గుండె నిండా గుడి గంటలు నవంబర్ 17 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 November 17th Episode
దాదాపు వారం రోజులుగా సుశీలమ్మ బర్త్ డే వేడుకలతో నిండిపోయింది గుడినిండా గుడిగంటలు సీరియల్. ఓ రెండు ఎపిసోడ్స్ లో బాలు మాయమయ్యాడు. ఇంకా రాలేదు ఇంకా రాలేదని హడావుడి జరిగింది. ఎట్టకేలకు బాలు రావడం..నానమ్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే మనసుకి హత్తుకునే గిఫ్ట్ ఇస్తారో వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటుంది సుశీలమ్మ. అందుకే పోటీలుపడి మరీ గిఫ్టులు ఇచ్చారంతా. కక్కుర్తి ప్రభావతి కామాక్షి ఇంటి నుంచి టీవీ తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడెప్పుడో పోగొట్టుకున్న రవ్వలహారం ఇచ్చాడు మనోజ్. రవి కేక్ చేస్తే శ్రుతి స్మార్ట్ ఫోన్ గిప్ఠుగా ఇచ్చింది. రోహిణి మేకప్ చేసేసి చేతులు దులుపుకుంది. అలా మనిషో గిఫ్ట్ ఇచ్చారు. బాలుగాడు ఏం ఇస్తాడులే ఓ రోడ్డుపక్కన ఉండే వస్తువునో 500 చెబితే 200లకి బేరం ఆడి తెస్తాడు అని నోరుపారేసుకుంటాడు. ఏమీ మాట్లాడకుండా మీనా ఇక నువ్వు స్టార్ట్ చేయి వీడియో అంటూ నానమ్మ చిన్ననాటి స్నేహితులను తీసుకొచ్చి సర్ ప్రైజ్ ఇస్తాడు. ఆనందంతో చిన్న పిల్లైపోతుంది సుశీలమ్మ. అప్పటి లవ్ స్టోరీ గురించి కూడా డిస్కస్ చేసుకుంటారు స్నేహితులు ముగ్గురు.
సుశీలమ్మ ఆనందం చూసి ఇంట్లో అందరూ మురిసిపోతారు..ప్రభావతి తప్ప. అంటే ఇప్పుడు గిఫ్ట్ వాడికే ఇస్తుందేమో అనే టెన్షన్ పెరిగిపోతుంది. ఆ తర్వాత సుశీలమ్మ కేక్ కట్ చేస్తుంది. ఒక్కొక్కరికీ తినిపిస్తుంది..అంతా సందడిగా సాగుతుంది. ఇంకా ఆగలేకపోయిన ప్రభావతి.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఎవరికి ఇస్తారు అతయ్యా చెప్పండి అంటుంది. నా మనసుకి నచ్చిన బహుమతిని ఎప్పటికీ తీరదు అనుకున్న కోర్కెను తీర్చిన బాలు మీనాకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటుంది సుశీలమ్మ. అది భరించలేక బాలు మీనాపై నోరు పారేసుకుని..అందరితో మరోసారి తిట్లు తింటుంది ప్రభావతి. రోహిణి, మనోజ్ కూడా హర్ట్ అవుతారు. నాకు గిఫ్ట్ వస్తుందేమో అనుకుని అనవసరంగా ఖర్చుపెట్టి హారం కొన్నానంటూ తెగ బాధపడిపోతాడు. రోహిణి కూడా మొహం ముడుచుకుంటుంది. సత్యం, రవి, శ్రుతి సంతోషిస్తారు. మీనా-బాలు ఆనందానికి అవధులుండవ్.
ఇదిగో గిఫ్ట్ అంటూ ఓ చిన్న బాక్స్ చేతిలో పెడుతుంది సుశీలమ్మ... ఆ బాక్సులో ఏముందన్నది గుండెనిండా గుడిగంటలు నవంబర్ 17 సోమవారం ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఇక బర్త్ డే సందడి ముగిసింది కాబట్టి..అందరి కాన్సన్ ట్రేషన్ బంగారంపైకి వెళ్లే అవకాశం ఉంది. పైగా శ్రుతి తల్లి కూడా ఓపెన్ గానే అనేసింది..రోల్డ్ గోల్డ్ నగలు వేసుకున్నావేంటని..సో..వారం రోజుల పాటూ బంగారం గురించి సత్యం ఇంట్లో రచ్చ రచ్చే.
సంజూకి చెప్పకుండా పుట్టింటికి వచ్చిన మౌనిక..ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిది అని ఆలోచిస్తుంటుంది. ఇంతలో సంజూ గుడికి కాకుండా నేరుగా మౌనికను వెతుక్కుంటూ అత్తారింటికి వచ్చే ఛాన్సుంది. అదే జరిగితే.. మళ్లీ మౌనిక పనైపోయినట్టే..లేదా..మీనా మరోసారి వార్నింగ్ ఇస్తే ఆగుతాడేమో చూడాలి...
వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!
M.K. త్యాగరాజ భాగవతార్ ఎవరు? 'కాంత' మూవీ వివాదం వెనుకున్న ఈయన కథేంటి?
కూసింతే సూత్తె నీలో వగలు..రాసేత్తారుగా ఎకరాలు..పెద్ది రామ్ చరణ్ 'చికిరి చికిరి' సాంగ్ లిరిక్స్