బిగ్ బాస్ సీజన్ 7లో లాంచ్ రోజు నుండే టాస్కులు మొదలయ్యాయి. ఫర్నీచర్ లేకుండా కంటెస్టెంట్స్‌ను బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపించి మొదటి రోజే ఫర్నీచర్ కోసం టాస్క్ చేయించారు బిగ్ బాస్. అది ఒక శాంపుల్ టాస్క్‌గా కంటెస్టెంట్స్‌కు గుర్తుండిపోయింది. ఇక దాని గురించి పక్కన పెడితే.. బిగ్ బాస్ సీజన్ 7లో అసలైన మొదటి టాస్క్ మొదలయ్యింది. అది కూడా కంటెస్టెంట్స్ ఎవరైతే.. ఈ టాస్క్ విన్ అవుతారో వారికి అయిదు వారాల పాటు ఇమ్యూనిటీ లభిస్తుందని బిగ్ బాస్ తెలిపారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఎంతో ఉత్సాహంగా టాస్క్‌లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. కానీ అది కుస్తీ పోటీ అనే తెలిసేసరికి కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. 


ఫన్నీగా గడిచిన సీరియస్ టాస్క్..
బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి టాస్క్ ‘ఫేస్ ది బీస్ట్’ అనే కంటెస్టెంట్స్ అంతా బాడీ బిల్డర్స్‌తో పోటీపడే టాస్కే అయినా దానితో చాలా ఫన్ క్రియేట్ అయ్యింది. అమ్మాయిలంతా అసలు ఈ కుస్తీ పోటీలు ఎలా అని భయపడ్డారు. ముఖ్యంగా కిరణ్ రాథోడ్ అయితే టాస్క్ కోసం రింగ్‌లోకి ఎంటర్ అయ్యేముందు ఫన్నీగా ప్రిపేర్ అవుతూ అందరినీ నవ్వించింది. రతిక అయితే రింగ్‌లోకి వెళ్లిన కాసేపట్లోనే ఔట్ అయ్యి తిరిగొచ్చింది. ఈ టాస్క్‌లో అందరికంటే తక్కువ సమయం రింగ్‌లో ఉన్న కంటెస్టెంట్ శివాజీ. వెళ్లిన కాసేపట్లోనే ఆ బాడీ బిల్డర్ వెనక్కి తోయగా.. శివాజీ రింగ్ బయటపడ్డాడు. బాడీ బిల్డర్ లాగా బిల్డప్ ఇచ్చిన గౌతమ్ కృష్ణ సైతం రింగ్‌లో ఎక్కువసేపు ఉండలేకపోయాడు.


టేస్టీ తేజ వల్ల హౌజ్ అంతా నవ్వులే నవ్వులు..
గౌతమ్ కృష్ణ దగ్గర నుండి కుస్తీ కోసం టిప్స్ తీసుకున్న శుభశ్రీ కాస్త కుస్తీ పడడానికి ప్రయత్నించినా.. ఎక్కువసేపు రింగ్‌లో ఉండలేదు. అందరి కుస్తీలను చూస్తూ కూర్చున్న షకీలా.. భయంతో అసలు రింగ్‌లోకే వెళ్లనని ఏడ్చింది. బిగ్ బాస్ అయిదు లీటర్ల నూనె తెప్పించండి ఒళ్లంతా పూసుకుంటాను. అప్పుడు ఓడిపోను అంటూ సరదా కామెంట్స్ చేసింది. ఆపై రింగ్‌లోకి వెళ్లే ముందు కూడా కాసేపు ఫన్ క్రియేట్ చేసింది షకీలా. షకీలా తర్వాత ఆ రేంజ్‌లో నవ్వులు పూయించిన కంటెస్టెంట్ తేజ. ఈరోజు టాస్క్‌లో టేస్టీ తేజ చేసిన కామెడీకి కంటెస్టెంట్స్ అంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. రింగ్‌లోకి వెళ్లకుండా కాసేపు మారాం చేసిన తేజ.. వెళ్లిన తర్వాత పర్వాలేదనిపించుకున్నాడు. టైమింగ్ లిస్ట్‌లో మూడో స్థానాన్ని సంపాదించుకున్నాడు.


అయిదు సెకండ్ల తేడాతో ఓటమి..
బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం.. ‘ఫేస్ ది బీస్ట్’లో రింగ్‌లో ఎక్కువసేపు ఉన్న ఒక అబ్బాయి, ఒక అమ్మాయి.. ఫైనల్ రౌండ్‌కు క్వాలిఫై అవుతారని, అక్కడ వారిద్దరికీ పోటీ ఉంటుందని చెప్పారు. అయితే టాస్క్ పూర్తయ్యే సమయానికి అబ్బాయిల్లో టాప్ స్థానంలో ఆట సందీప్, అమ్మాయిల్లో టాప్ స్థానంలో ప్రియాంక జైన్ ఉన్నారు. ఆట సందీప్ తరువాతి స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నారు. ఇద్దరికీ కేవలం అయిదు సెకండ్ల తేడా మాత్రమే ఉంది. ఇది చూసిన పల్లవి ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బయట కూడా కన్నీళ్లు పెట్టుకొని బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్.. హౌజ్‌లో కూడా అలాగే ఉంటున్నాడంటూ కొందరు నెటిజన్లు మళ్లీ ట్రోల్స్ మొదలుపెట్టారు. ఏడుస్తున్న పల్లవి ప్రశాంత్‌ను కంట్రోల్ చేయడానికి కంటెస్టెంట్స్ ఎంతో ప్రయత్నించినా.. అతడు మాట వినడానికి సిద్ధంగా లేడు. పల్లవి ప్రశాంత్ కావాలనే తన మీద సింపథీ తెచ్చుకోవడానికి, ఇతర కంటెస్టెంట్స్‌పై ప్రేక్షకుల్లో నెగిటివిటినీ క్రియేట్ చేయడానికి ఇలా చేస్తున్నాడని అనుదీప్ విమర్శించాడు.


‘ఫేస్ ది బీస్ట్’ టాస్క్‌లో కంటెస్టెంట్స్ టైమింగ్స్ ఇలా ఉన్నాయి


ఆట సందీప్ - 1.49 నిమిషాలు
పల్లవి ప్రశాంత్ - 1.44 నిమిషాలు
టేస్టీ తేజ - 1.4 నిమిషాలు
ప్రియాంక జైన్ - 1.7 నిమిషాలు
శోభా శెట్టి - 57.3 సెకండ్లు
దామిని - 42.3 సెకండ్లు
ప్రిన్స్ - 39.9 సెకండ్లు
షకీలా - 37.1 సెకండ్లు
కిరణ్ రాథోడ్ - 34.2 సెకండ్లు
అనుదీప్ - 18.7 సెకండ్లు
శుభశ్రీ - 15.8 సెకండ్లు
రతిక - 15.8 సెకండ్లు
గౌతం - 15.4 సెకండ్లు
శివాజి - 13.5 సెకండ్లు


Also Read: టేస్టీ తేజాకు షకీలా ముద్దు, అమ్మాయిలు లిప్ లాక్‌తో లిప్ స్టిక్ వేయాలట!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial