Sharadiya Navratri 2025: శారదీయ నవరాత్రులు సెప్టెంబర్ 22 సోమవారం ప్రారంభమవుతాయి.. తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో అమ్మవారుభక్తులను అనుగ్రహిస్తుంది. పదో రోజు విజయదశమితో వేడుకలు ముగుస్తాయి. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల కోడ్, అలంకరణలు, జానపద ఆచారాల గురించి తెలుసుకోండి
దుస్తుల కోడ్
నవరాత్రి సమయంలో మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. తెలుగు సంప్రదాయంలో చీరలు, లంగా-వోణి , అనార్కలీ డ్రెస్ లు వేసుకుంటారు.
అలంకారమే ప్రత్యేక ఆకర్షణ
మహిళలు బంగారు ఆభరణాలు, జడకుచ్చులు ధరిస్తారు. సింధూరం, కుంకుమ, గోరింట,కాళ్లకు పారాణి ..ఇవన్నీ అలంకరణలో భాగమే. రంగులు
శరన్నవరాత్రుల్లో తొమ్మిదిరోజుల్లో...అమ్మవారి రూపాలకు అనుగుణంగా నిర్దిష్ట రంగుల దుస్తులు ధరించే సంప్రదాయం ఉంది. మొదటి రోజు శైలపుత్రి తెలుపు, రెండో రోజు బ్రహ్మచారిణి ఆకుపచ్చ, మూడో రోజు చంద్రఘంట ఎరుపు..ఇలా రోజుకో రంగుకి ప్రాధాన్యత ఇస్తారు. పురుషులు సాధారణంగా పంచె (ధోతీ), కుర్తా-పైజామా, షేర్వాణీ ధరిస్తారు. పట్టు పంచెలు, జెరీ ఉన్న కుర్తాలు ప్రత్యేక సందర్భాలలో ఎక్కువగా కనిపిస్తాయి. అలంకరణలు
ఇంటిని రంగవల్లులతో అలంకరిస్తారు. ద్వారాలకు పసుపురాసి..గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు.
జానపద ఆచారాలు
బొమ్మల కొలువుకొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి బొమ్మలకొలువు పెడితే.. మరికొన్ని ప్రాంతాల్లో దసరాకి బొమ్మల కొలువుపెతారు. వివిధ రకాల బొమ్మలను ఓ క్రమపద్ధతిలో అమర్చి..పూజలు చేస్తారు.ఇరుగుపొరుగువారిని పిలిచి బొమ్మల కొలువు చూపించి.. వారికి పసుపు కుంకుమ , గాజులు అందిస్తారు. దండియా & గర్బాగుజరాతీ సంప్రదాయమైన దండియా, గర్బా నృత్యాలు తెలుగు రాష్ట్రాలలో కూడా జనాదరణ పొందాయి. ఈ నృత్యాలు సామూహికంగా రంగురంగుల దుస్తులు ధరించి సంబరంగా జరుపుకుంటారు
బతుకమ్మతెలంగాణలో నవరాత్రి సమయంలో బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకుంటారు. వివిధ పూలతో బతుకమ్మను అలంకరించి, స్త్రీలు సామూహికంగా నృత్యం చేస్తూ, పాటలు పాడతారు. ఇది దేవి యొక్క శక్తిని, ప్రకృతిని కొనియాడే సంప్రదాయం. అయితే దసరా ప్రారంభం కన్నా ఓరోజు ముందే బతుకమ్మ మొదలవుతుంది. భాద్రపద అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు మొదలై.. సద్దుల బతుకమ్మతో వైభవంగా ముగుస్తాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పండుగ వేళ మహిళల ఆటపాటలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.
పూజలు & హోమాలునవరాత్రి తొమ్మిది రోజులు రోజుకో రూపాన్ని ఆరాధించడంతో పాటూ..ప్రత్యేక పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహిస్తారు. దసరా రోజున ఆయుధ పూజ, వాహన పూజ చేస్తారు. జమ్మిచెట్టుని పూజిస్తే అన్నీ శుభాలే జరుగుతాయని నమ్మకం
ప్రసాదాలునవరాత్రి సమయంలో పులిహోర, పొంగలి, చక్కెర పొంగలి, కేసరి, పాయసం వంటి సాంప్రదాయ వంటకాలు తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించి భక్తులకు పంచుతారు.
ప్రాంతీయ వైవిధ్యంఆంధ్రప్రదేశ్: బొమ్మల కొలువు, దేవి పూజలు, సాంప్రదాయ వంటకాలు దసరా ప్రత్యేకంతెలంగాణ: బతుకమ్మ, పూల అలంకరణలతో సందడే సందడిగుజరాత్‌లో గర్బా/దండియా, బెంగాల్‌లో దుర్గా పూజ, కర్ణాటకలో మైసూర్ దసరా ప్రసిద్ధమైనవి
గమనిక:
ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించినవి. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
దసరా నవరాత్రి కలశ స్థాపన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత! ఎలాంటి కలశ పెట్టాలి తెలుసుకునేందుకు...ఈ లింక్ క్లిక్ చేయండి