గుప్పెడంతమనసు జూన్ 9 ఎపిసోడ్ (Guppedantha Manasu June 9th Update)


రిషి వెళ్లిపోయిన తర్వాత కేడీ బ్యాచ్ తనగురించి మాట్లాడుకుంటారు 
రేయ్ పాండ్యన్ వాడు లెక్చరర్ అయ్యి ఉండడురా’ అంటాడు రోహిత్. ఎవడైతే మనకెందుకురా కాసేపు మనం ఎంజాయ్ చేశామా లేదా అనేది ముఖ్యం అయినా నాకు వాడు నవ్వు నచ్చలేదంటాడు కేడీ బ్యాచ్ లీడర్ పాండ్యన్.  ఏదైనా కానీ వాడు మళ్లీ వస్తే చుక్కలు చూపించాల్సిందే అని డిసైడ్ అవుతారు


మురుగన్ ఇంటికి రిషి
కాలేజీ చైర్మన్ విశ్వనాథాన్ని, వసుని బెదిరించిన మురుగన్ ఇంటికి వెళతాడు రిషి. ఒకడి చేతిలో కొబ్బరి బొండాం లాక్కుని తాగేసిన రిషి... తాను ఎవరి తరపున వచ్చాడో క్లారిటీ ఇస్తాడు. 
రిషి: కాలేజ్‌లో మీ పిల్లల ప్రవర్తన ఏం బాలేదు.. పిల్లలు చెడిబోతున్నారంటే దానికి కారణం తల్లిదండ్రులే అవుతారు. అందుకే కొంచెం వాళ్లని దారిలో పెట్టమని చెప్పడానికి వచ్చాను.
మురుగున్: ఏందప్పా బెదిరిస్తున్నావా?
రిషి: నువ్వు ఏమైనా అనుకో అప్పా.. కానీ పిల్లలు మాత్రం ఇక నుంచి హద్దు దాటి ప్రవర్తించకూడదు
మురుగున్: కుదరదు అంటే
రిషి: ‘బెండు తీస్తా’ 
మురుగన్: ఏంట్రా పంతులు కదా అని కాస్త మర్యాదగా మాట్లాడుతుండ.. ఏంటప్పా.. నా గురించి నీకు తెలియదప్పా. అందుకే ఇంత ధైర్యంగా నా ఇంటికాడికి వచ్చి నా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావ్
రిషి: నీకు నా గురించి కూడా తెలియదు.. అందుకే చెబుతున్నాను.. నాకు ఎదురు రావడం మంచిది కాదంటాడు కుర్చీలో స్టైలిష్ గా కూర్చుని
మురుగన్: నువ్వేమైనా పుడింగివా..ఏం చేయగలవ్ మహా అయితే పాఠాలు చెప్పగలవ్
రిషి: దారి తప్పేవారికి బుద్ధి చెప్పగలను...పాఠాలు చెప్పడంతో పాటూ గుణపాఠాలు కూడా నేర్పిస్తాను ..ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు.. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి
మురుగన్: కోపంగా పైకి లేచిన మురుగన్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్ 
రిషి: మురుగన్ నేను లెక్కల్లో ఎక్స్‌పర్ట్‌ని. తీసివేతలు బాగా తెలుసు.. అదే సొసైటీల్లో ఉన్నా వెధవల్ని.. దుర్మార్గుల్ని అలాగే కేడీ బ్యాచ్ లాంటి చిల్లర గ్యాంగ్‌ని తీసి వేయడం కూడా బాగా తెలుసు. ఎవడైనా మంచిగా చెప్పినా కూడా వినకుండా ఎక్కువ చేస్తే కాళ్లు చేతులు విరగొట్టి హెచ్చరించడం తెలుసు.. అలాగే కూడికలు కూడా బాగా తెలుసప్పా.. ఈ సమాజం అన్నాక మంచివాళ్లు ఉంటారు చెడ్డవాళ్లు ఉంటారు.. కానీ ఈ మధ్య చెత్త ఎక్కువైపోతుంది.. కూడికలు లాగా ఆ చెత్తనంతా ఒకేచోట కూడబెట్టి తగలబెట్టడం కూడా తెలుసు’ 


Also Read: వసు పనిచేస్తున్న కాలేజీ బాధ్యతలు తీసుకున్న రిషి సార్, మళ్లీ ప్రేమకథ మొదలు!


