Gruhalakshmi September 8th: సామ్రాట్ గురించి ఆలోచిస్తూ తులసి తిండి కూడా తినకుండా కూర్చుని బాధపడుతుంటే నందు భోజనం తీసుకుని వస్తాడు. వద్దని చెప్తుంది కానీ నందు మాత్రం తన మనసు మార్చడానికి చూస్తాడు. నిస్సహాయంగా నిలబడినప్పుడు సామ్రాట్ నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. కళ్ళు మూసినా తెరిచినా ఆయన చేసిన సహాయాలు గుర్తుకు వస్తున్నాయి. కేఫ్ ని నిలబెట్టుకోవడం కోసం ఆయన ఆఫీసు నుంచి వచ్చేశాను. నేను తప్పు చేశాను ఏమో సోరి చెప్పడానికి కూడా వినిపించినంత దూరంగా వెళ్లిపోయారు. చాలా గిల్టీగా అనిపిస్తుందని బాధపడుతుంది.


నందు: కళ్ళు మూసుకుని ఆయనకి సోరి చెప్పు. ఏ లోకంలో ఉన్నా వినబడుతుంది


తులసి: నేనే ఈ బాధని తట్టుకోలేకపోతున్నా చిన్న పిల్ల హనీ ఎలా తట్టుకుంటుంది


నందు: హనీకి నచ్చజెప్పి భోజనం పెట్టి ఇక్కడ నువ్వు కడుపు మాడ్చుకుంటే ఎలా ఉంటుంది. మంచి ఫ్రెండ్ ని పోగొట్టుకుంటే బాధగానే ఉంటుంది. కానీ భోజనం చెయ్యి. నువ్వు తినకపోతే ఇంట్లో ఎవరం భోజనం చేయము


Also Read: రాజ్ మీద డౌట్ పడిన పెద్దాయన, కావ్యకి ఊహించని బహుమతి, రగిలిపోతున్న అపర్ణ


తులసి: మనసు బాగోలేదు అర్థం చేసుకోండి. ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళండి


అలా చేస్తే నువ్వు తినవు నువ్వు తిన్నాకే వెళ్తానని పట్టుబడతాడు. దీంతో తులసి భోజనం చేస్తుంది. అది చూసి పరంధామయ్య వాళ్ళు సంతోషపడతారు. ఎప్పటికైనా తులసికి దగ్గర అవుతాడని ఆశపడతారు. తెల్లారి తులసి హనీ కోసం క్యారేజ్ ప్రిపేర్ చేస్తుంది. కేఫ్ కి రావడం లేదా అని నందు అంటే లేట్ గా వస్తానని వెళ్లిపొమ్మని చెప్తుంది. హనీ కోసం ఆ ఇంటికి వెళ్ళడం అవసరమా అని నందు అంటే తులసి మాత్రం ఎప్పటిలాగే తన పంథాలో మాట్లాడుతుంది. పాప అవసరాలు చూస్తూ ఉంటే హనీ తులసికి అలవాటు అయిపోతుందని, ఎప్పుడైనా కనిపించకపోతే కష్టం అవుతుంది కదా నందు చెప్తాడు. అది జరిగినప్పుడు చూద్దాంలే అని తులసి వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది.


విక్రమ్ నిద్రలేచి తనకి ఎదురుగా ఉన్న దివ్యని చూస్తాడు. తల తుడుచుకుంటూ కావాలని నడుము చూపిస్తూ టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. విక్రమ్ తిప్పలు పడుతూ ఉంటాడు. హనీ నిద్రలో ఉలిక్కిపడి లేచి కిందకి వచ్చి డాడీ వచ్చారు తనని పిలిచారని అంటుంది. తన మాటలు విని సామ్రాట్ బాబాయ్ బాధపడతాడు. అప్పుడే తులసి కూడా వస్తుంది. నిద్రపోతుంటే డాడీ వచ్చి పిలిచారు హనీ అని పిలిచారు అది చెప్తుంటే తాతయ్య నమ్మడం లేదు. డాడీ ఎక్కడ ఉన్నాడో వెతకమని అమాయకంగా చెప్తుంది. సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అవుతాయి. ‘గుప్పెడంత మనసు’ దేవయాని ఇప్పుడు ‘గృహలక్ష్మి’లో చక్రం తిప్పడానికి వచ్చేసింది. తులసి హనీకి భోజనం పెడుతుంది. సామ్రాట్ చిన్నాన్న కొడుకు ధనుంజయ్ ఎంట్రీ ఇస్తాడు. భార్య రత్నప్రభ, కూతురితో కలిసి సామ్రాట్ ఇంటికి వస్తాడు. రాగానే సామ్రాట్ ఫోటో దగ్గరకి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుని ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తాడు.


ధనుంజయ్ వాళ్ళని చూసి సామ్రాట్ బాబాయ్ ఇప్పుడు కాస్త ధైర్యంగా ఉందని ఆఫీసు బాధ్యతలు చూసుకోమని అంటాడు. తులసి: అది మాత్రమే కాదు హనీ బాధ్యత కూడా మీదే


రత్నప్రభ: మీరు తులసి కదా. సామ్రాట్ మీ గురించి చెప్తూ ఉండేవాడు. హనీ గురించి దిగులుపడొద్దు నేను ఉన్నాను కదా అని తనకి అన్నం తినిపిస్తుంది


Also Read: దివ్యకి సవతి పోరు - తులసిని ఓదార్చేందుకు నందు ప్రయత్నాలు


విక్రమ్ తండ్రి కోసం షర్ట్ కొని తీసుకొస్తాడు. కొత్త షర్ట్ కొంటె సంతోషపడను, నువ్వు దివ్య కలిసి సంతోషంగా ఉంటేనే ఆనందంగా ఉంటుందని ప్రకాశం అంటాడు. ఈ విషయంలో ఎవరు చెప్పినా కూడా వినేది లేదని విక్రమ్ కోపంగా చెప్తాడు.


ప్రకాశం: భార్యాభర్తలు అన్న తర్వాత కోపాలు ఉంటాయి. వాటిని పెంచి పెద్దవి చేసుకోకూడదు


విక్రమ్; ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ అన్నింటికీ సర్దుకుపోలేను