గుప్పెడంతమనసు జూన్ 10 ఎపిసోడ్ (Guppedantha Manasu June 10th Update)
కేడీ బ్యాచ్‌కు బుద్ది చెప్పాలని డిసైడ్ అయిన రిషి పాండ్యన్ తండ్రి మురుగన్‌కు గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఆ విషయం తెలుసుకుని మెచ్చుకున్న విశ్వనాథం వాళ్లకి బుద్ధి చెప్పేందుకు రిషిని కాలేజీకి వెళ్లాలని కోరుతాడు. ఇతర కాలేజీలలో అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతల్ని మాత్రమే చేపట్టరాదని జగతి తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటాడు రిషి. లెక్చరర్‌గా బాధ్యతల్ని చేపట్టడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని రిషి గ్రహిస్తాడు. విశ్వనాథం కోరిక మేరకు కాలేజీలో లెక్చరర్‌గా జాయిన్ అవ్వడానికి అంగీకరిస్తాడు.
రిషి ఆచూకీని కనిపెట్టడానికి తన స్నేహితుడైన పోలీస్ ఆఫీసర్ సహాయం తీసుకుంటాడు మహేంద్ర. చాలా రోజుల పాటు వెతికినా కూడా రిషి ఎక్కడున్నాడో తెలియలేదని చెబుతాడు. ఆ మాట విని మహేంద్ర బాధపడుతుంటే దేవయాని-శైలేంద్ర మాత్రం మంచి నటిస్తారు. ఇదే అదనుగా జగతిపై ద్వేషాన్ని బయటపెడతారు
దేవయాని: రిషి తప్పిపోలేదు, అతడిపై చెరగని మచ్చవేశారని అందుకే జీవితంలో నేను మిమ్మల్ని చూడను...మీరు కూడా నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు రిషి చెప్పాడుగా
శైలేంద్ర: రిషి మనసు చాలా గాయపడింది. అందువల్లే మనకు ఎదురుపడకూడదని ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు. అందువల్లే ఇన్ని సంవత్సరాలు వెతికినా అతడు దొరకడం లేదు. అందరం రిషి గురించి ఎవరి దారుల్లో వారు వెతుకుతున్నా అతడు ఎక్కడున్నాడో ఎవరం కనిపెట్టలేకపోతున్నామని బాధను నటిస్తాడు.
మహేంద్ర: రిషి మనకు దగ్గరలోనే ఉన్నాడని అనిపిస్తోందని . మన చుట్టుపక్కల ఊరిలోనో, సిటీలోనే ఉన్నాడని నా మనసు చెబుతోంది. నా కొడుకంటే నాకు ప్రాణం. వాడిని చూడకుండా ఒక్కపూట కూడా ఉండలేను. వాడు కూడా నన్ను చూడకుండా ఉండలేడు. డాడ్ అనే మాట వాటి నోట వెంట విని ఎన్ని సంవత్సరాలు అయ్యిందో...నేను బతికుండగా వాడి పిలుపు వింటానో లేదో అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. నమ్మిన వాళ్లే రిషితో పాటు నన్ను మోసం చేశారు, ఒకరికొకరం కాకుండా చేశారు. అసలు ఢిల్లీ వెళ్లకుండా ఉండుంటే రిషిని బుజ్జగించో, బతిమాలో ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేసేవాడనని అంటాడు. ఒకవేళ రిషి ఉండను అని మొండిపట్టుపడితే తనతో పాటు నేను కూడా అందరికి దూరంగా వెళ్లిపోయేవాడిని
దేవయాని: రిషి దూరం కావడంతో మేము కూడా చిత్రవధ అనుభవిస్తున్నాం, కోపం తగ్గిపోయిన తర్వాత రిషి తిరిగి వస్తాడని అనుకున్నానని, కానీ ఇలా చేస్తాడని అనుకోలేదు
పోలీస్: రిషిపై అంతపెద్ద అభియోగం మోపడానికి కారణం ఏంటో చెబితే రిషి ఎక్కడున్నాడో కనిపెడతాను
జగతి: నేను చెప్పలేను..రిషి వచ్చేవరకూ అపార్థాలు తొలగవు అనేస్తుంది (నిజం చెబితే నీకే డేంజర్ అని కళ్లతోనే ఆమెకు వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర. అతడి బెదిరింపులకు భయపడిన జగతి అసలు కారణాన్ని పోలీస్ ఆఫీసర్‌తో చెప్పలేకపోతుంది.)
