Gruhalakshmi Serial September 7th Episode:  పూజలో లాస్య పట్టుబడేలా చేసిన దివ్య ను తలుచుకుని రగిలిపోతూ ఉంటుంది. బసవయ్య వెళ్ళి కదలిస్తాడు. రాకెట్ మండినట్టు మండుతున్నావ్ ఎవరి మీద అంటే దివ్య మీద అని కోపంగా చెప్తుంది.


రాజ్యలక్ష్మి: విక్రమ్ కి నా మీద ఉన్న నమ్మకం అంతా పోగొడుతుంది


బసవయ్య: అవును లేదంటే చేజారిపోతాడు. ఇంట్లో ముసలం పుట్టేలా ఉంది నీకు దెబ్బ మీద దెబ్బ తగులుతుందని అంటుండగా దివ్య వస్తుంది.


దివ్య: అసలే కాలు విరిగింది లాస్య ఆంటీని తరిమేయడంతో కుడి చెయ్యి విరిగింది. ఇక ఎడమ చెయ్యి మాత్రమే మిగిలింది అంటుండగా విక్రమ్ వచ్చి ఏమైందని అంటాడు. లాస్య చేసిన పనికి అత్తయ్య బాధపడుతున్నారని చెప్తుంది.


విక్రమ్: ఎందుకు బాధపడటం ఇప్పటికైనా నిజం తెలుసుకున్నాం. దివ్య పుణ్యమా అని లాస్య ఆంటీని వదిలించుకున్నాం


Also Read: మురారీ తన భర్తని చెప్పకనే చెప్పిన ముకుంద- భవానీ మాటలకు షాకైన శ్రీనివాసరావు


బసవయ్య ఉన్న వాడు ఊరుకోకుండా లాస్య మీద పోలీస్ కేసు అంటూ వాగుతాడు. ఇంటి గొడవలు పోలీసుల దాకా వెళ్ళడం తనకి ఇష్టం లేదని విక్రమ్ వద్దంటాడు. తల్లిని జాగ్రత్తగా చూసుకోమని దివ్యతో విక్రమ్ చెప్తాడు. తులసి దిగాలుగా ఇంటికి వస్తుంది. సామ్రాట్ వెళ్లిపోయారు, ఆఖరి చూపు కూడా అందనంత దూరంగా వెళ్లిపోయారని తులసి బాధగా చెప్పి వెళ్ళిపోతుంది. నందు ఆవేశంగా తండ్రి చేతిలో ఉన్న ప్రేమ లేఖ చింపేయబోతాడు.


నందు: తులసికి నా మనసులో ప్రేమ సంగతి చెప్దామని అనుకుంటే ఏదో ఒక అడ్డంకి వస్తుంది. పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు


పరంధామయ్య: అన్ని పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవు


నందు: నేను తులసి మళ్ళీ ఒక్కటి కావడం దేవుడికి ఇష్టం లేదనుకుంటా అందుకే ఇలా జరుగుతుంది


పరంధామయ్య: అలా అనకు పరిస్థితి అనుకూలంగా లేదని ఆశ వదులుకుంటారా?


నందు: ఇప్పుడు ఎలా మాట్లాడతాను. సామ్రాట్ గురించి షాక్లో ఉంది. తనతో ఈ టైమ్ లో విషయం ఎలా చెప్తాను


పరంధామయ్య: అవును తనని షాక్ నుంచి బయటకి తీసుకురా


అనసూయ: నువ్వు దూరం చేసుకున్నాక తులసి మళ్ళీ పెళ్లి ఆలోచన మనసులోకి రానివ్వలేదు. ఆ మనసు మార్చే బాధ్యత నీదే


డైనింగ్ టేబుల్ దగ్గర ప్రియ వడ్డించబోతుంటే దివ్య ఆపుతుంది. నాకులాగా నువ్వు ఈ ఇంటి కోడలివే మాతో పాటు కలిసి కూర్చోమని దివ్య పిలుస్తుంది. కానీ రాజ్యలక్ష్మి ప్రియ వైపు కోపంగా చూస్తుంది. అత్తయ్య మనసు వెన్న అంటూ దివ్య బిస్కెట్ వేస్తూ రాజ్యలక్ష్మి నోటితోనే కూర్చోమనేలా చేస్తుంది.


ప్రియ: లేదులే నేను మా వారితో కలిసి తింటాను


Also Read: కళావతి మీద రాజ్ దొంగ ప్రేమ - స్వప్న, రాహుల్ ఎక్కడికి వెళ్ళినట్టు!


దివ్య: కాలం మారిపోయింది. ఈరోజుల్లో కూడ ఈ పట్టింపులు ఏంటి ప్రియ. మనుషులతో పాటు పద్ధతులు మారిపోయాయి. అత్తయ్యని చూడు మావయ్య భోజనం చేయకుండా తను చేస్తున్నారు అనేసరికి రాజ్యలక్ష్మి పైకి లేవబోతుంటే దివ్య ఆపుతుంది. తనకి డబ్బులు ఇచ్చినందుకు పని మనిషి దివ్యకి కృతజ్ఞతలు చెప్తుంది. ఇంట్లో పని చేసే వాళ్ళకి ఫ్రీగా డబ్బులు ఇస్తూ కూర్చుంటే మనం అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని బసవయ్య దెప్పి పొడుస్తాడు. దివ్య చేసిన దాంట్లో తప్పేమీ లేదని విక్రమ్ వెనకేసుకొస్తాడు.


దివ్య: ఇప్పటికీ బుద్ది తెచ్చుకుని మారకపోతే ఇంకొన్ని లెక్కలు సెటిల్ చేయాల్సి వస్తుంది. ఇంకొన్ని చీటీలు చింపేయాల్సి వస్తుంది గుర్తు పెట్టుకోండి బాబాయ్ అని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఆ మాటలకి రాజ్యలక్ష్మి రగిలిపోతుంది. అర్జెంట్ గా దివ్యని విక్రమ్ కి దూరం చేయాలి.


బసవయ్య: అలా చేయాలంటే విక్రమ్ జీవితంలోకి మరొక ఆడది రావాలి


రాజ్యలక్ష్మి: నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను. సవతిని ఫిక్స్ చేశాను


బసవయ్య: ఆ సవతి ఎవరు


ప్రసన్న: ఆ అదృష్టవంతురాలు ఎవరు


రాజ్యలక్ష్మి: ఇంకెవరూ నీ కూతురు జాహ్నవి. తనే విక్రమ్ కి ఎక్కు పెట్టిన బాణం నాకు కాబోయే కోడలు. మీకు ఇష్టమేనా అంటే బసవయ్య వాళ్ళు సంతోషపడతారు. ఇక దివ్యకి కౌంట్ డౌన్ మొదలైందని అనుకుంటుంది.


తులసి సామ్రాట్ ని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. తనతో గడిపిన క్షణాలు తలుచుకుని ఎమోషనల్ అవుతుంటే అనసూయ వచ్చి భోజనానికి రమ్మని పిలుస్తుంది. కానీ తనకి తినాలని లేదని రానని చెప్తుంది. అనసూయ దిగులుగా వచ్చి తులసి తిననని చెప్పిందని అనేసరికి భోజనం పెట్టివ్వు తినిపించి వస్తానని నందు అంటాడు. భోజనం తీసుకుని తులసి దగ్గరకి వెళతాడు.