Illu Illalu Pillalu Serial Today Episode కల్యాణ్ తన ఫ్రెండ్‌ని తీసుకొచ్చి రామరాజుకి పెన్‌డ్రైవ్ ఇవ్వమని చెప్తాడు. కల్యాణ్ ఫ్రెండ్ రామరాజు దగ్గరకు వెళ్లి ఫెన్‌డ్రైవ్ మీకు ఇచ్చారు సార్ పేరు చెప్పలేదు.. ఇది చూస్తే మీకు అర్థమవుతుందని చెప్పారని అంటాడు.
రామరాజు ల్యాప్‌టాప్ తెప్పిస్తాడు. అసలు ఇందులో ఏం ఉంది.. ఎవరు పంపారో అని అనుకుంటాడు. అయితే రామరాజుకి పెన్‌డ్రైవ్ ఎలా చూడాలో తెలీదు. మీరు ఓల్డ్ బావ మేం యంగ్ మాకు తెలుసు అని తిరుపతి ల్యాప్‌ట్యాప్ మీద పెట్టి ఇక్కడే పెడతారు బావ ఇందులో ఏం లేదు అని అంటాడు. దాంతో రామరాజు ల్యాప్‌టాప్ తీసుకొచ్చిన అబ్బాయినే పెన్‌డ్రైవ్ పెట్టమని అందులో ఏం ఉందో చూపించమని అంటాడు. ప్రేమ కల్యాణ్‌తో పాటు లేచిపోయిన రోజు రూంకి వెళ్లిన వీడియో ఉంటుంది. అది రామరాజు చూసే టైంకి ధీరజ్ వచ్చి ల్యాప్ టాప్ తీసుకుంటాడు.
తిరుపతి ధీరజ్‌తో పెన్‌డ్రైవ్‌లో ఏం ఉందో చూస్తుంటే తీసుకున్నావ్ ఏంట్రా అని అంటే ఇది నా పెన్‌డ్రైవ్ నా రిజల్ట్ చూసి మీకు తిట్టించాలి అని మీకు ఇచ్చారని చెప్పి పెన్‌డ్రైవ్ తీసుకుంటాడు. సరిగా చదువుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు కదా అని రామరాజు అంటాడు. అందులో ఏం ఉందో చెప్పురా.. నీకు ఫెయిల్ అవ్వడం అలవాటే కదా అయినా ఈ రోజు కొత్తగా టెన్షన్ పడుతున్నావ్ అంటే ఏదో తేడా కొడుతుంది అందులో ఏం ఉందో చెప్పరా అని అంటే ధీరజ్ రిజల్టే ఉంది అని చెప్పి ఫుడ్ డెలివరీ అని చెప్పి వెళ్లిపోతాడు. నాన్న దగ్గర పెద్ద గండం తప్పింది ప్రేమ పరిస్థితి ఏంటో అని అనుకుంటాడు.
ప్రేమి తన ఫ్రెండ్స్ పిలిచి అందరికీ నీ ఫొటోలు వస్తున్నాయే నీ పక్కన ఒకబ్బాయి ముఖం బ్లర్ అయింది.. ఫేస్ రివీల్ సూన్ అని ఉందే అని అంటారు. కల్యాణ్ నన్ను బ్యాడ్ చేయాలి అని చూస్తున్నాడు ఇప్పుడు ఎలా ఆపాలి అని ప్రేమ అనుకుంటుంది. మరోవైపు వల్లీ ప్రేమ ఫొటోల మ్యాటర్ తల్లికి చెప్తుంది. వల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ రోడ్డు మీద తిరుగుతూ ఈ విషయం గురించి తెగ మాట్లాడేసుకుంటూ చివరకు భాగ్యం కరెక్ట్‌గా గెస్ చేస్తుంది. మీ అత్తా తోడు కోడళ్లు ఫొటోలు కాల్చేశారు అంటే.. ఆ ఫొటోలో ఉన్న వాడిని ప్రేమ ప్రేమించి లేచిపోయి ఉండొచ్చు.. వాడు ప్రేమని మోసం చేయడం.. ప్రేమ చనిపోవాలి అనుకోవడంతో మీ అత్త ప్రేమ, ధీరజ్‌లకు పెళ్లి చేసుండొచ్చు.. రామరాజు అన్నయ్యతో వాళ్లది ప్రేమ పెళ్లి అని చెప్పుండొచ్చు అని మొత్తం కథ చెప్పేస్తుంది.
వల్లి షాక్ అయి నాకు ఇప్పుడు అనుమానంగా ఉంది ప్రేమ పెళ్లి చేసుకున్నవాళ్లు చాలా అన్యోన్యంగా ఉంటారు కదా కానీ ప్రేమ, ధీరజ్‌లు శత్రువుల్లా రోజు కొట్టుకు చస్తారని అంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా నువ్వు ఇంటికి వెళ్లి ఆ ఫొటోలు మీ మామయ్యకి కనిపించేలా చేయ్ అంటుంది. పేమ అయిపోయావే నిన్ను నా కాళ్ల దగ్గర కూర్చొపెట్టడానికి వస్తున్నానే అయిపోయావ్ అనుకుంటూ వల్లి ఇంటికి వెళ్తుంది.
ప్రేమ రోడ్డు మీద తిరుగుతూ కల్యాణ్‌ని వెతుకుతుంది. మరోవైపు ధీరజ్ కూడా కల్యాణ్‌ని వెతుకుతూ ఉంటాడు. రామరాజు, తిరుపతి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్తుంటారు. ప్రేమ టెన్షన్‌గా రోడ్ల మీద పరుగు పెట్టడం రామరాజు వాళ్లు చూస్తారు. ప్రేమ ఏంటి ఇక్కడా అనుకుంటారు. ఇక ప్రేమకి తన ఫ్రెండ్ కాల్ చేసి నీ ఫొటోలు నాన్ స్టాప్‌గా వస్తూనే ఉన్నాయే.. పది నిమిషాల్లో నీ పక్కన ఉన్నవ్యక్తి ఫొటో రివీల్ అవుతుందని మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయే త్వరగా కాలేజ్‌కి రా అని చెప్తుంది. ప్రేమ ధీరజ్‌కి కాల్ చేసి కాలేజ్‌లో అందరికీ ఫొటోలు వస్తున్నాయి. నన్ను అల్లరి చేయాలి అని చూస్తున్నాడు అని అంటుంది. నేను కల్యాణ్‌ని వెతుకుతున్నాను. నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి మళ్లీ ఫొటోలు వస్తే చెప్పు లొకేషన్ ట్రేస్ చేస్తా అని అంటాడు.
రామరాజు తిరుపతితో ప్రేమ ఎందుకు అంత టెన్షన్ పడుతుంది. ఇంట్లో కూడా ఎవరితో సరిగా ఉండటం లేదు.. అని అంటే నువ్వు కోడలితో ప్రేమగా మాట్లాడితే కదా తను ఏమైందో చెప్పేది అని తిరుపతి అంటుంది. ఇక ధీరజ్ కూడా కంగారుగా వెళ్లడం రామరాజు చూసి నాకు ఏదో తేడా కొడుతుందిరా అని అనుకుంటాడు. వల్లీ మంట పెట్టడానికి రెడీగా ఉంటుంది. వేదవతి నర్మదతో మ మామయ్య వస్తారు ఆ ఫొటోల సంగతి తెలీకూడదు అని నర్మదతో అంటుంది. వల్లి చూసి విషయం చెప్పాలని పరుగులు పెడితే వేదవతి వల్లి కంటే ముందు వెళ్లి ఏవండీ వచ్చేశారా అని అంటూ పరుగులు పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.