గుప్పెడంతమనసు జూలై 14 ఎపిసోడ్ (Guppedanta Manasu July 14th Written Update)


జగతి-మహేంద్ర ఇద్దరూ కాలేజీలో సెమినార్ కి హాజరై రిషిధారకు సన్మానం చేస్తారు. ఆ తర్వాత విశ్వనాథం,  ప్రిన్సిపాల్ ఇద్దరూ కాలేజీ మొత్తం తిప్పి చూపిస్తారు. వీళ్లని చూసి శేలేంద్ర రగిలిపోతాడు. అమ్మ చెప్పినిజమే పిన్ని నిజంగా ఆడపులే అనుకుంటాడు శైలేంద్ర. ఆ తర్వాత కాలేజీ నుంచి బయటకు వచ్చి కోపంతో జరిగిన విషయాలను గుర్తుచేసుకుంటాడు. జగతి తనకిచ్చిన బొకేను డస్టబిన్ లోకి విసిరేద్దాం అనుకుని విసిరేస్తాడు.. ఆ బొకేని వసుధార అందుకుంటుంది. పూలు ఇలా పడేయొచ్చా అని క్లాస్ వేస్తుంది. అసలు ఇక్కడకు ఎందుకొచ్చావ్ అని రిషి అంటే పువ్వులను కాపాడేందుకే అని చెబుతుంది. 
రిషి: కాలేజీకి వస్తే కుదురుగా కూర్చోమనే కదా ఎందుకు అన్నిసార్లు అటు ఇటు తిరగడం..అన్నిసార్లు సన్మానాలు, సత్కారాలు అవసరమా. ఇంట్లో కొంచెం దూరం నడిస్తే ఇబ్బంది పడే మీరు ఇక్కడ మాత్రం ఆగకుండా తిరిగేస్తున్నారు..అంటే ఇంట్లో నటిస్తున్నారా..అయినా ఏంజెల్ ని అనాలని మండిపడతాడు..


ఆ తర్వాత జగతి-మహేంద్ర వాళ్లు విశ్వనాథం, ప్రిన్సిపాల్ తో రూమ్ లో కూర్చుని మాట్లాడుకుంటారు. సెమినార్ స్పీచ్ చాలా బావుందని జగతి పొగిడేస్తుంది. విశ్వనాథం, ప్రిన్సిపాల్ కూడా రిషిని పొగుడుతారు. ఈ సందర్భంగా  ఓ విషయం అడుగుతాను మీరు కాదనకూడదు అంటాడు మహేంద్ర.
విశ్వనాథం: అదేం లేదు చెప్పండి 
జగతి: ఇలాంటి నాలెడ్జ్ ఉన్న ఇద్దర్నీ DBST కాలేజీ తరపున మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేసేలా వారిని ఒప్పించగలరా
ప్రిన్సిపాల్: ఈ విషయం గురించి వాళ్లతో మాట్లాడి మా నిర్ణయం చెబుతాం
జగతి: ఎంత టైమ్ తీసుకున్నా పర్వాలేదు సార్ కొంచెం టైమ్ తీసుకుని వాళ్లతో మాట్లాడి మాకు చెప్పండి. కానీ మిషన్ ఎడ్యుకేషన్ మహాయాగం లాంటిది . దానికి తగ్గా అర్హులు ఆ బాధ్యతలు స్వీకరిస్తే సంతోషం
విశ్వనాథం: మీరు ఎన్నాళ్లైనా వెయిట్ చేసి వాళ్లనేకావాలి అంటున్నారంటే మీరు ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా ఆలోచించారో అర్థమవుతోంది. తప్పకుండా వాళ్లని ఒప్పిస్తాం..


Also Read: రాజు ఎక్కడున్నా రాజే , బాహుబలి - భళ్లాలదేవని గుర్తుచేసిన రిషి-శైలేంద్ర!


