గుప్పెడంతమనసు జూన్ 8 ఎపిసోడ్ (Guppedantha Manasu June 8th Update)
తన కొడుకు పాండ్యన్ జోలికి రావద్దని వసుధారను బెదిరిస్తాడు తండ్రి మురుగన్. ఈ విషయం మొత్తం చైర్మన్ కు వివరిస్తుంది వసుధార. ఆ తర్వాత రోజు మరుుగన్ నేరుగా చైర్మన్ విశ్వనాథ్ ఇంటికొస్తాడు.
మురుగన్: ఛైర్మన్ అయ్యిండి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. చిన్న పిల్లలు చేసిన తప్పుల్ని చూసి చూడనట్లు వదిలేయాలి. నా కొడుకును కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తే నాకు నచ్చదు.
విశ్వనాథం: బెదిరిస్తున్నావా
మురుగన్: బెదిరింపులు, వార్నింగ్‌లు నాకు తెలియవు. పెద్దవాళ్లు కావడంతో మర్యాదగానే చెబుతున్నాను. నిజంగా నేను వార్నింగ్ ఇవ్వాలనుకుంటే కత్తి కొబ్బరిబొండాన్ని కాకుండా మీ నోటి నుంచి మాట రాకుండా చేస్తుంది. మా వాడు ఏరుకోరి ఎంచుకున్న కాలేజీ అది. నువ్వు కాలేజీ నుంచి పాండ్యన్‌ను సస్పెండ్ చేస్తే వాడు భయపడతాడు. వాడు భయపడితే నాకు కోపం వస్తుంది. ఆ కోపంలో ఏదైనా చేయచ్చు. ఏదైనా జరగొచ్చు. తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. అసలే రోజులు బాగాలేవు. బయట క్రైమ్ ఎక్కువగా జరుగుతోంది.
Also Read: వసుధార మాట వినిపించి పరుగుతీసిన రిషి, కాలేజీలో వసుకి బెదిరింపులు!
కేడీ బ్యాచ్ తనను క్లాస్‌రూమ్‌లో అవమానించడంతో వసుధార సహించలేకపోతుంది.ఆ బ్యాచ్‌ను కాలేజీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని ప్రిన్సిపాల్‌తో పట్టుపడుతుంది. టీచర్లను అడుగడుగునా అవమానించడం తట్టుకోలేకపోతున్నానని అంటుంది. వారిని సస్పెండ్ చేయలేకపోతే కాలేజీ నుంచి తాను వెళ్లిపోతానని అంటుంది. ఈ విషయం గురించి ఛైర్మన్ విశ్వనాథానికి చెబుతాడు ప్రిన్సిపాల్. కానీ మురుగన్ ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చి విశ్వనాథం భయపడతారు. ఈ విషయాన్ని రిషితో చర్చించిన విశ్వనాథం సస్పెన్షన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదంటాడు. అప్పుడు ఆ కేడీ బ్యాచ్ ని కంట్రోల్ చేసేందుకు కాలేజికి వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంటాడు రిషి.
కాలేజీలో అడుగుపెట్టిన రిషి
రిషి కాలేజీలో అడుగుపెడతాడు. ఆ సమయంలో కాలేజీ ముందు కేడీ బ్యాచ్ ఫుట్‌బాల్ ఆడుతూ కనిపిస్తారు. కాలేజీ ముందు ఆటలేంటని ప్రశ్నించిన ఓ లెక్చరర్ ను అవమానిస్తారు. ఇంతలో రిషి రావడంతో కాలేజీకి కొత్త లెక్చరర్ వచ్చాడనుకుంటూ...అందరిముందే అవమానించాలని డిసైడ్ అవుతారు. ఫుట్ బాల్ తో రిషిని కొట్టాలని చూస్తారు. కానీ వారి ప్లాన్ ముందే పసిగట్టిన రిషి రివర్స్ షాట్ కొట్టి పాండ్యన్ బ్యాచ్ మెంబర్‌కు దెబ్బతగిలేలా చేస్తాడు. తన స్నేహితుడికి దెబ్బ తగలడంతో పాండ్యన్ కోపంతో రగిలిపోతాడు. ఆ వెంటనే రిషిని కిందపడేయాలని తను వెల్లేదారిలో తాడు కడతాడు. ఆ విషయాన్ని మరో లెక్చరర్ వచ్చి చెబుతాడు. అది వినగానే వసుధార పరుగున వెళుతుంది. రిషి మాత్రం ఆ తాడు వరకూ వచ్చి దాన్ని దాటుకుంటూ వెళ్లిపోతాడు. పాండ్యన్ బ్యాచ్ దీన్ని మరో అవమానంగా ఫీలవుతారు. మరో ప్లాన్ తో రిషికి బొమ్మ కనపడేలా చేస్తానంటాడు పాండ్యన్.
Also Read: ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి!
మురుగన్ కి రిషి వార్నింగ్
నేరుగా ప్రిన్సిపాల్ రూమ్‌కు వెళ్లిన రిషి ఆయన్ని కలుస్తాడు. కేడీ బ్యాచ్ అరాచకాలు హద్దులు దాటుతున్నాయని , రోజురోజుకు దిగజారుతున్నారని రిషితో చెబుతాడు ప్రిన్సిపాల్. వాళ్లకు మొదట్లోనే వార్నింగ్ ఇస్తే బాగుండేదని, ఇంతదాక వచ్చేది కాదు కదా అని ప్రిన్సిపాల్‌తో అంటాడురిషి. వారికి వార్నింగ్ ఇస్తే తనతో పాటు మ్యాథ్స్ లెక్చరర్‌ను ఎలా ఇబ్బంది పెట్టారో రిషికి వివరిస్తాడు ప్రిన్సిపాల్. కేడీ బ్యాచ్‌ను సస్పెండ్ చేయాలని ప్రయత్నిస్తే వసుధారతో పాటు విశ్వనాథానికి మురుగన్ వార్నింగ్ ఇచ్చాడని చెబుతాడు. అప్పుడు క్యాడీ బ్యాచ్ తో పాటూ మురుగన్ కి కూడా సీరియస్ వార్నింగ్ ఇవ్వాలని డిసైడ్ అవుతాడు రిషి. ఆ మురుగన్ మంచివాడు కాదని ఎదురుతిరిగిన వాళ్లని చంపేస్తాడని ప్రిన్సిపాల్ చెబుతాడు. కానీ స్టూడెంట్స్‌లో మార్పు కోసం తాను ఎంత దూరమైన వెళతానంటాడు రిషి. ముందు మురుగన్ కి బుద్ధి చెబితే వీళ్లు సెట్టవుతారని చెప్పి మురుగన్ అడ్రస్ తీసుకుంటాడు.
మరోవైపు రిషిపై ఆగ్రహంతో ఊగిపోతున్న కేడీ బ్యాచ్ కారు టైర్లో గాలితీసేస్తారు. ఆ విషయం తెలియని రిషి కారు ఎక్కడానికి రెడీ అవుతాడు. అక్కడే ఉన్న పాండ్యన్ బ్యాచ్ సార్ గాలిపోయిందంటూ ఆటపట్టిస్తారు. నవ్వుతూనే కారు దిగిన రిషి టైర్ మార్చుకుని వెళ్లిపోతాడు. షాక్ అవుతాడు కేడీ బ్యాచ్..
గుప్పెడంతమనసు ఎపిసోడ్ ముగిసింది