New Toyota Hilux 2025: టయోటా అభిమానుల కోసం పెద్ద గుడ్‌ న్యూస్‌!. ఈ కంపెనీ, తన ప్రసిద్ధ పికప్‌ ట్రక్‌ Hilux‌ ను కొత్త జనరేషన్‌లో ఆవిష్కరించింది. ఈసారి Hilux మునుపెన్నడూ లేని రీతిలో అప్‌డేట్‌ అయింది. పవర్‌ట్రెయిన్‌, డిజైన్‌, ఫీచర్లు అన్నీ పూర్తిగా రిఫ్రెష్‌ చేశారు. ముఖ్యంగా, మొదటిసారి ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ కూడా అందుబాటులోకి వస్తోంది.

Continues below advertisement

పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లు - EV నుంచి డీజిల్‌ దాకా!కొత్త Hilux ఇప్పుడు మూడు వెర్షన్లలో లభిస్తుంది, అవి - ఎలక్ట్రిక్‌ (EV), పెట్రోల్‌ (2.7L) & డీజిల్‌ (2.8L). EV వెర్షన్‌లో 59.2 kWh బ్యాటరీ, డ్యూయల్‌ మోటార్‌ సెటప్‌ ఉంది. ఇది ఫుల్‌టైమ్‌ AWD (ఆల్‌ వీల్‌ డ్రైవ్‌‌) సిస్టమ్‌తో వస్తుంది. ఫ్రంట్‌ మోటార్‌ 205Nm, రియర్‌ మోటార్‌ 268Nm టార్క్‌ ఇస్తాయి.

Toyota అందించిన డేటా ప్రకారం, ఈ EV వెర్షన్‌ 240 km WLTP రేంజ్‌ ఇస్తుంది. పేలోడ్‌ కెపాసిటీ 715 kg, టోవింగ్‌ కెపాసిటీ 1,600 kg. అదే సమయంలో “బెస్ట్‌ ఇన్‌ క్లాస్‌ ఛార్జింగ్‌ సిస్టమ్‌” ఉన్నట్టు Toyota చెబుతోంది. ఇక, డీజిల్‌ వేరియంట్‌లో 48V మైల్డ్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌ ఉంది, ఇది Fortuner Neo Drive లాగే ఇంజిన్‌కి యాక్సిలరేషన్‌లో సపోర్ట్‌ ఇస్తుంది. దీని టోవింగ్‌ కెపాసిటీ 3,500 kg, పేలోడ్‌ 1 టన్ను వరకు ఉంది.

Continues below advertisement

బాడీ-ఆన్-ఫ్రేమ్‌ స్ట్రక్చర్‌ & మల్టీ-టెర్రెయిన్‌ మోడ్‌దీనిని Toyota IMV ప్లాట్‌ఫామ్‌పైనే నిర్మించారు కానీ, కొత్తగా EV ఆప్షన్‌ జోడించడం విశేషం. అలాగే 700mm వాటర్‌ వేడింగ్‌ డెప్త్‌, మల్టీ-టెర్రెయిన్‌ సెలెక్ట్‌ సిస్టమ్‌ & ఎలక్ట్రిక్‌ పవర్‌ స్టీరింగ్‌ వంటి కొత్త ఫీచర్లు ఈ జనరేషన్‌లో మొదటిసారిగా కనిపిస్తున్నాయి.

2028 నాటికి హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ Hilux విడుదల చేయనున్నట్టు Toyota ధృవీకరించింది, ఇది భవిష్యత్‌ పికప్‌ ట్రక్‌లకు దారి చూపే నిర్ణయం.

ఇంటీరియర్‌ డిజైన్‌ - టెక్నాలజీతో నిండిన క్యాబిన్‌Toyota Hilux 2025 ఇంటీరియర్‌ ఇప్పుడు పూర్తిగా మోడరన్‌ అయ్యింది. డ్యూయల్‌ 12.3-ఇంచ్‌ డిస్‌ప్లేలు, 3-స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, కనెక్టెడ్‌ కార్‌ టెక్‌, వెంటిలేటెడ్‌ సీట్స్‌, 360° కెమెరా, బ్లైండ్‌ స్పాట్‌ మానిటర్‌, డ్రైవర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లు వచ్చి చేరాయి. 

ADAS సూట్‌లో లో-స్పీడ్‌ యాక్సిలరేషన్‌ సప్రెషన్‌, ప్రో-యాక్టివ్‌ డ్రైవింగ్‌ అసిస్ట్‌, ఎమర్జెన్సీ స్టాప్‌ సిస్టమ్‌ వంటి కొత్త సేఫ్టీ ఫీచర్లు కూడా జోడించారు.

ఎక్స్‌టీరియర్‌ లుక్‌ - మరింత మస్క్యులర్‌గా!బయటకు చూస్తే కొత్త Hilux స్టైల్‌ పూర్తిగా రీడిజైన్‌ అయింది. స్లిమ్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, పెద్ద TOYOTA లెటరింగ్‌, స్కిడ్‌ ప్లేట్‌, హనీ కాంబ్‌ గ్రిల్‌... ఈ బండి లుక్‌ని బలంగా చూపిస్తున్నాయి. EV వెర్షన్‌లో గ్రిల్‌ మూసివేసిన స్టైల్‌లో ఉంటుంది. వెనుక భాగంలో పెద్ద C-షేప్‌ LED లైట్లు, బోల్డ్‌ టెయిల్‌గేట్‌ డిజైన్‌ ఉన్నాయి.

లాంచ్‌ ప్లాన్‌ - ముందు EV, ఆ తరువాత ICE వెర్షన్‌Toyota Hilux EVని డిసెంబర్‌ 2025 నుంచి, ICE వెర్షన్లను (పెట్రోల్‌ & డీజిల్‌) 2026 మధ్య నుంచి గ్లోబల్‌ మార్కెట్లలో లాంచ్‌ చేస్తుంది. భారత్‌లో కూడా 2030 నాటికి Toyota 15 కొత్త మోడళ్లు తీసుకురానుంది. వాటిలో ఈ Hilux కొత్త జనరేషన్‌ కూడా ఉండే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.