Dulquer as a  Thyagaraja Bhagavathar: దుల్కర్ సల్మాన్, దగ్గుపాటి రానా, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే నటించిన లేటెస్ట్ మూవీ కాంత. నవంబర్ 14న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. దుల్కర్ రోల్..తమ తాత ఎం.కె. త్యాగరాజ్ భగవతార్ ను ఇమిటేట్ చేసినట్టుందని మనవడు త్యాగరాజ్ మద్రాసు కోర్టులో పిటీషన్ వేశాడు. కాంత టీమ్ కి నోటీసులు పంపించిన కోర్ట్..ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని  ఆదేశించింది. ఈ కేస్ హియరింగ్  నవంబర్ 18కి వాయిదా వేశారు. 

Continues below advertisement

ఇంతకీ ఎవరీ త్యాగరాజ భాగవతార్?

ఈయన గురించి ఎందుకు చర్చ?

Continues below advertisement

సినిమా తీసేంత స్టోరీ ఈయనదా?

విభిన్న కథలతో ప్రేక్షకులను మెప్పించే దుల్కర్ సల్మాన్...కాంత మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచీ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఒకప్పటి లెజండరీ తమిళ హీరో, ఇండియన్ తొలి సూపర్ స్టార్ గా పేరొందిన ఎంకే త్యాగరాజ భాగవతార్ (MKT) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందన్నారు. ఈ జనరేషన్ కి త్యాగరాజ భాగవతార్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. ఒకప్పుడు ఆయన సూపర్ స్టార్. 

త్యాగరాజ భాగవతార్  పూర్తి పేరు: మాయవరం కృష్ణసామి త్యాగరాజ భాగవతార్... MKT అని పిలుస్తారు అభిమానులు. తమిళ సినిమా చరిత్రలో మొదటి సూపర్‌స్టార్‌ ఈయన.నటుడు మాత్రమే కాదు.. కర్ణాటక సంగీత గాయకుడు, దర్శకుడుు కూడా.  1934లో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన, 1959 వరకు 14 సినిమాల్లో నటించారు. వీటిలో 10 బ్లాక్‌బస్టర్లు. హరిదాసు అనే సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. మూడు సంవత్సరాల పాటూ  (1944-1946) చెన్నై బ్రాడ్‌వే థియేటర్‌లో ప్రదర్శితమైంది ఈ సినిమా.  ఇంకా ఆయన సినిమాలు చూస్తే.. పావలకొడి , చింతామణి, అంబికాపతి , తిరునీలకాంతార్  

అశేష ప్రేక్షకాదరణ, అంతులేని సంపద, విలాసవంతమైన జీవితం గడిపిన త్యాగరాజ భాగవతార్ జీవితం...ఒక్క వివాదంతో తల్లకిందులైంది.  ఆ వివాదం జైలు జీవితం గడిపేలా చేసింది. 

 ప్రముఖ దర్శకుడితో వివాదం కారణంగా త్యాగరాజ భాగవతార్ కెరీర్లో కుదుపు మొదలైంది..ఆ తర్వాత జర్నలిస్ట్ హత్యకేసులో ఆయన్ను ఇరికించడంతో రెండేళ్లపాటూ జైలు జీవితం గడపాల్సి వచ్చింది.  రెండేళ్ల తర్వాత త్యాగరాజ భాగవతార్ నిర్దోషిగా బయటకు వచ్చి మళ్లీ ఇండస్ట్రీలో వెలగాలని ఆశపడ్డారు. అందుకోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు..కానీ ఫలితం లేకపోయింది. ఎంతో కీర్తిని పొంది..విలాసవంతంగా గడిపిన జీవితం కళ్లముందే చెదిరిపోయింది. చివరి రోజుల్లో అనారోగ్యంతో బాధపడుతూ..1959 నవంబర్ 1వ 49 ఏళ్లకే కన్నుమూశారు.

ఈ విషాధ కథనే కాంత మూవీగా తీశారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో దుల్కర్ సల్మాన్ ఎంకే త్యాగరాజ భాగవతార్ పాత్రను పోషిస్తుండగా .. ఆయన పతనానికి కారణం అయిన దర్శకుడి పాత్రలో సముద్రఖని నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది. ఇది బయోపిక్ అనే ప్రచారం జరగడంతో కాంత మూవీపై మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ సినిమాపై త్యాగరాజ భాగవార్ కుటుంబ సభ్యులు పిటిషన్ వేయడంతో ఈయన ఎవరు అనే ఆసక్తి నెలకొంది....

వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!