Peddi First Single chikiri chikiri song lyrics :పెద్ది మూవీ నుంచి “చికిరి చికిరి” అనే సాంగ్ వచ్చేసింది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించగా మోహిత్ చౌహాన్ పాడిన పాట ఇది. బాలాజీ రాసిన సాహిత్యం మాస్ ఆడియన్స్ ని కట్టిపడేస్తోంది. రామ్ చరణ్ , జాన్వికపూర్ జంటగా నటించిన పెద్ది మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఇది.
ఈ సాంగ్ లిరిక్స్ మీకోసం..
ఆ చంద్రుల్లో ముక్క..జారిందే దీనక్క..నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా
దీనందాలో లెక్క..దీనేషాలో తిక్క..నా గుండెల్లో పోత్తాందే ఉక్కా
ఓ..చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కీరీ...పడతా పడతా పడతా ఎనుకే ఎనుకే పడతా
సరుకు సామాను సూసి మీసం లేసి ఏసెయ్ కేకా
చికిరీ చికిరీ గుంటే సురకెట్టేశాక...
ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా..
చికిరీ చికిరీ...
ఆ చంద్రుల్లో ముక్క..జారిందే దీనక్క..నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా
చరణం 1
ఆ ముక్కుపై పెట్టీ కోపం..తొక్కేసావే ముక్కెరందం
చింతాకులా ఉందే పాదం సిర్రాకులే నడిచే వాటం…
ఏం బొక్కావో అందాలు ఒళ్లంతా ఒంకీలు
నీ మత్తే తాగిందా తాటికల్లు
కూసింతే సూత్తే నీలో వగలు..రాసేత్తారుగా ఎకరాలు..
నువ్వే నడిచిన సోటంతా పొర్లు దండాలు
ఓ..చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కీరీ...పడతా పడతా పడతా ఎనుకే ఎనుకే పడతా
ఆ చంద్రుల్లో ముక్క..జారిందే దీనక్క..నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా
దీనందాలో లెక్క..దీనేషాలో తిక్క..నా గుండెల్లో పోత్తాందే ఉక్కా
చరణం 2
నచ్చేశావే..మల్లే గంపా..నీ అందాలే..నాలో దింపా
ఏం తిన్నావో కాయా దుంపా..నీ యవ్వారం.. వరదా ముంపా...
నీ చుట్టూరా కళ్లేసి లోగుట్టే నమిలేసి లొట్టేసి ఊరాయే నోటనీళ్లు
నీ సింగారాన్ని సూత్తా ఉంటే సొంగా కార్చుకుందే గుండె..
బెంగా నిదురను మింగేసిందే...సెయ్యాలే సేసేయ్యాలే
ఓ..చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కీరీ...పడతా పడతా పడతా ఎనుకే ఎనుకే పడతా
ఆ చంద్రుల్లో ముక్క..జారిందే దీనక్క..నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా
దీనందాలో లెక్క..దీనేషాలో తిక్క..నా గుండెల్లో పోత్తాందే ఉక్కా
ఓ..చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కీరీ...పడతా పడతా పడతా ఎనుకే ఎనుకే పడతా
సరుకు సామాను సూసి మీసంమెలేసి ఏసెయ్ కేకా
చికిరీ చికిరీ గుంటే సురకెట్టేశాక...
ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా..
చికిరీ చికిరీ..
చిత్రం: పెద్ది (Peddi)
సాంగ్ : చికిరి చికిరి (Chikiri Chikiri)
సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్ (AR Rahman)
గాయకుడు: మోహిత్ చౌహాన్ (Mohit Chauhan)
సాహిత్యం : బాలాజీ (Balaji)
నటీనటులు: రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Jhanvi Kapoor)
రచయిత, దర్శకుడు: బుచ్చిబాబు (Buchi Babu Sana)
నిర్మాత: వెంకట సతీష్ కిలారు (Venkata Satish Kilaru)
ఈ పాటకి మోహిత్ స్వరం కొత్తగా ఉంది..అయితే పాటలో కొన్ని పదాలు స్పష్టంగా పలకలేదు అనిపిస్తుంది. మొదటిసారి కన్నా వింటుంటే బాగా ఎక్కేస్తుంది. ఈ సాంగ్ కి చరణ్ స్టెప్స్, జాన్వి అందం స్పెషల్ అసెట్. మొత్తానికి మొదటి సాంగ్ అదిరింది..ఇక ముందుంది అసలు పండుగ. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ లో సింగిల్ షాట్ సోషల్ మీడియాలో దుమ్ములేపింది..ఇప్పుడు ఈ సాంగ్ లో చరణ్ స్టెప్స్ అంతకుమించి అనిపించుకున్నాయ్.
ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చికిరి చికిరి రీల్స్ మోతమోగిపోవడం ఖాయం.