గుప్పెడంతమనసు సెప్టెంబరు 7th ఎపిసోడ్ (Guppedanta Manasu September 7th Written Update)


ఏంజెల్ మనసులో ఉన్నది నువ్వేనని నాకు తెలుసు రిషి అని విశ్వం అనగానే షాక్ అవుతాడు. 
విశ్వనాథం:  ఏంజెల్ ఇష్టపడుతోంది. పెళ్లి చేసుకోవాలి అనుకుంటోంది నిన్నే రిషీ.. తను తీసుకున్న నిర్ణయం సరైనదే. నువ్వే తనని ఎల్లప్పుడు కాపాడతావ్. నేను తనకి నీలాంటి అబ్బాయిని భర్తగా తీసుకుని రాలేను రిషీ. 
రిషి: సార్ అది కాదు సార్’ అంటూ రిషి మాట పూర్తి కాకుండానే...
విశ్వనాథం: రిషీ.. నువ్వు ఇంతకాలం తనకు కేవలం స్నేహితుడివి మాత్రమే.. కానీ ఒక మంచి స్నేహితుడు భర్త అయితే ఆడపిల్ల జీవితం జీవితాంతం సంతోషంగా ఉంటుంది. నువ్వు ఏంజెల్‌ని పెళ్లి చేసుకో రిషీ.. ఇందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఏంజెల్ అడిగితే ఎందుకు వద్దు అంటున్నావ్?’ 
రిషి: నాకు పెళ్లి అనే బంధం సెట్ అవ్వదు సార్. అయినా నేను ఏంజెల్ పెళ్లి చేసుకోవడం ఏంటీ సార్.. నేను ఎప్పుడు తనని అలాంటి దృష్టితో చూడలేదు. ఇకపై చూడలేను కూడా నన్ను క్షమించండి సార్
విశ్వనాథం: అలా అనొద్దు రిషీ.. నేను చాలా బాధపడతాను. నీ మాటలు నా మనసుకి చాలా కష్టంగా ఉంటుంది.
రిషి: సార్ మీరు కంగారు పడకండి.. ఏంజెల్‌కి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం
విశ్వనాథం: ఇప్పుడు సమస్య అది కాదు రిషి.. ఏంజెల్ మనసులో ఉన్న నీతో తన పెళ్లి జరిపించడం నా బాధ్యత. సరే ఒక ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు.  నీకు గతంలో ప్రేమ ఉందా? నీ జీవితంలో అమ్మాయి ఉందా? ఉంటే చెప్పు.. నేను ఏంజెల్‌తో మాట్లాడతాను. అసలు నీ తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడుంటారు?’
రిషి: సార్ ప్లీజ్.. నా గతం గురించి అడగొద్దు
విశ్వనాథం: సరే అడగను.. అయితే మరి ఏంజెల్‌ని పెళ్లి చేసుకుంటావా
రిషి నిస్సహాయంగా చూస్తుండిపోతాడు
విశ్వనాథం: రిషీ నువ్వు ఏంజెల్‌ని పెళ్లి చేసుకో.. నాకు నిశ్చింతగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటాను. ఇక నేను ఎక్కడికి వెళ్లినా చివరికి పైకి వెళ్లినా..’ 
రిషి: మీరు బావుండాలి సార్
విశ్వనాథం: నిన్ను ఇబ్బంది పెడుతున్నా అనుకోవద్దు రిషీ.. నువ్వు ఆలోచించుకుని నువ్వు సరైన నిర్ణయం.. నా మనసుకి నచ్చే నిర్ణయం తీసుకుని చెప్పు 


Also Read: సీరియల్ ని మలుపుతిప్పనున్న రిషి సమాధానం, మరింత విజృంభించిన శైలేంద్ర!


