గుప్పెడంతమనసు జూన్ 7 ఎపిసోడ్ (Guppedantha Manasu June 7th Update)
కాలేజీలో కేడీ బ్యాచ్ విషయంలో వసుధార స్ట్రాంగ్ గా ఉండడంతో ఆ బ్యాచ్ లీడర్ పాండ్యన్ తండ్రి మురుగన్ వసుధార ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు.
మురుగన్: కాలేజీతో నాకేం పనిలేదు మీ కూతురి సంగతి చూస్తానంటూ బెదిరిస్తాడు. పిల్లలన్నాక అల్లరి చేస్తారు చూసి చూడనట్టుపోవాలి కానీ ఏంటిదంతా..నిన్ను మట్టిలో కలిపేస్తాను
వసు: బుద్ధి చెప్పాల్సిన మీరే ఇలా ప్రవర్తిస్తే పిల్లలు ఏం బాగుపడతారు మీకు అసలు బుద్ధుందా
మురుగన్: నేనెవరో తెలియక ఇలా ప్రవర్తిస్తున్నావ్..
వసు: మీ పిల్లలకు ఇబ్బందిగా ఉంటే కాలేజీ మాన్పించండి..చిల్లర వేషాలు వేస్తే ఊరుకోను
మురుగన్: ఈ సారి మర్యాదగా చెబుతున్నాను..మరోసారి రిపీట్ అయితే బావోదు
చక్రపాణి సర్దిచెబుదాం అని ప్రయత్నించినా వసుధార వెనక్కు తగ్గదు
మురుగన్: ఇక్కడ నా కొడుక్కి ఏ కాలేజీ నచ్చలేదు..ఆ కాలేజీ ఒక్కటే నచ్చింది..పిచ్చి పిచ్చి వేశాలేస్తే నీ ప్రాణాలు మట్టిలో కలిపేస్తాను
వాళ్లంతా వెళ్లిపోయాక చక్రపాణి భయపడిపోతాడు..మనకెందుకమ్మా ఈ గొడవలన్నీ నువ్వు రేపటి నుంచి కాలేజీకి వెళ్లొద్దంటాడు కాను వసుధార మాత్రం ఆ అల్లరి బ్యాచ్ కి బుద్ధి చెప్పాల్సిందే అంటుంది. వాళ్లమీద ఛైర్మెన్ గారికి కంప్లైంట్ ఇస్తానంటుంది...
Also Read: కేడీ గ్యాంగ్ మీద కంప్లైంట్ ఇస్తానన్న వసు- తండ్రిని తలుచుకుని బాధపడుతున్న రిషి
ప్రిన్సిపాల్ ని తీసుకుని చైర్మన్ దగ్గరకు కంప్లైంట్ ఇచ్చేందుకు వెళుతుంది వసుధార... చైర్మన్ ఇంకెవరో కాదు రిషికి ఆశ్రయం ఇచ్చిన ఏంజెల్ తాతయ్య. రిషి చేయిపట్టుకుని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది ఏంజెల్..నా వంట టేస్ట్ చూద్దువుగాని అని... ఇంతలో ఎంట్రీ ఇస్తారు వసుధార వాళ్లు... రిషి అప్పుడే పాటలు వినేందుకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు... కాలేజీలో సమస్య గురించి ప్రిన్సిపాల్, వసుధార కలసి వివరిస్తారు. వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ హామీ ఇస్తాడు. సరే సార్ అంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గరకు ఏంజెల్ రావడంతో ఇయర్ ఫోన్స్ తీసి పక్కనపెడతాడు...అప్పుడే థ్యాంక్యూ సార్ అన్న వసుధార మాట రిషి చెవిన పడుతుంది. వెంటనే లేచి వెళతాడు కానీ అప్పటికే వసుధార వెళ్లిపోతుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చారా అని చైర్మన్ ను అడిగుతాడు రిషి. ఇన్నాళ్లూ ఎవరూ రానిది ఇప్పుడెవరు వస్తారన ఏంజెల్ అనడంతో...నాకెవ్వరూ లేరు అంటాడు రిషి
Also Read: మే 7 రాశిఫలాలు, మంత్ర-తంత్ర-రహస్య అధ్యయనాల పట్ల ఈ రాశివారికి ఆసక్తి పెరుగుతుంది!
మరోవైపు కాలేజీలో కేడీ బ్యాచ్ రగిలిపోతుంటారు. వసుధార ఎందుకిలా చేసింది తనపని పట్టాలని డిసైడ్ అవుతారు. ఈమెను చూసిన ధైర్యంతో మిగిలిన లెక్చరర్లు కూడా అలాగే తయారవుతారు..అందుకే అది భయపడేలా చేయాలి అనుకుంటారు. ఓ ప్లాన్ వేసుకుని క్లాస్ రూమ్ లోకి వెళ్లి కూర్చుంటారు. క్లాస్ కి వస్తుంది వసుధార. అయినా అస్సలు పట్టించుకోకుండా అంతా అల్లరి చేస్తుంటారు. పాండ్యన్ బ్యాచ్‌కు మాటలతో మంచి చెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ అవేమీ పట్టించుకోరు పైగా మాటకు మాట చెబుతూ అవమానించేలా మాట్లాడతారు. వారి మాటలకు ఆవేశపడిన వసుధార మిమ్మల్ని సస్పెండ్ చేసే హక్కును ఛైర్మన్ తనకు ఇచ్చాడని, ఇదే చివరి అవకాశం అని హెచ్చరిస్తుంది. వసుధార క్లాస్ చెప్పడానికి సిద్ధమవుతుండగా బెలూన్‌లో వాటర్ నింపి ఆమెపై పడేలా చేస్తారు కేడీ బ్యాచ్. వసుధారపై నీళ్లు పడటంతో స్టూడెంట్స్ అందరూ ఆమెను చూసి నవ్వుతారు. పాఠాలు చెప్పినంత ఈజీ కాదు కేడీ బ్యాచ్‌తో పెట్టుకోవడం అంటే అని వసుధారతో అంటాడు పాండ్యన్. కోపంగా క్లాస్ రూమ్ నుంచి వెళ్లిపోతుంది
జగతి ఆవేదన
మరోవైపు వసుధారను వెతుక్కుంటూ మరోసారి ఆమె పాత ఇంటికి వస్తుంది జగతి. కానీ ఇంటికి తాళం వేసుండటంతో నిరాశ పడుతుంది. వాళ్లు ఎక్కడికి వెళ్లారని పక్కింట్లో ఉన్న మహిళను అడుగుతుంది జగతి. ఆమె ద్వారా వసుధార తల్లి చనిపోయిన నిజం విని జగతి షాక్ అవుతుంది. వసుధార పెళ్లి ఆగిపోవడం వల్లే సుమిత్ర గుండెపోటుతో చనిపోయిందని తెలిసి జగతి ఎమోషనల్ అవుతుంది. వసుధార తల్లి మరణానికి తానే కారణమని బాధపడుతుంది. అందరి కన్నీళ్లకు తానే బాధ్యురాలినని అంటూ కుప్పకూలిపోతుంది.
గుప్పెడంత మనసు ఎపిసోడ్ ముగిసింది