Hero Xtreme 125R vs TVS Raider Price Specifications Comparison: స్పోర్టీ లుక్, స్మార్ట్ ఫీచర్లు ఉన్న 125సీసీ బైక్‌లకు యువతరంలో క్రేజ్ పెరుగుతోంది. ఈ కేటగిరీని మొదట సుడిగాలిలా చుట్టేసింది TVS Raider. దాని సక్సెస్ చూసి హీరో కంపెనీ కూడా Xtreme 125R తో మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇప్పుడు ఈ రెండు బైక్‌ల టాప్ వేరియంట్‌లు డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లతో వచ్చాయి. కానీ హీరో మాత్రం మరో అడుగు ముందుకేసి, డ్యూయల్ చానల్ ABS కూడా అందించింది, ఇది ఈ సెగ్మెంట్‌లో మొదటిసారి.
పెర్ఫార్మెన్స్:
TVS Raider ఇంజిన్ 124.8సీసీ శక్తివంతమైన మోటార్‌తో వస్తుంది. ఇది 11.4PS పవర్, 11.2Nm టార్క్ ఇస్తుంది. ‘బూస్ట్ మోడ్’ అనే ప్రత్యేక ఫీచర్ ద్వారా అదనంగా 0.5Nm టార్క్ కూడా లభిస్తుంది.
హీరో Xtreme 125R కూడా టీవీఎస్ రైడర్‌కు సమానమైన పవర్ ఇస్తున్నా, దాని టార్క్ Raider కంటే కొద్దిగా తక్కువే. అయితే Xtreme 125R లో రైడ్-బై-వైర్ టెక్నాలజీ ఉండటంతో... క్రూయిజ్ కంట్రోల్, పవర్, రోడ్, ఈకో మోడ్స్ మధ్య రైడర్‌కి సులభంగా మారే అవకాశం ఉంటుంది.
డిజైన్ & కంఫర్ట్:
హీరో Xtreme 125R సీటు Raider కంటే 10mm ఎత్తుగా ఉంటుంది. కానీ రైడింగ్ పొజిషన్ చాలా సౌకర్యంగా ఉంటుంది.
Raider సీటు ఎత్తు తక్కువగా ఉండటంతో తక్కువ పొడవు ఉన్న రైడర్లకూ సౌకర్యంగా ఉంటుంది.
ఈ రెండు బైకుల్లో మోనోషాక్ సస్పెన్షన్ ఉంది, కానీ Xtreme రియర్ టైర్ మరింత వెడల్పుగా ఉంటుంది, ఇది రోడ్ గ్రిప్ పెంచుతుంది.
సేఫ్టీ & టెక్నాలజీ:
ఇది హీరో బైక్‌కి పెద్ద ప్లస్ పాయింట్. Xtreme 125R డ్యూయల్ చానల్ ABS తో వస్తుంది, Raider మాత్రం సింగిల్ చానల్ ABS మీదే ఆధారపడుతుంది.
హీరో బైక్‌లో కొత్త కలర్ LCD డిస్‌ప్లే, రైడింగ్ మోడ్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Raider మాత్రం TFT డిస్‌ప్లేతో ఆకట్టుకుంటోంది, ఇది వాయిస్ అసిస్టెంట్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సపోర్ట్ ఇస్తుంది.
ధరల పోలిక:
Hero Xtreme 125R టాప్ వేరియంట్ ధర TVS Raider కంటే సుమారు ₹8,000 ఎక్కువ. కానీ అందించే ఫీచర్లు దాన్ని జస్టిఫై చేస్తాయి.
Raider తక్కువ ధరలో మంచి టెక్నాలజీ అందిస్తుంది. ఎకానమి, యూత్ స్టైల్ రెండింటినీ కోరుకునే వారికి Raider సరైన ఎంపిక. కానీ సేఫ్టీ & రైడింగ్ మోడ్‌లు కోరుకునే వారికి Xtreme 125R కచ్చితంగా బెస్ట్ ఆప్షన్.
సేఫ్టీ, రైడింగ్ ఫన్, లుక్ - ఈ మూడు విషయాల్లో Hero Xtreme 125R కొంచెం ముందుంది. కానీ విలువకు తగ్గ బైక్ TVS Raider అవుతుంది.
ఓవరాల్‌గా చూస్తే, “అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కావాలంటే Hero Xtreme 125R, ఫన్ కావాలంటే TVS Raider” ను పరిశీలించమని చెప్పొచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.