మహేంద్ర-రిషి
సెమినార్‌ను పూర్తిచేసుకుని రిషి తిరిగి ఇంటికి వెళ్లిపోవ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. ఆపిన మ‌హేంద్ర కొడుకు భుజంపై ప్రేమ‌గా చేయివేస్తాడు. కానీ తండ్రి చేయిని రిషి తీసేస్తాడు. అది చూసి మ‌హేంద్ర షాక‌వుతాడు. నేను నీ తండ్రిని అంటాడు. అందుకు ఇక్క‌డ తండ్రీ కొడుకులం కాదు. కేవ‌లం ప‌రిచ‌య‌స్తులం మాత్ర‌మే. ఇద్ద‌రి మ‌ధ్య ముఖ‌ప‌రిచ‌యం మాత్ర‌మే ఉంద‌ని రిషి అనగానే మహేంద్ర షాక్ అవుతాడు. అదే మాట త‌న క‌ళ్ల‌లోకి సూటిగా చూసి చెప్ప‌మ‌ని అంటాడు. కానీ తండ్రి మాట‌ల్ని లెక్క‌చేయ‌కుండా రిషి వెళ్లిపోవ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. నువ్వు అలా వెళ్లిపోతుంటే నా ప్రాణం పోతుంద‌ని మ‌హేంద్ర ఎమోష‌న‌ల్ అవుతాడు. ఇన్ని సంవ‌త్స‌రాలు నీ కోసం ఎంతో వెతికాన‌ని, ఎంతో త‌పించాన‌ని రిషితో అంటాడు. ఇన్నాళ్లు క‌న్నీళ్ల‌తో సావాసం చేశాన‌ని చెబుతాడు. నేను ఏ త‌ప్పు చేశానో చెప్ప‌మ‌ని రిషిని అడుగుతాడు మ‌హేంద్ర‌. నా త‌ప్పు లేనిదే గుండెకోత‌ను అనుభ‌విస్తాను. ఇంకా నా మీద నీకు జాలి క‌ల‌గ‌డం లేదా అని రిషిని ప్రాధేయ‌ప‌డ‌తాడు. నాతో మాట్లాడు అని రిషిని చేతులెత్తి వేడుకుంటాడు మ‌హేంద్ర‌. తండ్రిని రిషి వారిస్తాడు. మీరు అలా చేస్తే న‌న్ను ఇంకా బాధ‌పెట్టిన‌వారు అవుతారు. మీ బాధ‌ను నేను అర్థం చేసుకోగ‌ల‌ను. స్వ‌యంగా మీరు అనుభ‌వించిన బాధ‌ను చూశాను. నేను మిమ్మ‌ల్ని బాధ పెట్టి ఉంటే క్ష‌మించ‌మ‌ని అంటాడు.  ఇంటికి రమ్మని మహేంద్ర బతిమలాడినా రిషి నో అనేస్తాడు. నేను మీకు ఇలా దూర‌మ‌వుతాన‌ని ఎప్పుడూ అనుకోలేద‌ని అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. మ‌హేంద్ర పిలుస్తున్నా ప‌ట్టించుకోడు. నువ్వు ఒంట‌రిగా వ‌దిలేయ‌మ‌ని చెప్పినంత మాత్రానా మేము ఎలా వ‌దిలేస్తామ‌ని, నిన్ను ఎప్ప‌టికీ దూరం చేసుకోమ‌ని మ‌హేంద్ర మ‌న‌సులోనే నిశ్చ‌యించుకుంటాడు.


Also Read: KGF బ్యాంగ్రౌండ్ మ్యూజిక్ తో ఎమోషన్ పిండేశారు - మళ్లీ రిషిని చంపించేందుకు శైలేంద్ర కుట్ర!


రిషి గతం గురించి ప్రశ్నించిన విశ్వనాథం
త‌మ కాలేజీకి ఎన‌లేని పేరుప్ర‌ఖ్యాతుల్ని తీసుకొచ్చావ‌ని రిషిపై విశ్వ‌నాథం ప్ర‌శంస‌లు కురిపిస్తాడు. డీబీఎస్‌టీ కాలేజీ బోర్డ్ మెంబ‌ర్స్ అయిన జ‌గ‌తి, మ‌హేంద్ర త‌మ కాలేజీకి రావ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని అంటాడు. వారి కాలేజీ విధి విధానాలు నీ ఆలోచ‌న‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నాయ‌ని రిషితో అంటాడు విశ్వ‌నాథం. ఒక్క సెమినార్‌తోనే ఇంత ఆద‌ర‌ణ వ‌చ్చిందంటే ఇదే నీ మొద‌టి సెమినారా? ఇంత‌కుముందు ఇత‌ర కాలేజీల‌లో ఇలాంటి సెమినార్స్ కండ‌క్ట్ చేశావా? అని రిషిని అడుగుతాడు విశ్వ‌నాథం. అత‌డి ప్ర‌శ్న‌ల‌కు రిషి స‌మాధానం చెప్ప‌కుండా ఆలోచ‌న‌లో ప‌డిపోతాడు.
ఎపిసోడ్ ముగిసింది...