తులసిని ఇంప్రెస్ చేయడం కోసం నందు వంట చేసి దగ్గరుండి మరీ వడ్డిస్తాడు. అది తిన్న తులసి ఆహా ఓహో సూపర్ అంటూ పొగుడుతుంది. వాళ్ళు తినేసి వెళ్ళిన తర్వాత నందు తాను వండిన ఫుడ్ తినలేక తిప్పలు పడతాడు. ఇంత ఘోరంగా ఉంటే లొట్టలేసుకుని తిన్నారు ఏంటని ఆలోచిస్తాడు. సామ్రాట్ బాబాయ్ టెన్షన్ గా ఆలోచిస్తూ ఉండగా రత్నప్రభ వస్తుంది.


రత్నప్రభ: కారు డ్రైవర్ ని పిలిచి తులసితో మాట్లాడరా లేదా అని అడుగుతుంది. మాట్లాడాడు అనేసరికి పెద్దాయన మీద నోరు పారేసుకుంటుంది.


ధనుంజయ్: తులసితో మాట్లాడటానికి వీల్లేదని చెప్పినా వినకపోతే ఎలా


రత్నప్రభ: పెద్దాయన కావాలని మొండితనం చేస్తున్నారు. మన సహనాన్ని పరీక్షిస్తున్నారు. హనీ వెళ్తుంటే తులసి కనిపించింది, ఆపితే తాను బాధపడుతుంది మౌనంగా ఉన్నట్టు పెద్దాయన చెప్తాడు. కానీ రత్నప్రభ ఒప్పుకోదు. తులసిని దూరంగా ఉంచితే లాక్ గురించి తెలిసేది ఎలా అని ధనుంజయ్ అంటాడు. వంట బాగోలేదని చెప్తే ఏమౌవుతుందని నందు తులసిని అడుగుతాడు. మీరు మాకోసం ఆపేక్షగా వంట చేస్తే గుర్తించకపోతే ఎలా అని అంటుంది. ఇన్ డైరెక్ట్ గా నందు తన ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎన్ని చెప్పినా కూడ తులసి మాత్రం ఫ్రెండ్ అనే గీత దాటను అనేస్తుంది.


Also Read: అదిరిందయ్యా మురారీ- ఓ వైపు ప్రియురాలితో డాన్స్, పెళ్ళాంతో ప్రేమ కబుర్లు


జాహ్నవి చేయి కట్ చేసుకుని రక్తపు మడుగులో పడి ఉండటం బసవయ్య చూస్తాడు. వెంటనే కంగారుగా ఇంట్లో అందరినీ పిలుస్తాడు. జానూని చూసి అందరూ షాక్ అవుతారు. దివ్య తనకి ట్రీట్మెంట్ ఇస్తుంది. ఫోర్స్ ఫుల్ గా చేయి కట్ చేసుకుంది నరాలు లోపలికి తెగలేదు. పెద్దగా ప్రమాదం ఏమి లేదని దివ్య చెప్తుంది. జానూని పంపించేద్దామని బసవయ్య దంపతులు అంటారు. కాసేపటికి జానూ స్పృహలోకి వస్తుంది. విక్రమ్ తనని పట్టుకోవాలని చూస్తుంటే ముట్టుకోవద్దని చెప్తుంది.


జానూ: నా గురించి ఎవరూ టెన్షన్ పడాల్సిన పని లేదు


విక్రమ్: ఎందుకు అంత ఫీల్ అవుతున్నావ్. చేయి కట్ చేసుకునేంత కష్టం ఏమొచ్చింది


జానూ: అంత నీ వల్లే. ఈ ఇంట్లో ఎవరికీ అడ్డం కాకూడదని వెళ్లిపోతుంటే నువ్వే ఆపావు. నాతో ఎప్పటిలాగా ఉంటానని చెప్పి ఉండటం లేదు. నాకు వంట రాకపోయినా నీకోసం నేర్చుకుని ప్రేమగా వడ్డించి తీసుకొస్తే తినేశానని కసిరి పంపించావ్. బావకి నా మీద ప్రేమ లేదనే మాట నేను తట్టుకోలేను


విక్రమ్: సోరి జానూ. ఆఅ టైమ్ లో మూడ్ బాగోలేక విసుక్కున్నా ఇంకెప్పుడు అలా చేయనని తనకి మాట ఇస్తాడు. అది చూసి దివ్య కోపం వస్తుంది. తులసికి కొరియర్ వస్తే అది నందు తీసుకుంటాడు. బాక్స్ లో ఏమున్నాయని అడుగుతాడు. బొమ్మలు ఉన్నాయని హనీకి ఇవ్వడం కోసం తీసుకున్నానని చెప్తుంది. తన బొమ్మలు పాతగా అయిపోయాయని కొత్త బొమ్మలు కొనివ్వమని అడిగింది. పాపం అనిపించి కొన్నాను అంటుంది. అంతగా కొనివ్వాలనుకుంటే వాళ్ళ ఇంటికే డెలివరీ పెట్టవచ్చు కదా అంటాడు. తన చేతులతో ఇవ్వడానికి తీసుకున్నానని చెప్తుంది. ఆఅ మాటకి నందు మొహం మాడిపోతుంది. ఎన్ని చెప్పినా కూడ తులసి మాత్రం హనీకి దూరంగా ఉండలేనని తేల్చి చెప్పేస్తుంది.


సామ్రాట్ బాబాయ్ హనీని స్కూల్ కి టైమ్ అవుతుందని పిలుస్తుంటే రత్నప్రభ వాళ్ళు వస్తారు. ఈరోజు నుంచి హనీ స్కూల్ కి వెళ్ళడానికి వీల్లేదు. తను కనీసం గేటు దాటి బయటకి వెళ్ళడానికి కూడ వీల్లేదు. ఇది మా ఆర్డర్


పెద్దాయన: ఇది చాలా అన్యాయం. మీరు తప్పు చేస్తున్నారు


Also Read: శైలేంద్ర క్రూరత్వం- రిషి మీద అటాక్, ప్రాణాపాయ స్థితిలో జగతి


రత్నప్రభ: తులసికి దూరంగా ఉంచితే బుద్ధిగా ఉండేది కానీ మీరు మాట వినలేదు. నమ్మకం పోగొట్టుకున్నారు. తులసి మా శత్రువు అనుకున్నాం కానీ తనని మించిన శత్రువు మీరు


పెద్దాయన: దాని భవిష్యత్ నాశనం చేయవద్దు. చదువు లేకపోతే దాని బతుకు ఏమౌవుతుంది


రత్నప్రభ: దానికి ఇంటి పని వంట పని నేర్పిస్తాను. మీరు ఓవర్ యాక్షన్ చేయవద్దు


అప్పుడే హనీ వచ్చి స్కూల్ కి వెళ్దామని అంటుంది. కానీ పెద్దాయన కదలకుండా ఉంటాడు. దారిలో తులసి ఆంటీ కనిపించే టైమ్ అయిపోయిందని అంటుంది. ఈరోజు నుంచి స్కూల్ కి వెళ్ళడం, తులసి ఆంటీని కలవడం బంద్ అని ధనుంజయ్ పుస్తకాలు కాల్చేస్తాడు.