రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్‌తో 12 ఏళ్ల బంధం త్వరలో ముగిసేలా కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి వస్తున్న మీడియా నివేదికల ప్రకారం, రాజస్థాన్ రాయల్స్‌లో చేరేందుకు ట్రేడ్ డీల్ ఒప్పందంపై ఆల్ రౌండర్ జడేజా సంతకం చేశాడు. మూడుసార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను చెన్నై గెలిచిన జట్టులో సభ్యుడు జడేజా. ఇప్పుడు తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం సీఎస్కే జడేజాను విడుదల చేయాలనే ఆలోచనలో లేదని వెల్లడైంది.

Continues below advertisement

శాంసన్ ప్రకటనతో మొదలైంది..

కొన్ని నెలల కిందట సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌ (Rajasthan Royals)ను విడిచి వెళ్తున్నాడని వార్త వచ్చింది. సంజూ శాంసన్ ను తమ జట్టులో చేర్చుకోవడానికి ఆసక్తి చూపించిన మొదటి జట్లలో CSK ఒకటి. ఆ సమయంలో రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ CSK అధికారులను సంప్రదించింది. ట్రేడ్‌లో సామ్సన్‌కు బదులుగా ఒక ఆటగాడిని కోరినప్పుడు, చెన్నై జట్టు వెనక్కి తగ్గింది. తమ ఆలోచనను మార్చుకున్నట్లు తెలుస్తోంది.

Continues below advertisement

చెన్నై సూపర్ కింగ్స్ భారీ మొత్తం చెల్లించి సంజు శాంసన్‌ను తమ జట్టులో చేర్చుకోవాలని కోరుకుంది. అయితే RR జట్టు దృష్టి రవీంద్ర జడేజాపై పడింది. ఇప్పుడు ట్రేడ్ డీల్ పెరుగుతూ శాంసన్‌కు బదులుగా రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్ CSKని వీడి రాజస్థాన్ రాయల్స్‌లో చేరే స్థాయికి చేరుకుంది. అయితే, ఈ ట్రేడ్ డీల్‌పై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

ధోనీ తరువాత కెప్టెన్ కోసం..

హిందుస్థాన్ టైమ్స్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం, MS ధోనితో సహా CSK మేనేజ్‌మెంట్ సంజూ శాంసన్‌ను తమ జట్టులో చేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంది.  అమెరికాలో మేజర్ క్రికెట్ లీగ్ సమయంలో కూడా అధికారులు శాంసన్‌ను కలిశారు. ధోని చాలా కాలం నుంచి మోకాలి సమస్యతో బాధపడుతున్నందున, చెన్నై జట్టుకు తదుపరి కెప్టెన్ చాలా అవసరం. అందువల్లే గత ఏడాది నుంచి చెన్నై సూపర్ కింగ్స్ శాంసన్‌ను తీసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాను రాజస్తాన్‌ను వీడాలనుకుంటున్నట్లు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ చెప్పడమే అందుకు కారణం. 

గతంలో జడేజాకు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కానీ పూర్తిగా విఫలం కావడంతో తిరిగి ధోనీనే సారథిగా మారి జట్టును నడిపించాడు. రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ ఇచ్చినా చెన్నైకి కలిసిరాలేదు. ఆ సమయంలో గాయంతో రుతురాజ్ సీజన్ కు దూరమయ్యాడు. ధోనీ తరువాత చెన్నైకి సంజూ శాంసన్ కెప్టెన్ కావాలని, ట్రేడ్ డీల్ చేసుకోవాలని సీఎస్కే భావించింది. దాంతో పరోక్షంగా ధోనీ కారణంగానే జడేజాకు ఈ పరిస్థితి వచ్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అంతకుముందు, మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా ధోని CSK జట్టు శ్రేయస్సు కోసం రవీంద్ర జడేజాను త్యాగం చేయవలసి వస్తే, అది సరైనదేనని, ఎందుకంటే సంజూ శాంసన్ రాకతో చెన్నై జట్టులో కెప్టెన్సీకి మరో అవకాశం లభిస్తుందని అన్నారు. కానీ రైనా లాంటి స్టార్ బ్యాటర్, సీఎస్కే మాజీ ఆటగాడు మాత్రం ఇది సరికాదని ఫ్రాంచైజీకి సూచించాడు. జడేజా ఛాంపియన్ అని, ఎన్నో ఏళ్లుగా జట్టుకు ఆడుతున్న అతడ్ని ఇష్టం లేకుండా ఈ తీరుగా బయటకు పంపడం సరికాదని పేర్కొన్నాడు.