మర్నాడు కాలేజీలో కూర్చున్న రిషి..విశ్వనాథం మాటలు గుర్తుచేసుకుంటాడు. రిషి సార్ కనిపించడం లేదేంటని వసు వెతుకుతుంది
వసు:  సార్ అంతా వెళ్లిపోతున్నారు..మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటీ సార్ ఇంటికి వెళ్లరా
రిషి: ఏం నేను మనశ్శాంతిగా ఉండటం మీకు ఇష్టం లేదా? ఎందుకొచ్చారు?
వసు: మీతో మాట్లాడాలి సార్
రిషి:  నేను కూడాచాలా మాట్లాడాలి. కానీ మాట్లాడుతున్నానా లేదు కదా..ఇప్పుడు మీరు నాతో మాట్లాడాల్సిందేం లేదు.. ఇక మీరు వెళ్లొచ్చు మేడమ్’ వసు: ఒక్కసారి నేను చెప్పేది వినండి.. విశ్వనాధం గారు మా ఇంటికి వచ్చారు
రిషి: తెలుసు మేడమ్ ..ఆయన మీ ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసు. ఆ విషయం గురించి నాతో కూడా మాట్లాడారు.  నేను ఏంజెల్‌ని పెళ్లి చేసుకోవాలని ఆయన చాలా బలంగా కోరుకుంటున్నారు. నేను ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి మేడమ్. ఏంటి నాకు ఈ చిత్రవధ. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను ఏంజెల్‌కి తగను అని మీరు చెప్పలేరా
వసు: మీరు అడిగారని ఆ ప్రయత్నం చేశాను సార్ కానీ ఫలితం మీరు చూశారు కదా
వసు: ఏ హక్కుతో చెప్పాలి సార్? చెప్పండి సార్.. అయినా మీరే చెప్పెయ్యలేకపోయారా? ఎందుకు చెప్పలేదు.. వాళ్లు మిమ్మల్ని కాపాడారనే కృతజ్ఞతతో చెప్పకుండా ఆగిపోయారో లేక మీ గతం వల్ల ఆగిపోయారో అన్నది వాళ్లకు ఎలా తెలుస్తుంది సార్. మీరు ఇలా మౌనంగా ఉండటమే వాళ్ల ఆశలకు ఆస్కారం అవుతుంది సార్. మీరే ధైర్యం చేసి సూటిగా విశ్వనాధం గారికే చెప్పెయ్యండి
రిషి: నేను అదే అనుకుంటున్నాను మేడమ్.. నాకు ఇష్టం లేనది తనతో చెప్పేస్తాను
వసు: బెస్ట్ ఆఫ్ లక్ సార్ అంటుంది.
రిషి: ఏంటి మేడమ్ మీ ఉద్దేశం.. నేను నిజం బయటపెట్టాలనా? లేక అదే పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడమనా?’
వసు: ఒంటరి జీవితం వద్దు అంటున్నాను సార్.. నిజానికి మీ భార్య స్థానంలో నేను ఉండాలి. కానీ..’ అంటూ వసు ఏదో చెప్పబోతుంటే.. ‘వసుధారా..’ అంటూ పైకి లేస్తాడు రిషి. ‘ఏంటి సార్ కోపం వచ్చిందా.? అయినా నేను చెప్పాల్సింది చెబుతాను... మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. అందుకే మీ పక్కన ఒక తోడు ఉండాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఇలా ఒంటరిగా చూడలేకపోతున్నాను సార్
రిషి మౌనంగానే వింటూ ఉంటాడు. ‘మీరు వాళ్లకి గతంలో ఉన్న ప్రేమ గురించి చెప్పి తప్పించుకుంటారో లేదంటే ఆ ఏంజెల్‌ని పెళ్లి చేసుకుంటారో అది మీ ఇష్టం’ అంటుంది వసు. వెంటనే రిషి.. వసుని కొట్టడానికి అన్నట్లు చేయి పైకి లేపుతాడు వసుధార అంటూ అరుస్తూ. వసు అలా నిలబడి చూస్తూ ఉంటుంది. వెంటనే తన చేతిని కిందకు దించి.. సారీ మేడమ్.. ప్లీజ్ మేడమ్ ఇక్కడి నుంచి వెళ్లిపోండి అనేస్తాడు రిషి. 
వసు వెళ్లిపోతుంది. రిషి అక్కడే కూర్చుండిపోతాడు.


Also Read: నిజం తెలుసుకోండి సార్ అంటూ వసు ఆవేదన, చెలరేగిపోతున్న శైలేంద్ర!


రిషి-విశ్వనాథం
రాత్రి అయ్యేసరికి రిషి విశ్వనాధంతో మాట్లాడటానికి వస్తాడు. ‘రా రిషి.. కూర్చో.. నేనే పిలుద్దాం అనుకుంటున్నా నిన్ను.. ముహూర్తాలు పెట్టించడానికి పంతుల్ని రమ్మని చెప్పనా రేపు’ అంటాడు విశ్వం. వెంటనే రిషి.. విశ్వం టాబ్లెట్ బాక్స్ అందుకుని అందులోంచి ఓ టాబ్లెట్ తీసి.. ఇది వేసుకోండి సార్ అంటూ ఇస్తాడు. ఎందుకు రిషి.. ఈ పూట వేసుకోవాల్సినవన్నీ ఏంజెల్ ఆల్‌రెడీ ఇచ్చేసింది. నేను వేసుకున్నాను అంటాడు విశ్వం. ‘ఫర్లేదు సార్.. మీకివి ఇప్పుడు అవసరం అందుకే ఇస్తున్నాను వేసుకోండి’ అంటూ ఇస్తాడు. వేసుకుంటాడు విశ్వం.
విశ్వనాథం: హూ ఇప్పుడు చెప్పు పంతుల్ని పిలిచించమంటావా? ఏంజెల్‌ని పెళ్లి చేసుకోవడానికి నీకు ఏ అభ్యంతరం లేదు కదా?’ అంటాడు విశ్వం. రిషి: సార్ మీరు ఏంజెల్‌కి ఒక తోడు ఉండాలి అనుకోవడం సరైన నిర్ణయమే.. నేను ఏంజెల్‌కి సరైన వాడినని అనుకోవడంలో అర్థముంది సార్ అంటూ రిషి పైకి లేచి అటు తిరిగి మాట్లాడుతూ ఉంటాడు.నేను మీ మనసుని నొప్పించాలి అనుకోవడం లేదు సార్.. ఎందుకంటే మీరు నా ప్రాణం కాపాడారు.. అంతే కాకుండా ఇంట్లో మనిషిగా ఇంట్లోనే పెట్టుకున్నారు’ అంటూ రిషి మాట్లాడుతూనే ఉంటాడు విశ్వానికి టాబ్లెట్ వల్ల మత్తులోకి వెళ్లిపోతాడు. అప్పుడు చెబుతాడు రిషి.. ‘సార్ నాకు ఏంజెల్‌ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు సార్.. నేను మీ మనిషిగా ఉండాలి అనుకుంటున్నాను. మీ ఇంటి అల్లుడుగా ఉండలేను సార్.. నాకు ఏంజెల్ మంచి ఫ్రెండ్.. నాకు తన మీద మరో భావం ఉండదు. రాదు కూడా. మీ మాట కాదు అంటున్నందుకు క్షమించండి సార్.. దయచేసి ఈ కార్యక్రమాలు ఆపెయ్యండి సార్’ అంటూ వెనక్కి తిరిగి చూస్తే విశ్వం నిద్రపోయి ఉంటాడు. సార్ నిద్రపోయారు నేను ఇంత వరకూ చెప్పింది ఏం వినలేదా? నేను ఏం చెయ్యాలి’ అనుకుంటూ దుప్పటి కప్పి తన గదిలోకి వెళ్లిపోతాడు. 


