అపర్ణ పెట్టిన కండిషన్ కి తాత్కాలికంగా ఒప్పుకుంటున్నట్టు కావ్య చెప్తుంది. అప్పుడే కనకం ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావ్, కోపంతో ఆత్మాభిమానంతో గడప దాటి బయటకి రావొద్దు. నీ బతుకు బాగుండాలి. నిన్ను చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటానని కనకం చెప్తూ ఉండగానే అపర్ణ కోపంగా కావ్య దగ్గర ఫోన్ లాగేసుకుంటుంది. కావ్య ఫోన్ కట్ చేసిందని కనకం బాధపడుతుంది. నేరుగానే కాదు ఫోన్లో కూడా మాట్లాడకూడదని చెప్పి కావ్య ఫోన్ తన దగ్గరే ఉంచుకుంటానని చెప్తుంది. మాటకి రుద్రాణి బాధపడకు నువ్వు చెప్పినట్టు మీ అత్త మారుతుందిలేనని అంటుంది. ఎందుకు ఈ కుటుంబానికి, ఈ అమ్మాయికి అంతగా సపోర్ట్ చేస్తున్నావని రాజ్ రుద్రాణిని అడుగుతాడు. పాతికేళ్ళ క్రితం నేను పడిన బాధ ఎవరు పడకూడదు అందుకే సపోర్ట్ చేస్తున్నానని రుద్రాణి కోపంగా చెప్తుంది.
కావ్య పరిస్థితి ఎలా ఉందోనని కనకం బాధపడుతుంటే ఇంట్లో అందరీ సర్ది చెప్తారు. స్వప్న అద్దంలో చూసుకుంటూ ఈ అందంతో రాహుల్ ని సొంతం చేసుకున్నా, ఇక వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుని దుగ్గిరాల కుటుంబానికి కోడల్ని అవాలి. మిడిల్ క్లాస్ అమ్మాయిని అని తెలిసేలోపు ఎమోషనల్ గా మాట్లాడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అప్పుడే రాహుల్ వస్తాడు. పెళ్లి గురించి ఆలోచించావా అని స్వప్న అడుగుతుంది. జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకుంటున్నాం కదా అని రాహుల్ అంటాడు. స్వప్న మాత్రం తన పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించమని ఎన్నో అవమానాలు ఉంటాయని అంటుంది కానీ రాహుల్ మాయమాటలు చెప్పి కవర్ చేస్తాడు. ఇంటి కోడల్ని ఇంతసేపు నిలబెట్టి పంచాయతీ పెట్టింది చాలు తనని గదిలోకి తీసుకెళ్లమని చిట్టి చెప్తుంది.
Also Read: భ్రమరాంబిక ప్లాన్ సక్సెస్, బలిపశువైన మాళవిక - కిడ్నాప్‌నకు గురైన వేద
ఎవరికి వాళ్ళు తమ గదుల్లో ఖాళీ లేదని అనేసరికి రాజ్ తన గదిలో ఉంటుందని అంటాడు. మరి మీరు ఎక్కడ ఉంటారని కావ్య అడిగేసరికి రోడ్డు మీద అని కసురుగా మాట్లాడతాడు. మీ అంతట మీరు భార్యగా ఒప్పుకునే రోజు మీ భార్యగా అడుగుపెడతానని కావ్య అంటుంది. ఇద్దరూ కాసేపు వాదులాడుకుంటారు. మాటకి మాట ఎదురు చెప్తుంటే అపర్ణ తిడుతుంది. ఎవరి గదిలో ఖాళీ లేకపోయిన ఎక్కడో ఒకచోట సర్దుకుంటానని కావ్య అంటుంది. పంతులు ఒక మాట చెప్పాడు రేపటి వరకు ఒకరినొకరు చూసుకోకూడదని చెప్పేసరికి ముసుగు వేసుకుని తిరగమని చెప్పండి తనకి అలవాటే కదా ఒక 70 ఏళ్ల దాకా అలాగే తిరిగితే బాగుంటుందని అనేసి రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు. రుద్రాణి కొడుక్కి విషయం చెప్పడానికి ఫోన్ చేస్తుంది.
రాజ్ పెళ్ళిలో కూడా కనిపించలేదు ఏం చేస్తున్నావని అంటుంది. వదిన తలదించుకునే పని జరిగిందని రుద్రాణి అంటుంది. స్వప్న వెళ్ళిపోవడం నిజమే కానీ రాజ్ పెళ్లి జరిగింది తన సొంత చెల్లెలితోనే అని చెప్పేసరికి రాహుల్ షాక్ అవుతాడు.
రాహుల్: ఆ చిల్లర షాపు నాడుపుకునే అమ్మాయి స్వప్న చెల్లెలా? వాళ్ళు కోటీశ్వరురాలు కాదా?
రుద్రాణి: ఎన్ని అబద్ధాలు చెప్పిందో చూశావా ఆ స్వప్న. కనకం రిచ్ అని అందరిని మోసం చేసింది. ఇప్పుడు ఆ నిజం బయటపడి అందరూ తలబాదుకుంటున్నారు. నువ్వు పేపర్ చూడలేదా రాజ్ ఒక సామాన్యురాలిని పెళ్లి చేసుకున్నాడని వేశారు. వాళ్ళది పూర్ ఫ్యామిలీ అని నాకు తెలుసు
రాహుల్: ఇంత మోసమా(నాకు అయినా చెప్పొచ్చు కదా మామ్ నీకు తెలియకుండానే నన్ను గోతిలో పడేశావ్) కనీసం నాకు అయినా చెప్పొచ్చు కదా
రుద్రాణి: నేను ముందే చెప్పాను.. చెప్పి చేస్తే ఏ పని జరగడం లేదని
Also Read: జానకి ఆన్ డ్యూటీ- రామతో గొడవపడిన ఎస్సై మనోహర్, కష్టాలు మొదలాయెనే
రాహుల్: అయితే నేను నువ్వు గర్వపడే పని కాదు చేసింది ఆ రాజ్ లాగే తలదించుకునే పని చేశాను వాళ్ళకి మనకి పెద్ద డిఫరెన్స్ లేదని తిట్టుకుంటాడు.
ఇంట్లో ఉన్న స్టోర్ రూమ్ లో ఉంటానని కావ్య చెప్తుంది. ఆ గదిలో ఉండలేరని పనిమనిషి శాంత అంటుంది కానీ కావ్య మాత్రం అందులోనే ఉంటానని చెప్తుంది.