Gruhalakshmi Today అక్టోబర్ 31ఎపిసోడ్:  కిడ్నాపర్లు పంపిన వీడియోలో స్కూల్‌ కనిపిస్తుంది. ఆ స్కూల్‌ను తాను ఎక్కడో చూసినట్లు గుర్తు చేసుకుంటుంది తులసి. వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు స్కూటీ తీసుకుని వెళ్తుంది తులసి.


కారులో దివ్య కోసం వెతుకున్న విక్రమ్‌ పోలీస్‌ కు ఫోన్‌ చేసి తాను ఇంతకు ముందు కారు నెంబర్‌ చెప్పానని ఆ కారును ట్రేస్‌ చేశారా అని అడుగుతాడు. కారు రిజిస్టర్‌ నెంబర్‌ కు ఉన్న అడ్రస్‌ దొరికిందని ఇప్పుడే మీకు పంపిస్తానని చెప్తాడు పోలీస్‌. అడ్రస్‌ తీసుకుని బయలుదేరుతాడు విక్రమ్‌.


 దివ్యను ఎక్కడ దాచిపెట్టామో తులసి కనిపెడుతుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తుంది లాస్య ప్రెండ్‌. తులసికి అంత సీన్‌ లేదని లాస్య అంటుంది. అయితే కిడ్నాప్‌ అయి దివ్య ప్రమాదంలో ఉందని తెలిసి కూడా తులసి హనిని అప్పగించడం లేదంటే తాను కచ్చితంగా ఏదో ప్లాన్‌ చేస్తుందని.. తులసి ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే నందుకు ఫోన్‌ చేయాలని సూచిస్తుంది లాస్య ప్రెండ్‌. గుడ్‌ ఐడియా అని లాస్య నందుకు ఫోన్‌ చేస్తుంది.


నందు : నీకు వంద సార్లు చెప్పాను హని కోసం నాకు ఫోన్‌ చేసి వేస్టని..తులసితోనే మాట్లాడుకో..


లాస్య : అంటే ఏంటి దివ్య ప్రాణాలు కూడా తులసి చేతిలోనే పెట్టావా..? నువ్వెక్కడ తగిలావురా బాబు ఉత్తి ఆకారమేనా..ఖలేజా లేదా..? ఉన్నచోట కూర్చుని అరవడం కాదు. రోషం ఉంటే హనిని అప్పగించి దివ్యను కాపాడు. చావు బతుకుల మధ్య ఉంది దివ్య


నందు : లాస్య దివ్యకు ఏమైనా అయితే మాత్రం నిన్ను వదిలిపెట్టను..


లాస్య: అయితే వెంటనే హనిని అప్పగించు దివ్యను వదిలేస్తాను.


అని ఫోన్‌ పెట్టేస్తుంది. నందు ఆలోచనలో పడిపోతాడు. హని తమ దగ్గరకు రాగానే ఎవ్వరికీ తెలియకుండా దాచేయాలని లాస్య తన ప్రెండ్‌కు చెప్తుంది. అయితే  నందు మన మాట విని హనిని అప్పగిస్తాడా? అని అనుమానం వ్యక్తం చేస్తుంది.   


Also Read: స్వప్న సీమంతం రుద్రాణి ఆపుతుందా - అపర్ణకి షాక్ ఇచ్చిన రాజ్!


