏం వసుధారా.. నువ్వైనా రిషికి చెప్పాలి కదా? నాన్నా సంతోషాలు సంబరాలు ఇవన్నీ కలిసి జరుపుకుంటేనే కదా ఆనందం ఉంటుంది’రిషి: ‘తప్పు చేశాం వసుధార.. చాలా పెద్ద తప్పు చేశాం..’దేవయాని:‘నాన్నా రిషి నువ్వేం తప్పు చెయ్యలేదు.. వసుధారా పాపం నన్ను మరిచిపోయింది’ ‘కదా వసుధారా’వసు: ‘నన్ను రిషి సార్ ముందు ఇరికిస్తోంది ఈమె’ అని మనసులో అనుకుంటుందిదేవయాని:‘సరేలే నాన్నా మీరు సంతోషంగా ఉన్నారు అది చాలు నాకు’రిషి: ‘వసుధారా చూశావా.. పెద్దమ్మ పెద్ద మనసు.. తనని దూరం పెట్టినా తను బాధపడరు. సరే గుర్తు పెట్టుకో.. ఇకపై ఏ సెలబ్రేషన్ జరిగినా పెద్దమ్మా నా పక్కనే ఉండాల్సిందే.. ఈ విషయం బాగా గుర్తు పెట్టుకో’వసు: ‘హా ఓకే సార్’దేవయాని: ‘గుర్తు పెట్టుకో వసుధార’.‘రిషి నా చేతుల్లోంచి ఎప్పటికీ జారిపోనివ్వను’ అంటూ మనసులో ఫిక్స్ అవుతుంది దేవయాని.

అంతా కలిసి తింటూ ఉంటారు. వసు రిషి, జగతీ మహేంద్ర, దేవయాని, ఫణేంద్ర మూడు జంటలు తింటుంటే.. ధరణీ వడ్డిస్తుంది. మహేంద్ర ఫోన్ తీసి.. ‘మనం జంటలు బాగున్నాయి కదా.. ఓ ఫొటో తీసుకుందామా?’ అంటాడు.వసు: ‘మరి ధరణీ మేడమ్? తన భర్త కూడా ఉండి ఉంటే ఫ్యామిలీ ఫొటో బాగుండేది కదా? మేడమ్(దేవయాని) తన గురించి కూడా ఆలోచించండి.. అవును తన పేరేంటీ మేడమ్..’జగతి:‘సైలేంద్ర భూషణ్’దేవయాని:‘వసుధారా ఇవన్నీ నీకు అవసరమా’వసు: ‘లేదు మేడమ్.. నాకేం అవసరం లేదు.. మీకు కూడా మీ అబ్బాయి ఇక్కడికి రావాలనే ఉంటుంది కదా? ఏం అంటారు?’దేవయాని: ఈ వసుధార‘హద్దులు దాటుతోంది ..పగ్గాలు వేయాల్సిందే’రిషి: ‘అవును పెద్దమ్మా అన్నయ్యని ఇక్కడికి రప్పిద్దాం’ మహంద్ర:‘తను కూడా వస్తే బాగుంటుంది’జగతి: ‘అక్కా సైలేంద్రని పిలిపించొచ్చు కదా?’‘పెద్దమ్మా సైలేంద్ర అన్నయ్యా’ అంటూ రిషి మాట పూర్తి కాకుండానే.. ‘రిషీ సైలేంద్ర రాడు.. ఇప్పట్లో రాకపోవచ్చు.. తనకు ఏదో అగ్రిమెంట్ ఉన్నట్లుంది’ అంటుంది దేవయాని.ధరణి: ‘నాకు తెలిసి అత్తయ్యగారు..తను రాకుండా ఆపుతున్నారు’ అనుకుంటుంది రిషి: ‘అయితే అన్నయ్యకు రావడం లేటు అవుతుంది అంటే.. వదిననే అక్కడికి పంపించొచ్చు కదా?’ మహేంద్ర: ‘గుడ్ ఐడియా’దేవయాని: ‘అన్నంత ఈజీ కాదు మహేంద్రా.. అక్కడికి వెళ్లడానికి చాలా తతంగం ఉంటుంది కదా?’వసు: ‘మేడమ్ అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు ప్రోసెస్ చాలా ఈజీ అయిపోయింది’దేవయాని: మరింతగా రగిలిపోతూ..‘ధరణీ.. కూరల్లో కొంచెం ఉప్పు కారాలు తగ్గించు.. ఆరోగ్యాలకు మంచిది కాదు.. చేసే పనుల మీద చేసే వంటల మీద శ్రద్ధపెట్టు’ధరణి బాధని ఆపుకుని వంటగదిలోకి వెళ్లి ఏడుస్తుంది.. అక్కడున్నవారందరకీ ధరణి బాధ అర్థం అవుతుంది.