Gruhalakshmi Serial September 1st Episode : తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు తోడుదొంగలు రాజ్యలక్ష్మి, లాస్య తెగ సంబరపడుతూ ఉంటారు. లాస్య ఇంటికి వస్తుందని పరంధామయ్య వాళ్ళు కాశీకి వెళ్తామని అంటారు. తనతో వేగలేమని ఓపిక కూడా లేదని అనసూయ బాధపడుతుంది. నందు వచ్చి ఇక ఆ ఇష్యూ గురించి మాట్లాడొద్దని చెప్తాడు. మిమ్మల్ని లాస్యకి వదిలిపెట్టి చేతులు ముడుచుకుని కూర్చుంటామా? మన జీవితాలు లాస్యకి తాకట్టు పెట్టడం లేదని తులసి అంటుండగా లాస్య ఎంట్రీ ఇస్తుంది. అత్తయ్య నేను వచ్చేశాను అంటుంది.


అనసూయ: నోట్లో గుడ్డలు కుక్కుతా ఇంకోసారి అత్తయ్య అంటే నువ్వు ఇప్పుడు ఆ లక్కీగాడికి తల్లివి మాత్రమే


లాస్య: ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం ముందు నాకు హారతి ఇవ్వండి. కారులో లగేజ్ ఉంది లోపల పెట్టండి


అనసూయ: ఎక్కువ మాట్లాడితే అట్ల కాడ కాల్చి వాత పెడతా నోరు మూసుకుని లోపలికి రా


Also Read: కృష్ణతో మురారీ రొమాంటిక్ మూమెంట్స్, కుళ్లుకుంటున్న ముకుంద!


లాస్య: సరేలే ఇప్పుడు మీకు బీపీ పెంచడం ఎందుకు. నా లగేజ్ మాత్రం మీ అబ్బాయిని లోపల పెట్టమని చెప్పండి. నువ్వు రమ్మంటేనే కదా తులసి నేను వచ్చింది అలా అరిస్తే ఎలా


తులసి: నువ్వు ఏడిస్తే రమ్మన్నా


నందు మన గదికి వెళ్దాం పద అంటుంది. కట్టుకున్న పెళ్ళాం మాదిరిగా వాడితో వెళ్తానని అంటావ్ ఏంటని అనసూయ తిడుతుంది. లాస్య గదిలోకి వెళ్లబోతుంటే నందు చెయ్యి అడ్డం పెట్టి ఆపుతాడు. లక్కీ బ్యాగ్ తగిలించుకుని కిందకి దిగుతాడు.


లాస్య: ఈ అమ్మ కోసం నీ గది ఖాళీ చేస్తున్నావా?


లక్కీ: కాదు ఇల్లు ఖాళీ చేస్తున్నాం. నువ్వు చచ్చిపోవాలని అనుకుంది నాకోసమే కదా. పద వెళ్ళి మనం కలిసి ఉందాం


లాస్య: ఎక్కడ


లక్కీ: మన ఇంట్లో అని షాకిస్తాడు


లాస్య: మరి మీ డాడీ.. నేను వచ్చి మీ డాడీని దూరం చేశానని నన్ను తిడతారు. మళ్ళీ నీకు జ్వరం వస్తుంది అందరూ నన్నే అంటారు


లక్కీ: మమ్మీని వదిలేసి డాడీ దగ్గర ఉండిపోయాడని నన్ను తిట్టుకుంటారు అలాంటి చెడ్డపేరు నాకు వద్దు. ఇప్పటికే ఇక్కడ అందరినీ డిస్ట్రబ్ చేశాం ఇక చాలు బయల్దేరదాం


Also Read: 'హ్యాపీ' ఎండింగ్.. వేద కడుపు పండింది- అభిమన్యు మీద పగ తీర్చుకున్న నీలాంబరి


లక్కీ నందుతో మాట్లాడింది గుర్తు చేసుకుంటాడు. నేను ఇక్కడికి వచ్చి అందరినీ ఇబ్బంది పెడుతున్నా. కానీ ఈ డాడీ కోసం వచ్చాను. అందరిలా నాకు డాడీ కావాలని అనిపిస్తుంది. నాకు డాడీ ఉన్నాడని గట్టిగా అరిచి చెప్పాలని అనిపిస్తుంది. మమ్మీ నన్ను పట్టించుకోదు. పట్టించుకోవడానికి డాడీ లేడు అనుకోగానే ఏడుపు వస్తుంది. నాకు ఎందుకు డాడీని ఇవ్వలేదు. మమ్మీ అని ఎవరినైనా పిలవొచ్చు కానీ డాడీ అని ఎవరినీ పిలవలేము. డాడీ అని ఎవరినైనా పిలవాలని అంటే నాకు ఉంది మీరే. అందుకే మిమ్మల్ని వదిలి పెట్టడం లేదు. ఎన్ని సార్లు కొప్పడ్డా నన్ను ఒక్కసారి ప్రేమగా హగ్ చేసుకుంటారు నాకు అది చాలు డాడీ. అందుకే మొండిగా ఇక్కడ ఉన్నా కానీ మమ్మీ వల్ల మీరు బాధపడకూడదు. నేను వెళ్లిపోతాను డాడీ లేకుండా ఉండటం అలవాటు చేసుకుంటాను. నా దృష్టిలో డాడీ లేడని అనుకుంటాను అనేసరికి నందు వాడిని ప్రేమగా దగ్గరకి తీసుకుంటాడు.


Also Read: 'హ్యాపీ' ఎండింగ్.. వేద కడుపు పండింది- అభిమన్యు మీద పగ తీర్చుకున్న నీలాంబరి


నందు: ఇంకెప్పుడు అలా అనుకోకు. నీకు ఈ డాడీ ఉన్నాడు. నన్ను డాడీ అని పిలవొచ్చు. ఈ డాడీ నీకు అవసరమైన చోట అండగా నిలబడతాడు. నీకు ప్రేమని అందిస్తాను


లక్కీ: నేను మమ్మీ దగ్గరకి వెళ్ళినా వస్తారా?


నందు: నీకోసం ఇంటికి వస్తాను. నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ఇక్కడికి రావొచ్చు


లక్కీ: ఐ లవ్యూ డాడీ. నేను రేపు మమ్మీతో పాటు ఇంటికి వెళ్లిపోతాను మీరంతా హ్యాపీగా ఉండండి


లాస్య షాక్ అయి చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది వీళ్ళు నాతో ఆడుకుంటున్నారా? అని మనసులో అనుకుంటుంది. లాస్య కోపంగా లక్కీని లాక్కుని వెళ్ళిపోతుంది. లాస్య లక్కీని టార్చర్ పెడుతుందోని తులసి బాధపడుతుంది. టార్చర్ పెడితే ఈ డాడీ ఊరుకోడని నందు చెప్తాడు. రాజ్యలక్ష్మి మంచి హుషారుగా తమ్ముడిని పిలుస్తుంది. తన మనసు సంతోషంతో పొంగిపోతుందని, త్వరలోనే దివ్య పీడ విరగడ కాబోతుందని చెప్పుకుని మురిసిపోతుంది. లాస్య తులసి ఇంట్లో మంట పెట్టిందని దివ్య త్వరలోనే పారిపోతుందని అనేసరికి బసవయ్య గాలి తీస్తాడు.


బసవయ్య: ఆవిడ చెప్పే చందమామ కథలు చెప్పి నోట్లో వేలు వేసుకున్న దానిలా నమ్ముతావ్


రాజ్యలక్ష్మి: లాస్య తన కొడుకుని తులసి ఇంట్లో దింపింది. ఈరోజు తను కూడా ఆ ఇంట్లో దిగబడింది అని చెప్తూ ఉండగా.. అప్పుడే లక్కీని తీసుకుని లాస్య వస్తుంది.


బసవయ్య: అవును దిగబడింది కొడుకుతో సహా ఈ ఇంట్లో దిగబడింది


రాజ్యలక్ష్మి: చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి? తులసి ఇల్లు తగలబెడతానని చెప్పి ఇక్కడికి వచ్చావ్ ఏంటి?


మధ్యలో బసవయ్య సెటైర్స్ వేస్తాడు. వాళ్ళు లాస్యని తిడుతుంటే రాజ్యలక్ష్మి కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది.


తరువాయి భాగంలో..


నిన్ను నమ్ముకుని ఇప్పటికే చాలా ఆలస్యం చేశానని రాజ్యలక్ష్మి సీరియస్ అవుతుంది. దీంతో లాస్య కోపంగా రాజ్యలక్ష్మి అని అరుస్తుంది. రాజ్యలక్ష్మి గారు.. నువ్వు ఏమైనా నా చుట్టానివా నీ కొడుకుని తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అని వార్నింగ్ ఇస్తుంది.