బిగ్ బాస్ ఇంట్లో ఫేస్ ది బీస్ట్ అంటూ మొదటి టాస్క్ ఇచ్చారు. సీరియస్ గా సాగాల్సిన ఈ టాస్క్ మొత్తం ఫన్నీగా సాగింది. ఇంట్లోకి వచ్చిన బాడీ బిల్డర్స్ తో కలిసి హౌస్ మేట్స్ ఫన్ క్రియేట్ చేస్తూనే తాము ఏంటో నిరూపించుకున్నారు. ఇక బిగ్ బాస్ ఇంట్లో నాలుగో రోజు టెన్షన్ వాతావరణం నెలకొంది. శివాజీ కాఫీ పంపించలేదని సీరియస్ అయిపోయాడు. తలుపులు తీస్తే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని గొడవ చేశాడు. శివాజీ ప్రవర్తనకి అందరూ షాక్ అయ్యారు. తనకి సర్ది చెప్పడానికి చూశారు కానీ ఎవరి మాట వినిపించుకోలేదు.
కాఫీ రచ్చ.. ఇంట్లో నుంచి వెళ్లిపోతానన్న శివాజీ
ప్రోమోలో ఏముందంటే.. రతిక పాటలు పాడుతుంటే బిగ్ బాస్ వారించాడు. మీరు బిగ్ బాస్ కి కాకుండా సింగింగ్ షోకి వచ్చినట్టు అనిపిస్తుందా? అంటూ చురక వేశాడు. కాఫీ పొడి పంపించేదాకా ఇలానే పాటలు పాడుతూ ఉంటానని రతిక పెద్దయ్యకి తేల్చి చెప్పేసింది. టేస్టీ తేజ తన మైక్ కాకుండా వేరే వాళ్ళ మైక్ వేసుకుని తిరుగుతున్నాడని బిగ్ బాస్ గాలి తీసేస్తాడు. ఈసారి ముందుగా చెప్పినట్టు ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ ఇంట్లో ఫర్నిచర్, సరుకులు ఏమి లేకుండానే కంటెస్టెంట్స్ ని పంపించారు. వచ్చిన మొదటి రోజు నుంచి శివాజీ కాఫీ కోసం అల్లాడిపోతున్నాడు. నాలుగో రోజు శివాజీ సహనం నశించి చిరాకుగా కిచెన్ లోకి వెళ్ళి కాఫీ పంపించవయ్యా అంటూ బిగ్ బాస్ మీద అరిచాడు. కాఫీ లగ్జరీ బడ్జెట్ కదా అని షకీలా అంటోంది. శివాజీ ఇంట్లో ఉన్న వస్తువులు విసిరేస్తూ ఇంకొక గంట చూస్తాను బొక్క కూడా భయపడను ఎవరికీ అని సీరియస్ అయిపోయాడు.
బిగ్ బాస్ ఇంట్లోకి బీపీ చెక్ చేసే మిషన్ పంపిస్తాడు. శివాజీ బీపీ చెక్ అప్ డేట్ ఇవ్వమని గౌతమ్ కృష్ణకి చెప్పాడు. కానీ శివాజీ మాత్రం "ఏం చూస్తావ్ నువ్వు పెట్టు అక్కడ.. నువ్వు చూసుకో నీకే ఎక్కువైందని" చిరాకుపడ్డాడు. తనని రెచ్చగొడితే అన్ని పగలగొట్టేసి వెళ్లిపోతానని చిందులేశాడు. తలుపు తీయ్యి ఒక్క నిమిషం ఉంటే అప్పుడు అడగమని అరుస్తాడు. ఆ తర్వాత స్టెతస్కోప్ పంపించి రతికని ప్రతి ఒక్కరి దగ్గరకి వెళ్ళి వాళ్ళ గుండె ఏం చెప్తుందో చెప్పమని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. అప్పుడు కూడా శివాజీ ఫైర్ అయిపోతాడు. స్టెతస్కోప్ శివాజీ లాగేసుకుని నేను ఇక్కడ బాధపడుతుంటే ఆయనకి కామెడీగా ఉందా అంటూ కోప్పడతాడు. అందరినీ చూడు కానీ శివాజీని వదిలేసి పిచ్చోడిని చేద్దామని చెప్తున్నాడా అని రతిక మీద సీరియస్ అయ్యాడు. "ఓ సామి తలుపు తీయి" నేను పోతా అంటూ శివాజీ రచ్చ రచ్చ చేశాడు.
Also Read: పులిహోర మొదలెట్టేసిన రతిక, ప్రశాంత్- బిగ్ బాస్ ఇంట్లో మొదటి టాస్క్ 'ఫేస్ ది బీస్ట్'