ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ సీజన్ 7 ఉత్సాహంగా మొదలైంది. ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియతో ఇంట్లో వాతావరణాన్ని హీటెక్కించారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి బిగ్ బాస్ మొదటి టాస్క్ ఇచ్చారు. కండలు తిరిగిన ఇద్దరు బాడీ రెజ్లర్లని ఇంట్లోకి పంపించి వారితో కుస్తీ పోటీ పట్టించారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని సినిమా ముందుంది అంటూ హింట్ కూడా ఇచ్చారు. ఇక ప్రతి సీజన్ లో మాదిరిగానే ఈ సీజన్ లో కూడా పులిహోర బ్యాచ్ రెడీ అయిపోయింది. రతిక, ప్రశాంత్ తో పులిహోర కబుర్లు పెట్టేసింది. మనోడు కూడా తక్కువేమీ కాదని నిరూపించుకున్నాడు.


పులిహోర రాణి..


ప్రిన్స్ యావర్ దగ్గర ప్రశాంత్ కూర్చుని మాట్లాడుతూ ఉండగా రతిక వస్తుంది. ఇక్కడ దిల్ ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటే ఎవరికి ఇస్తావని రతిక అడిగింది. దీంతో మనోడు సిగ్గుపడిపోతూ మెలికలు తిరుగుతాడు. సేమ్ క్వశ్చన్ ప్రశాంత్ రతికని అడిగాడు. ‘ఇంకెవరికీ నీకే’ అంటూ అమ్మడు బదులిచ్చేసరికి తెగ సిగ్గుపడిపోతాడు. శారీరకంగా మానసికంగా తమని తాము ప్రేక్షకులకు నిరూపించుకుంటూ చివరికి విజేతగా నిలిచిన వారిని ఐదు వారాల పాటు ఇమ్యూనిటీ పవర్ లభిస్తుందని బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. ఇక పులిహోర రాణి తను తోపు అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది.


Also Read: బిగ్ బాస్ సీజన్ 7 మొదటి నామినేషన్స్‌లో ఉన్నది వీరే! మీ ఓటు ఎవరికి?


అందరూ పాజిటివ్ గా ఉండండి బిగ్ బాస్ మనకి ఇమ్యూనిటీ టాస్క్ ఇస్తున్నాదు మనమే రివర్స్ లో టాస్క్ ఇవ్వాలని అంటుంది. వెంటనే అయిపోయిందా అంటూ రతిక గాలి తీసేశాడు బిగ్ బాస్. అప్పుడు టీవీలో ఇద్దరు బాడీ బిల్డర్స్ ని చూపించేసరికి అందరూ షాక్ అవుతారు. బిగ్ బాస్ ఇస్తున్న మొదటి టాస్క్ ‘ఫేస్ ది బీస్ట్’. ఇద్దరు బాడీ బిల్డర్స్ బిగ్ బాస్ ఇంట్లోకి వస్తారు. వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళు నోరెళ్ళబెట్టేస్తారు. తను కావాలంటే మేల్ బాడీ బిల్డర్ తో ఫైట్ చేస్తాను కానీ ఫిమేల్ బాడీ బిల్డర్ తో ఫైట్ చేయలేనని షకీలా తేల్చి చెప్పేసింది. వాళ్ళని చూసి కిరణ్ రాథోడ్ తెగ ఎగ్జైట్ అయ్యేసరికి బిగ్ బాస్ ముందుగా వారితో కుస్తీ పట్టేందుకు తననే వెళ్ళమని ఆదేశిస్తాడు. ఇక ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి వాళ్ళతో కుస్తీకి దిగుతారు.


అందరి ముందు బిల్డప్ కొట్టే మన శివన్న కుస్తీ పట్టే వాళ్ళకి మాత్రం దండాలు దస్కాలు పెడుతూ కనిపించాడు. ఆట సందీప్ తో పాటు మిగతా వాళ్ళు కూడా పోటాపోటీగా తలపడ్డారు. కాసేపటికి ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని అసలైన ఆట ముందుందని చెప్పేసరికి అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి.