కనకం వడ్డీ వ్యాపారికి డబ్బులు ఇద్దామని దాచిన డబ్బు కనిపించవు. నా గదిలో 12 వేలు ఉండాలి మీలో ఎవరైనా తీశారా అని ఇంట్లో వాళ్ళని అడుగుతుంది. అప్పుకి స్వప్న మేకప్ కిట్ కోణం సాగతి గుర్తుకు వచ్చి తనని పిలుస్తుంది. నువ్వు కొన్న మేకప్ కిట్ కి 11 వేలు ఎక్కడవని అప్పు అంటే అమ్మ డబ్బులు తీసుకుంటే తప్పా అని స్వప్న అంటుంది. మన ఇంట్లో డబ్బులు తీసుకుంటే తిడతారు ఏంటని రివర్స్ అవుతుంది. నీకు ఇల్లు ఎక్కడ ఉంది, కావ్య వెళ్ళిపోయిన తర్వాత రూపాయి రూపాయి సంపాదించిన డబ్బు కూడబెడితే వాటిని ఖర్చు పెట్టేస్తావా అని కనకం తిడుతుంది. సంపాదించాడులె బోడి అని తక్కువ చేసి మాట్లాడుతుంది. నాలుగు రోజులు ఆగితే దుగ్గిరాల ఇంటి కోడలిని అవుతాను తర్వాత ఎంత డబ్బు కావాలంటే అంత పడేస్తానని అంటుంది. కనకం, కృష్ణమూర్తి కూతుర్ని తిడతారు.


Also Read: అభిమన్యుకి నీలాంబరి లవ్ టెస్ట్, ఫుల్ ఫన్- యష్ ఇంట్లో సెటిలైన మాళవిక


కావ్య తలలో పూలు పెట్టి ధాన్యలక్ష్మి అందంగా ముస్తాబు చేస్తుంది. ఆయన ఇప్పటికీ తనని భార్యగా అంగీకరించలేదు కదా అని కావ్య భయపడుతుంది. ఏం కాదులే ఈరోజు నుంచి కొత్త జీవితం మొదలుపెట్టమని ధైర్యం చెప్పి పాల గ్లాసు ఇచ్చి రాజ్ గదిలోకి పంపిస్తుంది. కావ్య గదిలోకి రావడంతోనే రాజ్ మొహం మాడిపోతుంది. రాహుల్ తప్పు చేశాడని తెలియగానే నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని నాకు తెలుసులే అంటాడు.


రాజ్: నేను ఇప్పుడే కాదు ఎప్పటికీ ఇలాగే మాట్లాడతాను నువ్వు నా నుంచి ఏమి ఎక్స్ పక్ట్ చేయకూడదు


కావ్య: నేరస్తులకు, నిరపరాధులకి ఒవే విధమైన శిక్ష వేస్తారా మీరు


రాజ్: నువ్వు నిరపరాధివి కాదు ఆగర్భ శత్రువువి నీ తప్పు లేదని నిరూపించుకోమన్నది నిరూపించుకోలేవని నమ్మకంతోనే


కావ్య: మరి నిరూపించుకున్నా కదా


రాజ్; అయినా నువ్వు నాకు శత్రువులానే కనిపిస్తావు


కావ్య: ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పాలి. ఎందుకు ఇవన్నీ నా తప్పు లేదని నిరూపించుకుంటే ఈ ఇంట్లో నాకు స్థానం అన్నారు. మా అక్క కోసమే కాదు నా కాపురం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి రాహుల్ ఎలాంటి దుర్మార్గుడో నిరూపించుకున్నా కానీ నిరపరాధికి కూడా శిక్ష వేస్తారా?


రాజ్: నిన్ను చూస్తే నన్ను చూసుకుంటున్నట్టు ఉంటుంది. కానీ నాకంటే నీకు అహంకారం ఎక్కువ భార్యలా ఉండవు


Also Read: కావ్యని ఆగర్భ శత్రువన్న రాజ్- రుద్రాణిని వాయించేసిన అత్తాకోడళ్ళు


కావ్య: భార్య అంటే ఎలా ఉండాలి ఇగో ఉండకూడదా? సమానత్వం ఉండకూడదా


రాజ్: అది సమానత్వం కాదు డామినేటింగ్ అందుకే నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. నేను నిన్ను కాదని అనడానికి ఏ కారణం చూపించలేను నువ్వు ఏదో ఒక కారణం చెప్పి మీ పుట్టింటికి వెళ్లిపో ఇంకెప్పుడు తిరిగి రావద్దు


కావ్య: ఎప్పటికైనా నేను మీ మనసులో స్థానం సంపాదించుకోగలను ఏమో? మనది ఆ బ్రహ్మ వేసిన ముడి. ఏమో మీరు నన్ను ప్రేమిస్తారు ఏమోనని సిగ్గుపడుతుంది


రాజ్: నువ్వు ఎంత గొప్పగా చెప్పినా మనం కలిసే అవకాశం లేదు గుర్తు పెట్టుకో


కావ్య తీసుకొచ్చిన పాలు రాజ్ డస్ట్ బిన్ లో పారపోయడం ధాన్యలక్ష్మి చూసి బాధపడుతుంది. మీ అన్నావదిన కాపురం నిలబెట్టుకునే విషయంలో సహాయం చేయమని ధాన్యలక్ష్మి కళ్యాణ్ దగ్గరకి అడుగుతుంది. వాళ్ళని ఎలాగైనా కలుపుతానని మాట ఇస్తాడు.