మురుగన్ పక్కనే ఉన్న ఒక రౌడీ రిషి మీదకు చేయి ఎత్తితే.. వాడి చేతిని విరిచేస్తాడు రిషి. అక్కడ చిన్నపాటి ఫైట్ జరుగుతుంది . మురుగన్‌లో భయం మొదలవుతుంది. 
రిషి: మురుగన్ ఇంకోసారి లెక్చరర్స్ ఇంటికి వెళ్లి భయపెట్టడాలు.. విశ్వనాథం గారి ఇంటికి వెళ్లి భయపెట్టాలని చూస్తే అసలు ఊరుకోను. నువ్వు తప్పు చేసినా పిల్లలు తప్పు చేసినా ఆ శిక్ష మాత్రం నీ పిల్లలకే వేస్తాను. నువ్వు ఎలా చెబుతావో.. ఏం చెబుతావో నాకు తెలియదు. వాళ్లని అందరితో మర్యాదగా ఉండమని చెప్పు.. ముందు నీ బెండు తీస్తేనే వాళ్లు సెట్ అవుతారు, అందుకే నీ దగ్గరకు వచ్చాను.. నా మాట వింటే నీకే మంచిది. కాదు కూడదు.. లెక్చరరే కదా అనుకుని..’ అంటూ రిషి గోళ్లు చూసుకుంటూ రెండు అడుగులు ముందుకు వేసేసరికి మురుగన్ పక్కనే నిలబడిన రౌడీ తెగ భయపడుతూ ఉంటాడు. తనని కూడా అలాగే కొడతాడేమోనని. ‘రేయ్ నిన్ను ఏం అననురా’ అంటూ వాడి బుగ్గమీద చిన్నగా టచ్ చేస్తాడు . నీలాంటి రౌడీలను చూడటం నాకేం కొత్త కాదు.. కానీ నాలాంటి వాడ్ని చూడటం నీకే కొత్త జాగ్రత్త.. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్....మురుగన్ థాంక్స్ ఫర్‌ ది కొబ్బరి బొండం.. అది చెబుదామనే వచ్చాను.. జాగ్రత్త’ అనేసి రిషి వెళ్లిపోతాడు. 
అన్నా వేసేయమంటావా అంటే...వద్దు వాడిపై ఓకన్నేసి ఉంచండి అంటాడు మురుగన్. 


Also Read: ఈ నక్షత్రంలో జన్మించిన వారి వ్యూహరచన బావుంటుంది, సలహాదారులుగా బాగా రాణిస్తారు!


కాలేజీకి వెళ్లిన రిషి..ప్రిన్సిపాల్ ని కలుస్తాడు. ‘ఇక మురుగన్ ఈ కాలేజ్ జోలికి రాడు. మళ్లీ ఏదైనా సమస్య అయితే నేను చూసుకుంటాను.. అంతా ధైర్యంగా ఉండండి’ అంటాడు. థాంక్యూ సార్ ఒకసారి మీరు మా లెక్చరర్స్‌ని కలవమని అంటే వద్దు అనేస్తాడు రిషి. సరిగ్గా అప్పుడే వసుకి తండ్రి కాల్ చేయడంతో పక్కకు వెళ్తుంది. రిషి ప్రిన్సిపల్‌తో పాటే లెక్చరర్స్ రూమ్‌కి వెళ్లి మిగిలిన లెక్చరర్స్‌ అందరినీ కలిసి ధైర్యంగా ఉండండి.. ఏదైనా సమస్య అయితే తెలియజేయండి అని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో వసు ఫోన్ పెట్టేసి లెక్చరర్స్ దగ్గరకు వచ్చేసరికి.. మిగిలిన లెక్చరర్స్ అంతా ‘ఓ వ్యక్తి మురుగన్ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చి వచ్చాడట ఇక మనకు ఈ కేడీ బ్యాచ్ ఆగడాలు తగ్గినట్లే అంటారు. ‘అవునా ఎవరు అతను.. నేను కూడా కలిసి థాంక్స్ చెబుతాను’ అంటుంది వసు. ‘ఇప్పుడే వెళ్లిపోయాడు’ అని చెప్పడంతో వసు పరుగుతీస్తుంది కానీ రిషిని చూడదు. ఇంటికి వచ్చిన రిషి జరిగింది మొత్తం విశ్వనాథంకి, ఏంజెల్‌కి చెబుతాడు. దాంతో ‘ఇక నుంచి కాలేజ్‌లో ఉండు రిషి.. అదే బెటర్.. అక్కడ సమస్యలు తగ్గేదాకా కాలేజ్ చూసుకో’ అంటాడు విశ్వనాథం. కానీ  నో చెప్పేస్తాడు రిషి.