దాదాపు మూడేళ్ళ తర్వాత రిషి మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. జైల్లో రిషి ఖైదీలతో మాట్లాడటానికి వస్తాడు. క్షణికావేశంలో చేసిన తప్పుకి ఎంత శిక్ష అనుభవించాలో ఇప్పటికైనా మీకు అర్థం అయ్యిందని అనుకుంటున్నా. ఏదైనా కావాలంటే లాక్కోకూడదు సాధించుకోవాలి. కోపంతో ఉండకూడదని అంటాడు. రిషి మాటలకు ఖైదీలు మీరు చెప్పినట్టే వింటామని అంటారు. జీవితంలో ఒక్క మాట బాగా గుర్తు పెట్టుకోండి ఎవరినీ అంత త్వరగా నమ్మొద్దు నమ్మిన వాళ్ళని మోసం చేయవద్దని చెప్పేసి వెళ్ళిపోతాడు. జైల్లో కానిస్టేబుల్ రిషిని మెచ్చుకుంటాడు. ఖైదీలకు మోటివేషన్ క్లాస్ చెప్తాననుకుంటే నవ్వుకున్నాను కానీ మీరు చాలా గొప్పవాళ్ళు కరుడుగట్టిన వాళ్ళని కూడా మార్చేశారని అంటాడు. తన డీటైల్స్ ఎవరు అడిగినా కూడా ఇవ్వొద్దని రిషి కానిస్టేబుల్ కి రిక్వెస్ట్ చేస్తాడు.
Also Read: రుద్రాణి మీద చీటింగ్ కేసు పెడతానన్న రాజ్- భర్తని ప్రేమలో పడేసేందుకు కావ్య ప్రయత్నాలు
నేను ప్రజంట్ లోనే ఉండాలని అనుకుంటున్నా రేపటిని, గతాన్ని తలుచుకోవాలని అనుకుంటున్నానని చెప్పి రిషి వెళ్ళిపోతాడు. రిషి కోసం జైలు బయట ఏంజెల్ ఎదురుచూస్తూ ఉంటుంది. తనని తీసుకుని సినిమాకు వెళ్దామని అంటే రిషి మాత్రం తనకి వేరే పని ఉందని అంటాడు. ఏంజెల్ మాత్రం ప్లీజ్ రావచ్చు కదా అని బతిమలాడుతుంది. వసు కాలేజ్ నుంచి డల్ గా ఇంటికి వస్తుంది. ఫస్ట్ డే కాలేజ్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉందని వసు ఇంట్లో ఉండే అమ్మాయి అడుగుతుంది. వెరీ బ్యాడ్ అంటుంది. కాలేజ్ బాగోలేదా ఇబ్బందిగా ఉందా అని చక్రపాణి అడుగుతాడు. అవును నాన్న ఈ కాలేజ్ లో స్టూడెంట్స్ లెక్చరర్స్ ని ర్యాగ్ చేస్తున్నారు పొద్దున ఒకడు నన్నే ఒక స్టూడెంట్ బురిడీ కొట్టించాడని చెప్తుంది. కాలేజ్ బాగోలేదు కదా మరి మానేయమని అంటాడు. లేదు వాళ్ళని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత లెక్చరర్స్ ది కదా మారుస్తానని చెప్తుంది. కానీ వాళ్ళు నీకు ఏ కీడు తలపెడతారోనని చక్రపాణి భయపడతాడు. వసు మాత్రం అందుకు ఒప్పుకోదు.
ఏంజెల్, ఋషి ఇంటికి వస్తారు. ఖైదీలకు నువ్వు చెప్పే పాఠాలకు వాళ్ళలో పరివర్తన వస్తుందట జైలర్ ఫోన్ చేసి చెప్పాడని ఏంజెల్ తాతయ్య మెచ్చుకుంటాడు. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అందుకు కారణం మీరే అని రిషి అంటాడు. అప్పుడు ఏంజెల్ గతం గుర్తు చేసుకుంటుంది. రిషిని కత్తితో పొడిచిన తర్వాత హాస్పిటల్ కి తీసుకువచ్చినప్పుడు తన పాకెట్ లో ఏంజెల్ విజిటింగ్ కార్డ్ చూసి డాక్టర్స్ ఫోన్ చేస్తారు. ఏంజెల్ వచ్చి రిషికి బ్లడ్ ఇచ్చి తనని కాపాడుతుంది. మీరు చేసిన సాయం లైఫ్ లో మర్చిపోలేను నన్ను కాపాడటమే కాదు మీ ఇంట్లో మనిషిలాగా చూసుకుంటున్నారు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని రిషి చెప్తాడు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ మన మధ్య అలాంటివి ఎందుకని ఏంజెల్ సర్ది చెప్తుంది. మహేంద్ర దిగులుగా కూర్చుంటే ధరణి వచ్చి కాఫీ ఇస్తుంది. అప్పుడే జగతి రావడం చూస్తుంది.
Also Read: అభిమన్యుకి నీలాంబరి లవ్ టెస్ట్, ఫుల్ ఫన్- యష్ ఇంట్లో సెటిలైన మాళవిక
చిన్నత్తయ్యకి అంత పెద్ద శిక్ష వేశారు కదా ప్లీజ్ చినమావయ్య తనతో మాట్లాడొచ్చు కదా అని ధరణి మహేంద్రని బతిమలాడుతుంది. మీరు అంతా ఇలా ఉంటే ఇల్లంతా బోసిపోయినట్టు ఉందని చెప్తుంది, ఇప్పుడు కాదు నా కొడుకు ఈ ఇంటిని, కాలేజ్ ని వదిలేసి వెళ్ళినప్పుడే ఆరోజే ఈ ఇంటి కళ కాలేజ్ కళ తప్పింది. మీ చిన్నత్తయ్య అబద్ధం చెప్పిందంటే నేను నమ్మను. ఏదో గట్టి రీజన్ ఉండి ఉంటుంది, ఇక రిషి తప్పు చేశాడంటే నేనే కాదు ఎవరూ నమ్మరు. రిషి తప్పు చేశాడని సాక్ష్యాలు ఉన్నా అవి తప్పని మీ చిన్నత్తయ్యకి కూడా తెలుసని అంటాడు. మీరు ఎంత బాధపడుతున్నారో చిన్నత్తయ్య కూడా అంతే బాధపడుతున్నారని ధరణి అంటుంది. కానీ మహేంద్ర మాత్రం రిషి దూరం అవ్వాలని తన నుదుటి మీద రాసిందే తను అలాంటిది తను ఎందుకు బాధపడుతుందని చెప్తాడు.