విక్రమ్‌ కారు పక్కకు ఆపి మనకు పోలీస్‌ వాళ్లు ఇచ్చిన లోకేషన్‌ ఇక్కడే.. నువ్వు ఇక్కడే ఉండే నేను వెతుకుతాను. అంటూ వెతుక్కూంటూ వెళ్తాడు విక్రమ్‌. తులసి కూడా ఒక దగ్గర ఆగి వీడియో చూసిన స్కూల్‌ ఇక్కడే అనుకుంటా..  అని స్కూల్‌ను వెతుకుతుంది.  విక్రమ్‌ ఒక ఇంటిలోకి వెళ్లి కిడ్నాపర్లు వాడిన కారును చూస్తాడు. ఇంట్లో వాళ్లను పిలిచి ఈ కారు అతనితో పనుందని డబ్బులు బాగా ఇస్తానని చెప్పడంతో అతను ఈ పక్కన ఓ స్కూలుందని స్కూలు పక్కనే పాడుబడిన ఇంట్లో ఉంటాడని చెప్తారు. దీంతో విక్రమ్ అక్కడి నుంచి స్కూల్‌ వైపు వెళ్తాడు. నందు కోపంగా హనిని తీసుకుని లాస్యకు అప్పగించడానికి వెళ్తుంటే..


హని : ఎక్కడికి అంకుల్.. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు.


నందు : మా ఇంట్లో చిచ్చు పెట్టి నా కూతురు జీవితం ప్రమాదంలో పెట్టి నువ్వు మాత్రం బొమ్మలతో ఆడుకుంటున్నావా?


నందు నాన్న : ఓరేయ్‌ సమస్య ఉంటే మనం చూసుకుందా.. అంతే కానీ చిన్నపిల్లను బాధపెట్టకు.. అమ్మ నువ్వు లోపలికి వెళ్లు.


అనసూయ : ఓరేయ్‌ నందు హనిని ఎక్కడికి పంపించొద్దని జాగ్రత్తగా చూసుకోమని తులసి చెప్పిందిరా..


నందు : తులసి మాట శాసనమా..? దివ్య కిడ్నాప్‌ అయ్యింది. హనిని అప్పగిస్తే దివ్యను వదిలిపెడతామంటున్నారు. తులసి పట్టనట్లు వదిలేసింది. తులసి ఏమైందో తెలియదు.. ఏం చేస్తుందో తెలియదు. కాల్‌ చేస్తే లిప్ట్‌ చేయడం లేదు. ఇంకోపక్క వాళ్ల బెదిరింపులు


హని ఏడుస్తూ ప్లీజ్‌ అంకుల్‌ నన్ను వాళ్లకు అప్పగించొద్దు. కావాలిస్తే నన్ను రోడ్డు మీద వదిలేయండి అని నందు కాళ్ల మీద పడుతుంది. అనసూయ హనిని లోపలికి పంపిస్తుంది. నందు బాధగా చూస్తుండిపోతాడు.


తులసి కిడ్నాపర్లు ఉన్న ఇంటి దగ్గరకు వెళ్తుంది. లోపల కిడ్నాపర్లను చూసి దివ్య ఇక్కడే ఉంటుందనుకుని లోపలికి వెళ్తుంటే కిడ్నాపర్లు తులసి మీద దాడి చేయడానికి వస్తారు. వెంటనే విక్రమ్‌ వచ్చి కిడ్నాపర్లను చితకబాది దివ్యను రక్షిస్తాడు. నీరసంగా ఉన్న దివ్యను హాస్పిటల్‌కు తీసుకెెళతారు.


నందు ఆలోచిస్తూ.. నేను కూడా తులసి లాగా మారిపోతున్నానా..? ఓ వైపు దివ్య ప్రమాదంలో ఉంటే నేనిలా ఉండిపోయానేం అనుకుంటూ హని దగ్గరకు వెళ్తాడు నందు.


Also Read: అక్టోబర్ 31 ఎపిసోడ్: అల్లరి ప్రియుడిగా మారిన ఈగో మాస్టర్ - తల్లీకొడుకులకు వణికించిన ధరణి


నందు : కోపంగా ఉందా?


హని : భయంగా ఉంది.


నందు : భయపడకు నేను నీ ఫ్రెండును కదా.. ఈ అంకుల్‌ అప్పుడప్పుడు పిచ్చి పడుతుంది. పిచ్చోడిలా బిహేవ్‌ చేస్తుంటాడు.


అని హనితో మాట్లాడుతూ ఉండగానే ఈరోజు ఏపిసోడ్‌ పూర్తి అవుతుంది.