మహేంద్ర: ఇదే తన వైఖరి..ఎందుకిలా చేస్తోందో అర్థంకావడం లేదు
Also Read: ఆచార్యగా మారిన రిషి స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశాడు - వసు జస్ట్ మిస్!
కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన వసుధార చాలా సంతోషంగా కనిపిస్తుంది. ఆమె ఆనందం చూసి చక్రపాణి కారణం అడుగుతాడు.
వసుధార: కాలేజీలో వచ్చిన కొత్త వ్యక్తి నా ఆనందానికి కారణం. మురుగన్‌కు ఆ వ్యక్తి వార్నింగ్ ఇచ్చాడు, కేడీ బ్యాచ్ నుంచి ఇకపై లెక్చరర్స్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందరిలో అతడు ధైర్యాన్ని నింపాడు..తనని కలసి అభినందిస్తానని చెపుతుంది. అయితే స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ తన గురించి చెబుతుంటే నాకు మాత్రం రిషి సార్ గుర్తొచ్చారు. రిషి కూడా ఇలాగే కాలేజీలో ఏదైనా సమస్య ఎదురైతే అది పూర్తిగా తొలగిపోయేవరకు నిద్రపోయేవాడు కాదు
Also Read: మీ తీరు ఎలా ఉంటుందో మీ రాశి చెప్పేస్తుంది!
జగతి-శైలేంద్ర-ఫణీంద్ర
రిషి గురించిన ఆలోచనలో మునిగిపోయిన జగతి ముందు కొన్ని ఫైల్స్ వేస్తాడు శైలేంద్ర. డీబీఎస్‌టీ కాలేజీలో అటెండెన్స్, పాస్ పర్సెంటేజ్ తగ్గిపోయిందని, అన్ని రకాలుగా డీబీఎస్‌టీ కాలేజీ డౌన్ అయ్యిందని జగతిపై రుసరుసలాడుతాడు. నువ్వు ఎండీ సీట్‌లో కూర్చున్న తర్వాత కాలేజీ పతనం మొదలైందని జగతిని అవమానిస్తుంది దేవయాని. కాస్త అటెండెన్స్ , పాస్ పర్సెంటేజ్ తగ్గితే డీబీఎస్‌టీ కాలేజీ డౌన్ అయిపోదని దేవయానితో అంటుంది జగతి. ఇప్పటివరకు నువ్వు చేసిన పెత్తనం చాలు. ఇప్పటికైనా నా కొడుకును ఎండీ సీట్‌లో కూర్చుండబెడితే అంతా బాగుంటుందని జగతితో అంటుంది దేవయాని. అవసరం లేదంటుంది జగతి. అదే సమయానికి ఎంట్రీ ఇచ్చిన ఫణీంద్ర..ఎండీ సీట్ నుంచి నువ్వు తప్పుకోవడమే బాగుంటుందనిపిస్తోందంటాడు. ఆ మాటలకు జగతి షాక్ అవుతుంది.
ఫణీంద్ర: రిషి దూరమైన బాధ, మహేంద్ర మాట్లాడటం లేదన్న వెలితి వీటి మధ్య ఎక్స్‌ట్రా బర్డెన్ అవసరమా . ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు కాలేజీ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టలేవు. కాలేజీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవడానికి మేమున్నాం, డీబీఎస్‌టీ ఎండీ కాలేజీ సీట్ నీకు ఇప్పుడు బాధ్యత కాదు...బరువుగా మారిపోయింది