Brahmamudi September 8th ( బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబరు 08 ఎపిసోడ్)


సీతారామయ్య ఆరోగ్యం గురించి రాజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇలా బాధపడితే చిట్టి తట్టుకోలేదని పెద్దాయన మనవడికి ధైర్యం చెప్తాడు.


సీతారామయ్య: ఒక మాట అడుగుతాను నిజం చెప్పు. నువ్వు కావ్యతో ప్రవర్తిస్తున్న తీరు అనుమానం కలిగిస్తోంది. మనసులో లేనిది నాకోసం బలవంతంగా చేస్తున్నావని అనిపిస్తుంది. నిజంగా నువ్వు మారడానికి చేస్తున్న ప్రయత్నమా లేదంటే నన్ను సంతోషంగా ఉంచడానికి చూస్తున్నావా? నిజమైన ప్రేమ పైకి ఎవరూ ప్రదర్శించలేరు. నీది కృత్రిమంగా కనిపిస్తుంది. అబద్ధాలతో కాపురం చేయొద్దు. నిజం తెలిసిన రోజు కావ్య కళ్ళలో కనిపించే ప్రశ్నలు తట్టుకునే శక్తి నీకు ఉండదు


రాజ్: ముందు ఇబ్బంది పడిన మాట వాస్తవమే. తనని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నా. కావ్యతో సంతోషంగా కాపురం చేస్తాను


సీతారామయ్య: ఆ క్షణాలు ఈ మూడు నెలలోపు వస్తాయని అనుకుంటున్నా


Also Read: దివ్యకి సవతి పోరు - తులసిని ఓదార్చేందుకు నందు ప్రయత్నాలు


తాతయ్యని అనుమానం వచ్చింది ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు. కనకం టెన్షన్ గా ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణమూర్తి ఇంటికి వచ్చి ఎవరికి ఫోన్ చేస్తుందని అప్పుని అడుగుతాడు. స్వప్నకి చేస్తున్నానని చెప్తుంది. కడుపులో బిడ్డని పెట్టుకుని హనీ మూన్ కి వెళ్ళింది కదా కాస్త గడ్డి పెడదామని తిడుతుంది.


సీతారామయ్య పచ్చడితో భోజనం చేయబోతుంటే రాజ్ కంగారుగా వద్దని అంటాడు. అదేంటి కొత్తగా మాట్లాడుతున్నావ్ అది తాతయ్య అలవాటు కదా అని ఇంద్రాదేవి అడుగుతుంది. కారం ఎక్కువ తింటే బీపీ ఎక్కువ అవుతుందని శుభాష్ సర్ది చెప్తాడు. సీతారామయ్య కూడా రాజ్ చెప్పిన మాటకి అంగీకరిస్తాడు. అందరి ముందు రాజ్ కావాలని కావ్యని కూడా భోజనానికి కూర్చోమని అంటాడు. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు.


కావ్య: నేను వడ్డిస్తాను మీరు తినండి


రాజ్: వడ్డించుకోవాల్సినవి ఏమైనా కిలోమీటరు దూరంలో ఉన్నాయా? ఇక్కడే ఉన్నాయి కదా


సీతారామయ్య: మనవడు చెప్పిన మాట విను కూర్చో


కావ్య కూడా రాజ్ పక్కన కూర్చుని తింటుంది. అపర్ణకి కాలిపోతుంటే రుద్రాణి నెయ్యి వేస్తూ మరింత ఆజ్యం పోస్తుంది. రాజ్ కావాలని అతి ప్రేమ చూపిస్తూ ఉంటాడు. తనే కావ్యకి వడ్డిస్తాడు. అందరూ బిత్తరపోతారు. నీభర్త ప్రేమగా వడ్డిస్తున్నాడు తినమని ధాన్యలక్ష్మి అంటుంది. కళావతిని ప్రేమగా చూసుకుంటున్నట్టు తాతయ్యకి అర్థం అయితే చాలని అనుకున్నా కానీ పిన్నికి దొరికిపోతున్నానని రాజ్ మనసులో తిట్టుకుంటాడు. తింటుంటే కావ్యకి పొలమారుతుంది. వెంటనే రాజ్ కంగారుగా తల నిమిరి వాటర్ తాగిస్తాడు. తర్వాత కావ్య తినేసి వెళ్తుంటే తన చీర కొంగు రాజ్ వాచ్ లో చిక్కుకుంటుంది. అపర్ణ తప్ప అది చూసి అందరూ నవ్వుకుంటారు. రుద్రాణి అపర్ణని చూస్తూ వెటకారంగా నవ్వుతుంది.


Also Read: మురారీ తన భర్తని చెప్పకనే చెప్పిన ముకుంద- భవానీ మాటలకు షాకైన శ్రీనివాసరావు


అనామిక కళ్యాణ్ ఫోటో చూసి మురుసుకుంటూ ఉండగా తండ్రి సుబ్రమణ్యం వస్తాడు. అబ్బాయి డైరెక్ట్ గా కూడా బాగున్నాడని అంటాడు. ఆలస్యం చేయకుండా కళ్యాణ్ కి ప్రేమ విషయం త్వరగా చెప్పేయమని సలహా ఇస్తాడు. రాజ్ గదిలో కూర్చుని పరువు మొత్తం పోయిందని వాచ్ ని పట్టుకుని తిట్టుకుంటాడు. మమ్మీ ఇక నేను కావ్య కొంగు చాటు మొగుడిగా మారిపోయానని తిట్టుకుని ఉంటుందని అనుకుంటాడు. శత్రువు చీర కొంగు పట్టుకున్నందుకు వాచ్ ని చెడా మడా తిట్టేస్తాడు. కావ్య గదికి వెళ్తుంటే ఇంద్రాదేవి మల్లెపూలు తీసుకొచ్చి తన తలలో పెట్టుకోమని అంటుంది. ధాన్యలక్ష్మి పాల గ్లాసు తీసుకొచ్చి ఇస్తుంది. శోభనపు పెళ్లి కూతురిలాగా సిగ్గుపడుతూ ఉన్న కావ్యని చూసి రాజ్ ఖంగుతింటాడు. పాలు తీసుకొచ్చి తాగమని వయ్యారాలు పోతూ ఉంటే రాజ్ గుండెల్లో దడ మొదలైపోతుంది. పాల మీద కావ్య కాసేపు పాఠం చెప్తుంది. ఎప్పుడు పూలు వాడిపోతాయి? ఎప్పుడు పాలు సగపాలు అవుతాయని రొమాంటిక్ గా మాట్లాడేసరికి రాజ్ దణ్ణం పెట్టేస్తాడు.


తరువాయి భాగంలో..


కావ్య కన్నయ్యకి పూజ చేస్తూ ఉంటే కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉంటారు. అప్పుడే రాజ్ ఒక బాక్స్ తీసుకుని వస్తాడు. ఏంటి అది అని అపర్ణ అడుగుతుంది. నెక్లెస్ అని అంటే ఎవరికి అంటుంది. కళావతికి అని చెప్పి తన మెడలో వేస్తూ ఉంటే కావ్య ఎమోషనల్ గా చూస్తుంది.