వేద మాటలు తలుచుకుని సులోచన చిర్రుబుర్రులాడుతుంది. ఎందుకు అంత కోపం అన్నది నీ కూతురే కదా ఆ మాత్రానికి అలిగితే ఎలా అని శర్మ అంటుండగా వేద వస్తుంది. బాగా తలనొప్పిగా ఉంది స్ట్రాంగ్ గా ఒక కాఫీ తీసుకురావా అంటుంది. తప్పయిపోయింది అలా మాట్లాడి ఉండకూడదని సోరి చెప్తుంది. మాళవిక చాలా దీనమైన స్థితిలో చెత్తకుప్పలో పడి ఉంది వాళ్ళని అలా చూసి వదిలేసి రాలేకపోయాను. మాళవికని వద్దని ఆయన చెప్తూనే ఉన్నారు కానీ ఒప్పించి అతి కష్టం మీద తీసుకొచ్చాను. ఆ సంస్కారం నేర్పింది నువ్వే కదా దాన్ని వదులుకోమని నువ్వే చెప్తుంటే తట్టుకోలేక నోరు పారేసుకున్నాను క్షమించమని అడుగుతుంది. అయినా కూడా సులోచన బెట్టుగా ఉంటుంది.
Also Read: కేడీ గ్యాంగ్ మీద కంప్లైంట్ ఇస్తానన్న వసు- తండ్రిని తలుచుకుని బాధపడుతున్న రిషి
మామూలుగా అయితే నేను ఈ ఇంటికి చేసిన దానికి ఈ ఇంట్లో చోటు కూడా ఇవ్వకూడదు. కానీ నడి రోడ్డు మీద అలా చూసి తీసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఆదిత్యని తీసుకెళ్ళి బతకడం కష్టం. అందుకే ఎందుకు ఇక్కడ ఉండకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ నేను లేకపోతే ఆదిత్య ఉండదు అని చెప్పేలా వాడి మైండ్ ని మెకోవర్ చేయాలి. వేద ఇక్కడ ఉండటానికి తనకున్న అర్హత ఏంటి? ఇక్కడ ఉండకూడదు అనేందుకు మాళవికకి లేని అర్హత ఏంటని ఆలోచిస్తుంది. నీ మంచితనమే నీ కాపురాన్ని ఏం చేస్తుందోనని భయంగా ఉంది. ఇది సరైన నిర్ణయం కాదని సులోచన, శర్మ కూడా చెప్తారు. నీ భర్త వదిలేసిన భార్యతో ఒకే ఇంటి కప్పు కింద ఉంటే ఎన్ని మాటలు అంటారో తెలుసా అని శర్మ అంటే వేద మాత్రం అలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం తనకి లేదని అంటుంది. తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా కూడా మాళవికని ఇంట్లో నుంచి పంపించే ప్రసక్తే లేదని తేల్చి చెప్తుంది.
Also Read: వేడి వేడి నీళ్ళతో అభిమన్యుకి నీలాంబరి పాదపూజ- మాళవిక కోసం సులోచనని తిట్టిన వేద
వేద భర్తతో సంసారం చేయలేదు, కానీ మాళవిక భర్తతో సంసారం చేసి ఇద్దరు పిల్లల్ని కన్నది. ఇక ప్రేమ అవసరం. అవసరం తిరితే పోతుంది. నా మీద ప్రేమ పుట్టే పరిస్థితి తీసుకొస్తే ఈ ఇంట్లో చోటు మాళవికకి వేదకి కాదు. ఇక్కడ పిల్లలు, భర్త నా వాళ్ళు ఆలోచిస్తే హక్కులన్నీ నావే. అప్పుడు నేను ఎందుకు ఎక్కడికో వెళ్లిపోవాలి. ఇక్కడే ఉంటే నేను ఫైనాన్షియల్ గా సొసైటీ పరంగా స్ట్రాంగ్ గా ఉంటాను. ఈ పొజిషన్ నేను వదలను. పోగొట్టుకున్నవన్నీ పొందేందుకు చేయాల్సినవన్నీ చేస్తాను నేను మాత్రం కదలని అనుకుంటుంది. యష్ కి వసంత్ ఫోన్ చేస్తాడు. చిత్ర కూడా వేదతో మాట్లాడి సంతోషంగా ఉంటుంది. గుడ్ న్యూస్ తో రమ్మని చెప్తుంది. అందరినీ గుడ్ న్యూస్ తో రమ్మని అంటావ్ కానీ నాకు మాత్రం ఏమి ఇవ్వవని యష్ బుంగమూతి పెడతాడు. లాలీ పాప్ కావాలని ఇన్ డైరెక్ట్ గా ముద్దు పెట్టమని అడుగుతాడు. కానీ పిచ్చి వేద నిజంగా లాలీ పాప్ తీసుకొచ్చి ఇస్తుంది. కాసేపు అటూ ఇటూ తిరిగి వేద భర్తకి ముద్దు పెడుతుంది. అది చూసి మాళవిక రగిలిపోతుంది. మళ్ళీ బాటిల్ ఎత్తి తాగుతుంటే ఆదిత్య వచ్చి తాగొద్దని బతిమలాడతాడు.