బ్రహ్మముడి అక్టోబరు 31 ఎపిసోడ్
స్వప్నకు కడుపు లేదని డాక్టర్ శ్రీదేవి చెప్పే వరకు ఓపికగా ఉండాలని రుద్రాణి తన కొడుకు రాహుల్ చెప్పడంతో ఇవాళ్టి ఏపిసోడ్ మొదలవుతుంది.
రాహుల్ : ఏంటి మమ్మీ కళ్లముందు అది కడుపుతో తిరుగుతుంటే.. కడుపు లేదంటావేంటి నువ్వు?
రుద్రాణి : సినిమాల్లో హీరోయిన్స్ కడుపు వచ్చినట్లు యాక్ట్ చేస్తారు. వాళ్లకు నిజంగా కడుపు వచ్చినట్లా?
రాహుల్ : నాకు నమ్మబుద్ది కావడం లేదు మమ్మీ.. ఇంత పెద్ద అబద్దాన్ని స్వప్న అసలు దాచలేదు. దానికి అంత సీన్ లేదు.
రుద్రాణి : అని మనం అనుకుంటున్నాం కనుకే అందర్నీ మోసం చేయగలిగింది. ఈజీగా నమ్మించింది.
రాహుల్ : అ కడుపును అడ్డుపెట్టుకునే నన్ను పెళ్లి చేసుకుంది. ఈ ఇంట్లో అడుగు పెట్టింది. ఇప్పుడది సీమంతానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో వాళ్లకు ఏం చెబితే నమ్ముతారు. అది మనం చెబితే అసలు నమ్మరు.
రుద్రాణి : అందుకే కదా ప్రూప్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. స్వప్న రిపోర్ట్ అన్ని డాక్టర్ శ్రీదేవికి పెట్టాను. అది ఫేక్ అని చెప్పిందో దీని కథ అయిపోయినట్లే..
అని ఇద్దరూ కలిసి రిపోర్ట్స్ వచ్చాక స్వప్పను ఇంట్లోంచి గెంటి వేయాలని ప్లాన్ చేస్తారు.
Also Read: అక్టోబర్ 31 ఎపిసోడ్: అల్లరి ప్రియుడిగా మారిన ఈగో మాస్టర్ - తల్లీకొడుకులకు వణికించిన ధరణి
రాజ్, కాశ్య పంక్షన్‌కు రెడీ కావడానికి ఒకరికొకరు పోటీ పడుతుంటారు. కావ్య లోపలికి వెళ్లి రెడీ అయి వస్తుంది. కాశ్యను చూసిన రాజ్ మెస్మరైజింగ్ గా కావ్యను చూస్తుండి పోతాడు.
కావ్య : ఏంటి అలా చూస్తున్నారు.
రాజ్ : ఏం లేదు..
కావ్య : మీది చాలా ఖరీదైన ఫోన్ కదా నన్ను ఒక్క పోటో తీయండి.
రాజ్ : ఫోటో ఎందుకు ఫోనే తీసుకో..
కావ్య : నాకు ఫోన్ తో పెద్దగా పని ఉండదు. కానీ ఇప్పడు ఫోటో మాత్రం తీయండి.
రాజ్ : నైస్
కావ్య : ఏది నాకు చూపించండి..
రాజ్ : చూడు ... ఎలా ఉంది.?
కావ్య : చాలా బాగా తీశారు.
రాజ్ : కెమెరా కూడా అద్దం లాంటిదే అవతలి వాళ్లు ఎలా ఉన్నారో అలాగే చూపిస్తుంది. నేను వెళ్లి రెడీ కావోచ్చా..?
రాజ్ లోపలికి వెళ్లి రెండు డ్రెస్సుల్లో ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కాక తికమక పడుతుంటాడు. బయట కావ్య కూడా రాజ్ ఏ డ్రెస్ వేసుకుంటాడోనని ఆలోచిస్తుంది.
పైనుంచి బంధువులందరూ స్వప్నను రెడీ చేసి కిందకు తీసుకువస్తుంటారు. అందరూ సంతోషంగా చూస్తుంటారు. రాహుల్, రుద్రాణి టెన్షన్ పడుతుంటారు.
రాహుల్ : మమ్మీ జరిగేది జరుగుతూనే ఉండాలా..? స్వప్న నాటకానికి మనం ముగింపు చెప్పలేమా..?
రుద్రాణి : ఒక్క ఫోన్ కాల్ కోసం చూస్తున్నానురా.. అది గాని వచ్చిందంటే అప్పుడు మొదలు పెడతాను ఆట.. క్యారంబోర్డులో కాయిన్స్ ను చెల్లాచెదురు చేసినట్లు ఈ ఇంట్లో వాళ్లను అలాగే డిస్టర్బ్ చేస్తాను. చాలా స్టయిలిష్ పంచాయతీ మొదలవబోతుంది వెయిట్.
కావ్య ఇచ్చిన డ్రెస్ వేసుకుని రాజ్, కావ్యతో కలిసి కిందకు వస్తాడు. అది చూసిన రుద్రాణి ఇప్పుడు అసలు కథ మొదలైంది అనుకుంటూ.. ఇప్పడు మా వదిన రియక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అనుకుంటుంది. రాజ్ తాను ఇచ్చిన డ్రెస్ వేసుకోలేదని అపర్ణ షాకింగ్ గా చూస్తుంటుంది.
రుద్రాణి : చూడు వదిన బాగా చూడు.. నువ్వు తెచ్చిన డ్రెస్ పక్కన పెట్టి భార్య తెచ్చిన డ్రెస్ వేసుకున్నాడు. నీ కుమార రత్నం నీ చేతుల్లోంచి చేప జారిపోయి పెళ్లాం బుట్టలో పడిపోయాడు వదిన.
అనామిక: హలో కావ్య గారు మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు.
కావ్య : థ్యాంక్యూ అనామిక మీరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్
అనామిక : థాంక్యూ హలో సిగ్గు పడుతున్నావా.. ఇంక ఆపు సిగ్గు లేదు.. పడాల్సింది నేను
అందరూ కలిసి స్వప్నకు బోట్టు పెడుతూ.. సీమంతాన్ని గ్రాండ్ గా నిర్వహిస్తుంటే.. నాకు కడుపు లేదని ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఎలా..? అనుకుంటుంది.
రుద్రాణి : జరగని పెళ్లికి బ్యాండ్ బాజా ఎందుకనట్లు.. ఈ ఫేక్ ప్రెగ్నెసీ కి ఇంత హంగూ అర్భాటాలు చేస్తున్నార్రా.. ఈ అమాయకులు ఆశావాదులు.
రాహుల్ : ఆ డాక్టర్ ఇంకా ఫోన్ చేయలేదా..? మమ్మీ
రుద్రాణి : చేస్తుందిలేరా.. సీమంతం స్వప్నది అయినా.. ఈరోజు మాత్రం మనదేరా..
ఇంతలో రుద్రాణికి డాక్టర్ ఫోన్ చేసి స్వప్నకు కడుపు లేదని నిజం చెప్తుంది. తాను రిపోర్టు తీసుకుని వస్తున్నాని చెప్పడంతో రుద్రాణి.. రాహుల్ ను తీసుకుని సీమంతం పంక్షన్ నుంచి బయటకు వెళ్తుంది. స్వప్నకు కడుపు ఉందని ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చిన డాక్టర్ కు ఫోన్ చేసి బెదిరిస్తుంది రుద్రాణి దీంతో ఇవాళ్టి ఏపిసోడ్ ముగుస్తుంది.