మర్నాడు ఉధయాన్నే రిషి నిద్రలేచి వచ్చి విశ్వం దగ్గర కూర్చుంటాడు. ఏంజెల్ కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. 
విశ్వం: అవును రిషీ.. రాత్రి నువ్వు ఏదో మాట్లాడుతుంటే నిద్రపోయాను. ఏంటంది. నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి చెప్పు.
ఏంజెల్: మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు
విశ్వం: నువ్వు ఆగమ్మా.. చెబుతాను
రిషి: సార్ నాకు మీరంటే చాలా అభిమానం.. ఒక కాలేజ్ వ్యవస్థాపకులుగా నేను మిమ్మల్ని గౌరవిస్తాను. నా ప్రాణాలను కాపాడి మీ ఇంట్లో చోటు ఇచ్చినందుకు.. కాలేజ్ లెక్చరర్‌గా జాయిన్ చేయించి మళ్లీ నాకు దారి చూపించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. అందుకే నేను మిమ్మల్ని బాధపెట్టదలుచుకోలేదు. కానీ..’ అంటూ రిషి పూర్తిగా చెప్పకుండానే.. ‘హ..హ.. నాకు తెలుసు రిషీ.. థాంక్స్.. ఇప్పుడు నా మనసు కుదుట పడింది అంటాడు విశ్వం.
ఏంజెల్: విశ్వం అసలు ఇక్కడ ఏం జరుగుతోంది
రిషి మాట్లాడుకుండా అయోమయంగా అలా చూస్తూనే ఉంటాడు. ‘అమ్మా ఏంజెల్ నువ్వు చెప్పకపోయినా నాకు తెలిసిపోయిందమ్మా’ అంటాడు నవ్వుతూ ఏంజెల్‌తో. ‘ఏం తెలిసిపోయింది?’ అంటుంది ఏంజెల్. ‘నీ మనసులో ఎవరున్నారో నేను తెలుసుకున్నాను..’  నిన్ను పెళ్లి చేసుకోమని రిషిని అడిగేశాను. ఇదిగో ఇప్పుడు నీ కళ్లముందు ఒప్పుకున్నాడు కదా? అంటాడు విశ్వం.
ఏంజెల్: చాలా థాంక్స్ రిషీ.. నన్ను చాలా టెన్షన్ పెట్టి చివరికి ఒప్పుకున్నావ్ అంటూనే.. ‘విశ్వం.. నువ్వు కోరుకున్నట్లే ఇప్పుడు నీ మనవరాలి పెళ్లి అయిపోతుంది.
సార్‌కి నేను ఈ పెళ్లి చేసుకోను అని చెప్పెయ్యాలి అనుకుంటాడు రిషి. ఎక్కువ ఆనందం పడడంతో విశ్వానికి కాస్త గుండె నొప్పిగా అనిపించి హా.. అంటూ అరుస్తాడు. రిషి, ఏంజెల్ కంగారు పడతారు. ఇప్పుడు నిజం చెప్పడం సరికాదు అనుకుంటూ రిషి మౌనంగా ఉండిపోతాడు. ఏంజెల్ లోపలికి వెళ్లగానే.. నేను బయటికి వెళ్లొస్తాను అని రిషి వెళ్లిపోతాడు. ఏం జరుగుతుందో మరి...
ఎపిసోడ్ ముగిసింది..