కష్టాలు గట్టెక్కి పోయినందుకు సంతోషంగా ఉందని జ్ఞానంబ, గోవిందరాజులు అనుకుంటూ ఉంటారు. అఖిల్ తల్లిని పలకరించకుండా వెళ్లిపోతుంటే జ్ఞానంబ ఆపుతుంది. ఏదో ఆఫీసు పనిలో పడి గమనించుకోలేదని చెప్తాడు. జెస్సిని హాస్పిటల్ లో ఎప్పుడు జాయిన్ చేయాలో కనుక్కున్నావా అని అడుగుతుంది. కానీ అఖిల్ మాత్రం బిజీగా ఉండి పట్టించుకోలేదని చెప్తుంటే గోవిందరాజులు తిడతాడు. అప్పుడే జానకి, రామ వస్తారు. గుమ్మం దగ్గర జానకిని ఆపి ఎర్ర నీళ్ళతో దిష్టి తీయమని మలయాళంకి చెప్తాడు. జానకి గొప్ప పని చేసిందని గుడిలో అమ్మవారి దొంగలు కొట్టేస్తే దొంగని పట్టుకుందని అంటాడు. ఎమ్మెల్యే జానకిని తెగ మెచ్చుకున్నాడని చెప్పేసరికి మల్లిక బిత్తరపోతుంది. నిఇలాంటి వాళ్ళు డిపార్ట్ మెంట్ కి చాలా అవసరమని గొప్పగా పొగిడారని సంతోషంగా చెప్తాడు.
Also Read: రాజ్యలక్ష్మికి షాకిచ్చిన సరోజ- లాస్యని అవమానించిన వాసుదేవ్, తులసి చేయందుకున్న నందు
పోలీస్ ఉద్యోగం అంటే బండి దగ్గర మిఠాయిలు అమ్ముకోవడం కాదు దొంగలను పట్టుకోవడం కదా అని మల్లిక సంతోషాన్ని పోగొట్టడానికి చూస్తుంది. ఆ మాటకి గోవిందరాజులు కౌంటర్ వేస్తాడు. బాధని దిగమింగుకుని నవ్వుతూ ఉండటమంటే కష్టంగా ఉందని జానకి మనసులో బాధపడుతుంది. జ్ఞానంబ జానకికి దిష్టి తీస్తుంది. గోవిందరాజులు దంపతులు కాసేపు జానకిని పొగుడుకుంటారు. మల్లిక గదిలో కూర్చుని భయంకరంగా నవ్వుతూ ఉండేసరికి విష్ణు దడుచుకుంటాడు. ఏమైంది దీనికి దెయ్యం పట్టినట్టు నవ్వుతుందని వెళ్ళి తనని కదిలిస్తాడు. ఎంత పిలిచినా మల్లిక నవ్వుతూనే ఉంటుంది దీంతో జానకి తన నోటిలో కర్చీఫ్ కుక్కేస్తాడు. నాకు ఏమి కాలేదు ఇది నవ్వు చికిత్స అని చెప్తుంది. జానకిని పొగిడినందుకు కాసేపు ఉడుక్కుంటుంది. ఏదో ఒకటి చేసి జానకిని విలన్ చేసి ఉద్యోగం వదులుకునేలా చేస్తానని మల్లిక కుట్రలు మొదలుపెడుతుంది.
Also Read: రాహుల్ కి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్ - అపర్ణ కండిషన్ కి ఒప్పుకున్న కావ్య
అఖిల్ చెవుల్లో దూదులు పెట్టుకుని ఉండటం చూసి జెస్సి ఏమైందని అడుగుతుంది. పెద్ద వదిన భజన గురించి వినలేక అని అఖిల్ అంటే అది ఉక్రోషమని జెస్సి అంటుంది. కాసేపు జానకి గురించి జెస్సి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే అఖిల్ మాత్రం తనని ద్వేషిస్తాడు. భోజనానికి రమ్మని పిలుస్తుంది కానీ అక్కడ పెద్ద వదిన గురించి పొగుడుతూ ఉంటారు నేను రానులే అని అంటాడు. జానకి ఎస్సై మనోహర్ అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మీ నాన్న ఉంటే చాలా సంతోషపడే వాళ్ళని రామ మాట్లాడుతూనే ఉంటాడు. మంచి ఎస్సై దొరికాడని మెచ్చుకుంటాడు. అంతకముందు రామ, మనోహర్ కి జరిగిన గొడవ గురించి కూడా చెప్తాడు. రామ మీద కోపం కూడా తన మీద చూపించాడని ఎస్సై మంచి వాడు కాదని జానకి మనసులో అనుకుంటుంది. ఎన్ని మాట్లాడుతున్నా మౌనంగా ఉండటంతో రామ ఏమైందని అడుగుతాడు. కానీ జానకి మాత్రం ఏమి లేదని నిజాన్ని దాచి పెడుతుంది.