Gruhalakshmi Telugu Serial Today Episode:  పరంధామయ్యకు టైంకు వేయాల్సిన టాబ్లెట్స్‌ అన్ని లాస్యకు ఇస్తుంది తులసి. దీంతో చాలా హ్యాపీగా లాస్య ఇంతకు ముందు మామయ్యగారు నన్ను దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదని.. నేనంటేనే అసహ్యించుకునేవారని ఇప్పుడు మామయ్య గారికి సేవ చేసుకునే భాగ్యం తనకు కలుగుతుందని సంతోషపడుతున్నట్లు నటిస్తుంది.


లాస్య: కాకపోతే మామయ్యగారి ఆరోగ్యం తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. కానీ ఆయన ఆరోగ్యం త్వరలోనే బాగుపడుతుంది. ఈ ఇంట్లో నీ స్థానం నీకు దక్కుతుంది. నువ్వు దిగులు పడకు.


తులసి: నేను కోరుకునేది నేను ఆశపడేది. ఈ ఇంట్లో ప్రత్యేకమైన స్థానం గురించి కాదు. అత్తయ్య మామయ్య సంతోషంగా ఉండటం గురించి.  


   ఇంతలో హాల్ లో నంద, అనసూయ మాట్లాడుకుంటుంటే పరంధామయ్య వచ్చి అరే నందు నువ్వు జీవితంలో చేసిన మొదటి మంచి పని లాస్యను పెళ్లిచేసుకోవడమే అని చెప్తాడు. వాళ్లు మాట్లాడుకుంటుండగానే లాస్య టాబ్లెట్స్‌ తీసుకుని పరంధామయ్య దగ్గరకు వస్తుంది. లాస్యను చూసి పరంధామయ్య హ్యాపీగా ఫీలవుతాడు. లాస్య పరంధామయ్యకు టాబ్లెట్స్‌ ఇస్తుంది. నంద తనకు నిద్ర వస్తుందని వెళ్లి పడుకుంటానని వెళ్లబోతుంటే లాస్య ను తీసుకుని వెళ్లు మొగుడు పెళ్లాలు ఒకే గదిలో పడుకోవాలి అని పరంధామయ్య చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. వెంటనే తేరుకుని నంద తనకు వైరల్‌ ఫీవర్‌ ఉందని అందుకే తను వేరే గదిలో పడుకుంటుందని చెప్పడంతో పరంధామయ్య సరే అని వెళ్లిపోతాడు. మరోవైపు దివ్య, విక్రమ్‌ బెడ్‌రూంలో పడుకుని ఉండగా బాల్కనీలొంచి రాజ్యలక్ష్మీ ఏర్పాటు చేసిన దెయ్యం దివ్య రూంలోంకి వచ్చి దివ్యను బయటకు తీసుకెళ్తుంది. దూరం నుంచి చూస్తున్న రాజ్యలక్ష్మీ, బసవయ్య హ్యాపీగా ఫీలవుతారు.  ( ఆ దెయ్యం ఎవరో కాదు కొద్ది రోజుల కిందట దివ్య కారు కింద పడిన అమ్మాయి.)


దెయ్యం: తప్పు చేసి తప్పించుకుందామనుకుంటున్నావా? నిర్లక్ష్యంతో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నావు. ఏమీ పట్టనట్లు ప్రశాంతంగా నిద్రపోతున్నావు.


దివ్య: చూడు నీ పేరేంటి?


దెయ్యం: చచ్చాక నా పేరుతో పనేంటి?


దివ్య: నేను నిన్ను కావాలని చంపలేదు.


దెయ్యం: అయితే చేసింది తప్పు కాదంటావా? ఇప్పుడే ఇక్కడే నువ్వు నా కళ్లముందే చనిపోవాలి. లేకపోతే వెళ్లి మీ ఆయన్ని చంపి నా పగ తీర్చుకుంటాను.


దివ్య: వద్దు ఆయన జోలికి పోవద్దు..


 దెయ్యం: మరైతే చచ్చిపో..


