గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 22 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu September 22 Episode)
సోఫా వెనక్కు పంపించడం బాలు తప్పు అని ఇంట్లో అందరూ ఫిక్స్ చేసేశారు. ఉమ్మడి కుటుంబంలో ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలసి తీసుకోవాలి కానీ ఇలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. తండ్రి సత్యం కూడా బాలుదే తప్పు అనడంతో ఏమీ మాట్లాడకుండా ఆగిపోతాడు. మేం ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, మొదట్నుంచీ మాపై కక్షకట్టారు, మేం వెళ్లిపోవాలని చూస్తున్నారు, వ్యాపారంలో మేం ఎదగకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది రోహిణి. బాలు గట్టిగా రియాక్టవడంతో ఆగిపోతుంది. పార్లర్ కి బయలుదేరిన రోహిణిని ఆపి..పసుపుతాడుతో ఉంటావా అమ్మా అని తెగ బాధపడిపోతుంది ప్రభావతి. మీనాన్న చూస్తే ఏమనుకుంటారు అనగానే..అమ్మో ఆ డబ్బులు కూడా నాన్నని అడిగి తెమ్మంటుందేమో అని నాకు అలవాటే నేను సర్దుకుపోతాను అంటుంది మీనా. నేను చిట్టీ డబ్బులు తీసి ఇస్తానమ్మా అంటే వద్దు అత్తయ్యా అనేస్తుంది. మళ్లీ మీనాను టార్గెట్ చేస్తుంది..ఇంతలో శ్రుతివచ్చి గట్టిగా నిలదీస్తుంది.బాలు తప్పు చేస్తే మీనాను ఎందుకంటారు.? అయినా మా అమ్మ సోఫా రిటర్న్ ఇచ్చి డబ్బులు వెంటనే ఇమ్మందా అని అడుగుతుంది శ్రుతి..లేదు అని చెబుతుంది రోహిణి. మరెందుకు అలా చేశావ్? పైగా మీనాను ఎందుకు నిందిస్తున్నావ్? అని నిలదీస్తుంది. ప్రభావతి రోహిణి షాక్ లో ఉండిపోతారు
ఇంట్లో పనంతా చేసేసి డల్ గా కూర్చుని ఉంటుంది మీనా. ఇంటికి వచ్చిన బాలు ఏమైంది మీనా అని అడిగితే ఆరోగ్యం బాలేదు అంటుంది. రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకో అంటాడు. లేదు ఇక్కడే ఉంటాను అంటుంది..నువ్వు రూమ్ లోకి వెళ్లి పడుకో నేను వెళ్లి మందులు తీసుకొస్తాను అంటాడు. జ్వరంగా ఉండడంతో రూమ్ లో చాప వేసుకుని నిద్రపోతుంది మీనా. షోరూం నుంచి ఇంటికి వచ్చిన మనోజ్..రూమ్ కి వెళ్లగానే మీనా కనిపిస్తుంది. వెంటనే కిందకు వచ్చి మీనా మా రూమ్ లో పడుకుందంటూ తల్లికి కంప్లైంట్ చేస్తాడు. అవునా పద దాని పని చెప్తా అంటూ ప్రభావతి విసురుగా వెళుతుంది.
ఇక్కడ పడుకున్నావేంటి? ఎవ్వరూ రాకముందే రూమ్ లోకి దూరిపోవాలి అనుకున్నారా? ఏం అనుకుంటున్నారు మీ మొగుడు పెళ్లాం? మీకు రూమ్ కావాల్సి వచ్చిందా? అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. మీనా తనకు ఆరోగ్యం బాలేదని చెబుతున్నా చేయి పట్టుకుని ఈడ్చుకొస్తుంది. రోహిణి , మనోజ్ చోద్యం చూస్తుంటారు కానీ ఏమీ అనరు. హాల్లోకి మీనాను ఈడ్చుకువస్తుంది..అప్పుడే బాలు ఎంట్రీ ఇస్తాడు. వీది వరకూ గెంటేస్తావా అని తల్లిని నిలదీస్తాడు. ఏం చేసిందిరా అని సత్యం వస్తాడు. ఇది రూమ్ లోంచి మీనాను ఈడ్చుకొచ్చింది నాన్నా అని చెప్తాడు. వాస్తవానికి రూమ్ ఈ వారం మొత్తం మీనా బాలు వంతు. రోహిణి మనోజ్ బయటపడుకోవాలి. కానీ ప్రభావతి కారణంగా మీనా బాలు బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆరోగ్యం బాలేకపోయినా మీనా విషయంలో ప్రభావతి రాక్షసత్వం ప్రదర్శించింది. ఇప్పుడు బాలు రూల్స్ మాట్లాడి...సత్యం సపోర్ట్ చేస్తే మనోజ్ రోహిణి బయటకు రావాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం....
నవరాత్రి సమయంలో సాంప్రదాయ దుస్తులు, పూజలు, ప్రసాదాల గురించి తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
దసరా నవరాత్రి కలశ స్థాపన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత! ఎలాంటి కలశ పెట్టాలి తెలుసుకునేందుకు...ఈ లింక్ క్లిక్ చేయండి