మామూలుగా బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో ఇద్దరి కంటెస్టెంట్స్ మధ్య గొడవ జరగాలంటే అది వారిద్దరి మధ్య ఉన్న సమస్యల కారణంగా మాత్రమే కాదు.. ఇతర కంటెస్టెంట్స్ క్రియేట్ చేసే ప్రభావం కూడా కావచ్చు. అలాగే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7లో కూడా పలువురు కంటెస్టెంట్స్ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. కొన్ని నామినేషన్స్ వల్ల క్రియేట్ అయితే.. కొన్ని మాత్రం అంతకంటే ముందు నుండే ఉన్నాయి. సీక్రెట్ టాస్క్ పేరుతో అప్పుడే గౌతమ్ కృష్ణకు, ప్రిన్స్ యావర్‌కు మధ్య పుల్లలు పెట్టాడు తేజ. ఆ గొడవలు అనేవి ఒకరిపై ఒకరు నామినేషన్ వేసేవరకు వచ్చాయి.
షో ఆఫ్ అంటూ గొడవ..
ప్రిన్స్ యావర్‌కు తరువాత నామినేషన్ వేసే అవకాశం వచ్చింది. అప్పుడు తను గౌతమ్ కృష్ణను, షకీలాను నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. షకీలా తన దగ్గరకు వచ్చి ‘నీ పేరు ప్రిన్సా, అయితే మీ డాడి కింగా’ అనే చాలా అమర్యాదగా మాట్లాడారని, ఆమె మాటలు తనకు నచ్చలేదని చెప్తూ షకీలాను నామినేట్ చేశాడు యావర్. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ.. తనను షో ఆఫ్ అని పిలిచాడని, ఆ విషయం తనకు తేజ వచ్చి చెప్తే తెలిసిందని కారణం చెప్తూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. నామినేషన్ జరిగిన తర్వాత అసలు విషయం ఏంటో యావర్‌తోనే చర్చించాలని అనుకొని తన దగ్గరకు వెళ్లాడు గౌతమ్ కృష్ణ.
మనస్పర్థలు తొలగిపోయాయి..
టేస్టీ తేజను పిలిచి అసలు ఎవరు ఎవరిని షో ఆఫ్ అన్నారని అడిగాడు గౌతమ్ కృష్ణ. యావర్‌తో వెళ్లి ‘నా దగ్గరకు వచ్చి నేను నిన్ను ఇమిటేట్ చేస్తున్నట్టు నువ్వు ఫీలవుతున్నావని, షో ఆఫ్ చేస్తున్నట్టు అనిపిస్తుందని తేజ చెప్పాడు’ అని జరిగిన విషయమంతా చెప్పాడు గౌతమ్. దీంతో గౌతమ్, యావర్.. ఒకరిని ఒకరు ఏమీ అనలేదని, అదంతా తేజ క్రియేట్ చేసిన అబద్ధమని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇదేమైనా టాస్కా అని తేజను ప్రశ్నించాడు గౌతమ్. దానికి తేజ.. నాకు తెలిసిన విషయం నేను చేరవేశాను, ఉద్దేశ్యపూర్వకంగా కాదని అన్నాడు. రతికతో నిజం చెప్పించడానికి ట్రై చేశాడు తేజ. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. మొత్తానికి గౌతమ్, యావర్ మధ్య ఉన్న మనస్పర్థలు తొలిగిపోయి ఒకరిని ఒకరు హత్తుకున్నారు.
నన్ను నామినేట్ చేసినందుకు నేనూ చేస్తున్నాను..
యావర్.. షకీలాను నామినేట్ చేసిన కారణం తనకు నచ్చలేదు. దీంతో షకీలా కూడా యావర్‌ను నామినేట్ చేసింది. ‘అసలు అతను ఎవరో కూడా తెలియదు. పేరు చూస్తే ప్రిన్స్ అని ఉంది. అంటే నువ్వు ప్రిన్సా. మీ నాన్న కింగా అని మామూలుగా అడిగాను. ఒకవేళ నేను అలా అడిగిన విషయం అతడికి నచ్చకపోయింటే.. అప్పుడే నన్ను అడగాల్సింది. ఆ కారణంతో నన్ను నామినేట్ చేశాడు కాబట్టి నేను కూడా తనను నామినేట్ చేస్తున్నాను’ అంటూ షకీలా.. యావర్‌ను నామినేట్ చేసింది. అతడితో పాటు పల్లవి ప్రశాంత్‌కు ఎలా ప్రవర్తించాలో అర్థం కావడం లేదని, తను ఏం చెప్పినా అర్థం కాన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడని చెప్తూ అతడిని కూడా నామినేట్ చేసింది షకీలా.
Also Read: రతిక మైండ్ గేమ్‌కు బలి పశువైన టేస్టీ తేజ - పాపం, అనవసరంగా బుక్కయ్యాడు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial