మాళవిక నిద్రలేచి వస్తే మాలిని వెటకారంగా మాట్లాడి తనకి గడ్డి పెడుతుంది. రాత్రి తీసుకొచ్చి ఇంట్లో పెడితే పనిలో సాయం చేయాలా అని అడుగుతుంది. ఆమె గెస్ట్ ఇంట్లో కొన్ని రోజులు మాత్రమే ఉండి వెళ్లిపోతుందని మాలిని అంటుంది. ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే దాన్ని సంసారులు ఉండే కొంప అనరని తిడుతుంది. ఆవిడ అన్న దాంట్లో తప్పేమీ లేదు మీ ఇంట్లో నాలాంటి వాళ్ళు ఉండకూడదు. అయినా మీరు బలవంతంగా తీసుకొచ్చారు కానీ నేనేమీ కావాలని రాలేదు వేరే ఇల్లు చూసుకుని దొరకగానే కొడుకుని తీసుకుని వెళ్లిపోతానని మాళవిక చెప్తుంది. ఆదిత్యని తీసుకుని వెళ్లిపోతానని అనేసరికి అందరూ షాక్ అవుతారు. తను చాలా డిస్ట్రబ్ అయ్యాడు ఇప్పుడు తనకి నాన్న, నానమ్మ అవసరం కనీసం తను సర్దుకునే దాకా అయినా ఇక్కడ ఉండటం అవసరమని వేద అంటుంది.


Also Read: తనకి అర్జెంట్ గా మనవడిని కనివ్వాలని కోడలికి కండిషన్ పెట్టిన రేవతి- బిత్తరపోయిన ముకుంద


నేను ఇక్కడ కేవలం నా కొడుకు కోసం ఉన్నాను మాటలు పడటం కోసం కాదని మాళవిక చెప్పేస్తుంది. మీరు అలా మాట్లాడితే అలా అనకుండా ఎలా అంటుందని వేద అంటుంది. ఆదిత్య ఇక్కడే ఉండేలా చేస్తానని చెప్తుంది. ఈ మాటలన్నీ చాటుగా మాళవిక విని నా కొడుకు కావాలి కానీ నేను వద్దా ఒక్కొక్కరి సంగతి తేలుస్తానని మనసులో అనుకుంటుంది. యశ ఖుషిని తీసుకుని స్కూల్ కి బయల్దేరుతుంటే మాళవిక ఆదిత్యని కూడా తీసుకుని వెళ్ళమని అడుగుతుంది. వేద తీసుకుని వెళ్ళమని అడగ్గానే సరే అంటాడు. చూసేవాళ్ళు అందరూ కొడుకుని తండ్రికి దగ్గర చేస్తున్నానని అనుకుంటారు. కానీ ఈ బుర్రలో ఉన్న అసలు ఆలోచన ఎవరికీ అర్థం కాదు. ముందు కొడుకు బాధ్యత తీసుకోవాలి. తర్వాత కొడుకు కన్నతల్లి అని నా బాధ్యత కూడా తీసుకోవాలి. ఈ ఆలోచన ఇప్పుడే పురుడు పోసుకుందని మనసులో అనుకుంటుంది. వేద పిల్లల సంగతి చూస్తే ఇక నేను చూసుకోవాల్సింది నేను చూసుకుంటానని అంటుంది.


చాలా రోజుల తర్వాత అమ్మ ఇంత సంతోషంగా ఉండటం చూస్తున్నా, అయితే నేను ఇక్కడ నాన్నతో కలిసి ఉండటం అమ్మకి సంతోషం కలిగిస్తుందని ఆదిత్య అనుకుంటాడు. నీలాంబరి అభికి మరో లవ్ టెస్ట్ పెట్టడానికి రెడీ అయిపోతుంది. నీ భార్యగా నేను నీకు పాద పూజ చేయాలని అనుకుంటున్నట్టు చెప్తుంది. హమ్మయ్య బతికిపోయాను ఇక తనతో ఫస్ట్ నైట్ తర్వాత పిల్లలు, ఆ తర్వాత ఆస్తి అని అభిమన్యు సంబరపడతాడు. పెద్ద గంగాళంలో వేడి నీళ్ళు తీసుకొచ్చి పాద పూజ చేయాలి కాళ్ళు పెట్టమని అడుగుతుంది. అంత వేడి నీళ్ళు పోస్తే చచ్చిపోతానని అంటాడు. అంటే ఏంటి నీకు నా మీద ప్రేమ లేదా అని అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతుంది. కాళ్ళు కాలితే ఆయింట్మెంట్ రాసుకుని పడుకోవచ్చు ప్రేమ లేదంటే ఆస్తి పోతుందని ఖైలాష్ ఒప్పిస్తాడు. వేడి వేడి నీళ్ళు అభి కాళ్ళ మీద పోస్తుంటే అబ్బా అని అల్లాడిపోతాడు. ఈ టెస్ట్ కూడా పాస్ అయిపోయావని అంటుంది. పరిస్థితులని బట్టి ఎప్పుడు ఏ టెస్ట్ కావాలంటే అది పెడతా ఇది నిరంతర ప్రక్రియ అనేసి వెళ్ళిపోతుంది. ఈవిడ కంటే మాళవిక బెటర్ కదా అని ఖైలాష్ అంటాడు.


Also Read: మూడేళ్ళ తర్వాత రిషి రీ ఎంట్రీ- ఎన్ని చెప్పినా జగతిని క్షమించలేనన్న మహేంద్ర


మాళవిక స్లమ్ ఏరియాలో ఇల్లు కావాలని బ్రోకర్ కి చెప్తుంది. తను చెప్పినట్టే బ్రోకర్ వేదకి ఫోన్ చేసి మాళవిక చెప్పినట్టే చెప్తాడు. ఇక్కడ మాకు ఇల్లు ఎవరికి అవసరం లేదని అంటుంది కానీ బ్రోకర్ మాత్రం మాళవిక ఇల్లు అద్దెకి కావాలని అన్నారని అంటాడు. నిజంగానే ఇల్లు ఖాళీ చేసి స్లమ్ ఏరియాకి వెళ్లిపోవాలని అనుకుంటుంది వేద ఇప్పుడు అందరికీ బీపీలు పెరిగిపోతాయని అనుకుంటుంది.