ముకుంద ప్లాన్ వల్ల కృష్ణ చేతిలో ఉన్న ప్రసాదం నేలపాలు అవుతుంది. దీంతో కృష్ణ చాలా బాధపడుతూ ఉంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే తన దగ్గర ఉన్న ప్రసాదం తినమని, ఆదర్శ్ ఎటు లేడు కదా తిన్నా ప్రయోజనం ఏమి లేదని ముకుంద అంటుంది.
కృష్ణ: నీకు మనస్పూర్తిగా ఇవ్వాలని అనిపిస్తే ఇవ్వు
ముకుంద: నేను ఇష్టంతో ఇస్తున్నా. నువ్వు నాకోసం ఎంతో చేస్తున్నావ్ నీకోసం ఈ మాత్రం కూడా చేయలేనా అనేసి ప్రసాదం ఇస్తుంది. దాన్ని తీసుకుని కృష్ణ మురారీకి తినిపిస్తుంది. మురారీ తిన్నతర్వాత తన చేతిలో ఉన్న ప్రసాదాన్ని ముకుంద తింటుంది. అది చూసి కృష్ణ బాధపడుతుంది. నిన్ను నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను, గుర్తు పెట్టుకుంటాను వడ్డీతో సహా ఇచ్చేస్తానని కృష్ణ మనసులో అనుకుంటుంది.
ఇంట్లో భర్తల దినోత్సవం సందర్భంగా సన్మాన కార్యక్రమం మొదలవుతుంది. కృష్ణ మురారీ మెడలో దండ వేసి సన్మానం చేస్తుంది.
Also Read: శైలేంద్ర క్రూరత్వం- రిషి మీద అటాక్, ప్రాణాపాయ స్థితిలో జగతి
కృష్ణ: నేను ఒక విషయంలో చాలా అదృష్టవంతురాలిని. ఏసీపీ సర్ పేరుకే పెద్ద ఆఫీసర్ కానీ ఆయనది చిన్న పిల్ల మనస్తత్వం. అందుకే నేను ఆయన్ని ఏబీసీడీల అబ్బాయి అని పిలుస్తాను. ఆయనకి ప్రేమతో పాటు బుద్ధులు కూడా నేర్పించే అదృష్టం నాకు దొరికింది. ప్రాణ స్నేహితుడు ఆదర్శ్ కోసం పోలీస్ ఆఫీసర్ అయ్యారు. ఆయన కోసం నేనొక ప్రామిస్ చేస్తున్నానని మురారీ చేతిలో చేయి వేస్తుంది. మీకోక ప్రామిస్ చేస్తున్నా. మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోను. ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని వదలను
అది చూసి రేవతి చాలా సంతోషంగా చప్పట్లు కొడుతుంది. మురారీ కోసం కృష్ణ పాట పాడి తన ప్రేమని వ్యక్తపరుస్తుంది. తర్వాత ముకుంద మాట్లాడుతుంది.
ముకుంద: ఆదర్శ్ కి ఈ ప్రపంచంలో అందరి కంటే ఇష్టమైన వ్యక్తి మురారీ. ఆదర్శ్ కి ఇష్టమైన సినిమా మురారీ. ఆదర్శ్ పోలీస్ఆఫీసర్ అవ్వాలని అనుకుని మురారీ కోసం ఆర్మీకి వెళ్ళాడు. తన కోసం ఆదర్శ్ ఎలాంటి త్యాగం చేయడానికి అయినా వెనుకాడడు. అంత ఇష్టం మురారీ అంటే.. ఆదర్శ్ కి. ఆదర్శ్, మురారీ ఒకే ఆత్మ రెండు వేర్వేరు శరీరాలు. ఆదర్శ్ గురించి ఒక ప్రామిస్ తీసుకున్నా. ఆదర్శ్ ని తీసుకొచ్చాక మురారీకి ఒక ప్రామిస్ చేసి ఆఅ తర్వాత మీ అందరికీ చెప్తాను అంటుంది. ఒక ఆదర్శ్ కోసం తాను డాన్స్ చేస్తానని చెప్పి “ఒక్కసారి చెప్పలేవా..” అనే పాటకి మురారీతో కలిసి డాన్స్ చేసినట్టు ఊహించుకుంటుంది.
Also Read: రాజ్ ని ఆకాశానికెత్తేసిన కావ్య- స్వప్న మర్డర్ కి రాహుల్ స్కెచ్, రగిలిపోతున్న రుద్రాణి
అలేఖ్య మధుకర్ పరువు తీసే విధంగా మాట్లాడుతుంది. భారత గురించి చెప్పమంటే నగలు, షాపింగ్ గురించి చెప్పి విసుగు తెప్పిస్తుంది. సన్మానం తర్వాత పెద్ద టాస్క్ ఉందని అంటుంది. జల్లెడలో నిండు చంద్రుడిని చూసి భర్త మొహం చూస్తే ఏడేడు జన్మలకి తనే భర్తగా వస్తాడని నమ్మకం అని కృష్ణ అంటుంది. ఇక అందరూ ఆరు బయటకి వెళతారు. మొదటగా కృష్ణ చంద్రుడిని చూసి జల్లెడలో మురారీని చూస్తుంది. అది చూసి ముకుంద బాధపడుతుంది. ముకుంద కోసం మధుకర్ ఆదర్శ్ ఫోటో పట్టుకుని వస్తాడు. దాన్ని పట్టుకుని నిలబడమని కృష్ణ అంటే ఆదర్శ్ స్నేహితుడు మురారీ కదా తాను పట్టుకుంటేనే బాగుంటుందని అంటుంది. దీంతో మురారీ ఆదర్శ్ ఫోటో పట్టుకుని నిలబడతాడు. కానీ ముకుంద మాత్రం ఫోటో వైపు కాకుండా మురారీ వైపు చూస్తుంది. కృష్ణకి అది మరింత కోపం వస్తుంది. అసలు ముకుంద ఆదర్శ్ ఫోటో చూస్తుందా మురారీని చూస్తుందా అని తన వెనుకకి వచ్చి గమనిస్తుంది.