  అనగానే దివ్య బాల్కనీ లోంచి దూకి చనిపోవడానికి వెళ్లగానే దూరం నుంచి చూస్తున్న రాజ్యలక్ష్మీ, బసవయ్యల వైపు దెయ్యం సక్సెస్‌ అన్నట్లు చూస్తుంది. రాజ్యలక్ష్మీ దెయ్యాన్ని పక్కకు వెళ్లు అన్నట్లుగా సైగ చేస్తుంది. దెయ్యం పక్కకు వెళ్తుంది. ఇంతలో విక్రమ్‌ నిద్ర లేచి దివ్యను వెతుక్కుంటూ వస్తాడు. బాల్కనీలోంచి దూకబోతున్న దివ్యను చేయి పట్టుకుని ఆపుతాడు.


విక్రమ్‌: ఏంటి నువ్వు చేస్తున్న పని..


దివ్య: నేను చేసిన పాపానికి ప్రాయశ్చితం


విక్రమ్‌: ప్రాణం తీసుకునేంత పాపం ఎం చేశావు.


దివ్య: ఒక చావుకు కారణం అయ్యాను.


విక్రమ్‌: అందుకని మూడు ప్రాణాలు బలి తీసుకుంటావా? నువ్వు పోతే నీతో పాటు నీ కడుపులో ఉన్న మన బిడ్డ కూడా పోతుంది. మీ ఇద్దరూ పోతే నేను మాత్రం ఎందుకు బతికుంటాను ఎలా బతికుంటాను. నిన్ను మనఃస్పూర్తిగా నమ్మినందుకు ఇదా నువ్వు నాకిచ్చే బహుమతి. ఎందుకింత పిచ్చిగా బిహేవ్‌ చేస్తున్నావ్‌. నువ్వు ఏ పాపం చేయలేదు. ఎవర్ని చంపలేదు అంటే నమ్మవేంటి? నాగురించి ఆలోచించవా? నీకు సంబంధం లేదా? ఎందుకింత స్వార్థం ఎందుకు నేనంటే నిర్లక్ష్యం. నేను నీ కళ్ల ముందు పైనుంచి దూకుతాను చూడు.


అంటూ విక్రమ్‌ కూడా దూకబోతుంటే దివ్య ఆపి హగ్‌ చేసుకుంటుంది. మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయనని నాకు మాటివ్వు అని అడుగుతాడు విక్రమ్‌. సరేనని మాటిస్తుంది దివ్య. దూరం నుంచి గమనిస్తున్న రాజ్యలక్ష్మీ, బసవయ్య అప్‌సెట్‌ అవుతారు. మరోవైపు లాస్య డాక్టర్‌కు ఫోన్‌ చేసి నువ్వు చేసిన ట్రీట్‌మెంట్‌ సరిపోవడం లేదు. నువ్వు ఇంకా డోస్‌ పెంచాలి అనగానే ఎందుకు అని డాక్టర్‌ అడుగుతాడు.  ఆ ముసలోడికి నా మీద ప్రేమతో పాటు తులసి మీద ధ్వేషం కూడా రావాలని చెప్పాను కదా అంటుంది లాస్య. అది కూడా చేశానని డాక్టర్‌ చెప్పడంతో లేదు అటువంటి లక్షణాలు ఏవీ కనిపించడం లేవు అని లాస్య డాక్టర్‌కు చెప్తుండగానే తులసి కాఫీ తీసుకొచ్చి పరంధామయ్యకు ఇస్తుంటే తను కాఫీ తీసుకోడు పైగా తులసిని తిడుతుంటే లాస్య ఒక్క నిమిషం ఆగండి మీ ట్రీట్‌మెంట్‌ రిజల్ట్‌ మొదలైనట్లు ఉంది అంటుంది. పరంధామయ్య అందరిని తిట్టి తులసిని లాస్యకు సారీ చెప్పమని ఆర్డర్‌ వేస్తాడు. అందరూ వద్దని చెప్పినా తులసి, లాస్యకు సారీ చెప్తుంది. మరోవైపు గార్డెన్‌లో కూర్చుని దివ్య, దెయ్యం అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. ఇంతలో విక్రమ్‌ వచ్చి ఓదారుస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.