బ్రహ్మముడి సెప్టెంబరు 6 ఎపిసోడ్ ( Brahmamudi Serial September 6th Episode )


కావ్య ఇంటి ముందు ముగ్గు వేస్తుంటే రాజ్ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి దాన్ని తొక్కబోతుంటే గట్టిగా అరుస్తుంది. ఏమైందని అంటే ముగ్గు అని అంటుంది. తొక్కలో ముగ్గు అని తిడతాడు. అప్పుడే అటుగా సీతారామయ్య రావడం చూసి ముగ్గు బాగుందని కావ్యని తెగ మెచ్చుకుంటాడు. అది చూసి ముసలాయన సంతోషంగా ఉంటాడు. రాజ్ కావ్యని ఆకాశానికి ఎత్తేయడం  అపర్ణ చూస్తుంది. మా మమ్మీ కూడా ముగ్గు వేస్తుంది సాలె గూడు వేసినట్టు అల్లుతుందని నోరు జారతాడు. అపర్ణ పక్కన నిలబడిన రుద్రాణి పెళ్ళాం బెల్లం అయ్యింది తల్లి అల్లం అయ్యిందని పుల్ల వేసి వెళ్ళిపోతుంది. అనామిక కారు డ్రైవ్ చేస్తూ పొరపాటున కళ్యాణ్, అప్పులని ఢీ కొడుతుంది. దీంతో వాళ్ళిద్దరూ కింద పడిపోతారు. అప్పు వెళ్ళి అనామికతో గొడవకు దిగుతుంది.


Also Read: 'నీ భర్త ఎవరంటూ' ముకుంద మీద భవానీ ఫైర్- మనసులో మాట చెప్పిన మురారి!


తను ఎవరో కాదు అనామిక అని కళ్యాణ్ చెప్తాడు. నీ కవితలు ఇష్టపడి మనల్ని పిచ్చోళ్ళని చేసిన ఆ అమ్మాయా అంటుంది. కళ్యాణ్ ని చూసి సరదాగా ఆట పట్టించడం కోసం కారు ఫాస్ట్ గా తీసుకొచ్చానని అనామిక చెప్తుంది. బయటకి వెళ్ళాలని అనామిక అనేసరికి అప్పుని సైడ్ చేసేసి కళ్యాణ్ తనతో పాటు వెళ్ళిపోతాడు. రాజ్ ఆఫీసుకి వెళ్ళడం కోసం కిందకి వచ్చి కావ్యని బ్రేక్ ఫాస్ట్ రెడీ అయ్యిందా అని అడుగుతాడు. ఒక పది నిమిషాలు పడుతుందని వెయిట్ చేయమని చెప్తుంది. దీంతో అపర్ణ నోరు పారేసుకుంటుంది. ఆఫీసులో తనకి వర్క్ ఉందని రాజ్ వెళ్లిపోతానని చెప్తాడు. టెన్షన్ ఎందుకు కావ్య టిఫిన్ చేసి క్యారేజ్ ఆఫీసుకి తీసుకొస్తుందని సీతారామయ్య అనేసరికి రాజ్ గొర్రెలాగా తల ఊపుతాడు. ఆఫీసుకి వెళ్తూ కావ్యకి వెళ్లొస్తాను అని స్పెషల్ గా చెప్పి మరీ బయలదేరతాడు.


అనామిక కళ్యాణ్ ని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. తన తల్లిదండ్రుల్ని కళ్యాణ్ కి పరిచయం చేస్తుంది. అనామిక తన ఇష్టాయిష్టాలని కళ్యాణ్ తో పంచుకుంటుంది. తన గదికి తీసుకెళ్ళి మొత్తం రూమ్ అంతా చూపిస్తుంది. అక్కడ టేబుల్ మీద కళ్యాణ్ ఫోటో ఉంటే అది అతని కంట పడకుండా అడ్డు నిలబడుతుంది. ఏంటి చూడకూడదా అంటే చూడవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు చూసే మొదటి వ్యక్తి మీరే అవుతారని చెప్తుంది.


స్వప్న వాళ్ళు కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లారని ఇంద్రాదేవి అడుగుతుంది.


రుద్రాణి: మార్నింగ్ లేచి బయటకి వెళ్తున్నామని చెప్పేసి వెళ్లారు


అపర్ణ: అసలు ఎక్కడికి వెళ్లారు


రుద్రాణి: ఈ ఇంట్లో జరిగే గొడవలతో చాలా డిస్ట్రబ్ అయ్యారంట అందుకే ప్రశాంతంగా ఓ పది రోజులు గడిపి రావాలని వెళ్లారు


ఇంద్రాదేవి: ఇంట్లో గొడవలకు వాళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళేం తలదూర్చడం లేదు కదా చూస్తూనే ఉంటున్నారుగా 


సీతారామయ్య: ఇంత పెద్ద విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పకపోవడం ఏంటి?


రుద్రాణి: అడిగితే హనీ మూన్ అన్నారు


ఇంద్రాదేవి: కడుపుతో ఉన్న పిల్లకి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ పిల్లకి బుద్ధి లేకపోయినా నువ్వు చెప్పాలి కదా


Also Read: కావ్య మనసులో కొత్త ఆశలు- రాజ్ నమ్మకద్రోహం, కొడుకు ప్రవర్తనతో షాక్లో అపర్ణ


రుద్రాణి: ఏంటి అందరూ నా మీద పడుతున్నారు. వాళ్ళు వెళ్తుంటే అడ్డుపడమంటారా? భార్యాభర్తలు అన్నాక సరదాగా బయటకి వెళ్ళడం తప్పా?


సీతారామయ్య: తప్పే.. భార్యాభర్తలు అమ్మానాన్న కాబోతున్నారు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కడుపులో బిడ్డకి ఏమైనా అయితే ఎవరు సమాధానం చెప్తారు


కావ్య: ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్లారు? ఏదో జరిగింది మా అక్క అంత ధైర్యం చేయదు. ఏదైనా గొడవ జరిగిందా పుట్టింట్లో వదిలి పెట్టడానికి వెళ్లారా?


రుద్రాణి: వాళ్ళు బాగానే ఉన్నారు


ఇంద్రాదేవి: అయితే వెంటనే వాళ్ళని ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు


రుద్రాణి ఫోన్ ట్రై చేస్తుంది కానీ కలవదు. కావ్య టెన్షన్ గా స్వప్నకి ఫోన్ ట్రై చేస్తుంది. కలవడం లేదని టెన్షన్ పడుతుంటే ధాన్యలక్ష్మి సర్ది చెప్తుంది.


తరువాయి భాగంలో..


కావ్య అందరికీ వడ్డిస్తుంటే తమతో పాటు కూర్చుని తినమని రాజ్ అంటాడు. కావ్యకి తనే స్వయంగా వడ్డిస్తాడు. భార్యకి పొరపోతే తల నిమిరి వాటర్ పట్టిస్తాడు. ఇదంతా చూసి అపర్ణ కోపంతో రగిలిపోతుంది.