Gruhalakshmi October 18th: అనసూయ వాళ్ళు భయపడుతుంటే సరిగా అప్పుడే రాములమ్మ కూడా ఇంటికి వస్తుంది. వెంటనే రౌడీలు లాస్యకి ఫోన్ చేసి మరొక ఆవిడ ఇంట్లోకి వచ్చిందని చెప్తారు. అవసరమైతే తనని కూడా వేసేయమని లాస్య అంటుంది. దొంగలు ఏ గదిలో ఉన్నారో వెతుకుదామని ముగ్గురు చీకట్లోనే తిరుగుతూ ఉంటారు. తులసి కంగారుగా ఉండటం చూసి నందు ఏమైందని మరోసారి అడుగుతాడు. సమస్య ఏమైన ఉంటే చెప్పు సలహా ఇస్తానని అంటాడు కానీ తులసి మాత్రం విషయం చెప్పకుండా దాటేస్తుంది. రాములమ్మ కర్ర తీసుకుని రౌడీల దగ్గరకి వెళ్లబోతుంటే ఒక వ్యక్తి వచ్చి పాలు అని అంటాడు. మరి కాసేపటికి కూరగాయలు తీసుకుని ఒకడు, గుడ్లు, సరుకులు అంటూ చాలా మంది వ్యక్తులు వస్తారు. ఈ టైమ్ లో అటాక్ చేస్తే దొరికిపోతామని రౌడీలు అనుకుని మెల్లగా ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. టైమ్ కి తులసి వచ్చి అనసూయ వాళ్ళని పిలుస్తుంది. తులసి రాగానే కరెంట్ కూడా వస్తుంది. వంటింట్లో ఎవరో దొంగలు ఉన్నారు చప్పుడు వస్తుందని రాములమ్మ చెప్పేసరికి తులసి కర్ర పట్టుకుని వెళ్తుంది.


కొరియర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి పంపించేస్తుంది. అంత అవసరం ఏమొచ్చిందని నందు అంటే వీటి వల్ల ప్రమాదం తప్పిందని అంటుంది. కానీ నందుకి మాత్రం అర్థం కాదు. అప్పుడే తులసికి లాస్య మళ్ళీ ఫోన్ చేస్తుంది.


Also Read: కీలక మలుపు- రంగంలోకి దిగిన ముకుంద అన్న, ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తానని చెల్లికి హామీ


లాస్య: రెండు ప్రాణాలు బాగా కాపాడుకున్నావ్ కంగ్రాట్స్. కానీ ఎంతవరకు ఇలాగా హనీని తీసుకొచ్చి మాకు అప్పగించు. లేదంటే ఇలాంటి గండాలు ఎదురవుతూనే ఉంటాయి. నాకు తిక్క పుడితే గుట్టు చప్పుడు కాకుండా లేపేస్తా


తులసి: కొద్దిగా అయినా మానవత్వంతో ఆలోచించు


లాస్య: ఏంటి వణుకు మొదలైందా నేనంటే ఏంటో తెలిసొచ్చిందా? నేను నిన్ను వెంటాడుతూనే ఉంటాను. హనీని తిరిగి అప్పగించే వరకు వదిలిపెట్టను


తులసి: ఎన్ని చేసిన నేను నీ మాట వినను. నా ప్రాణాలు అడ్డేసి అయినా నా వాళ్ళని కాపాడుకుంటాను హద్దు దాటితే నీ అంతు చూస్తా


రాజ్యలక్ష్మి, బసవయ్య వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా దివ్య వస్తుంది. జానూకి పెళ్లి ఈడు వచ్చిందని అంటుంది. పెళ్లి కొడుకుల ఫోటోలు తీసుకొచ్చి బసవయ్య చేతిలో పెడుతుంది.


ప్రసన్న: సంబంధం చూడమని నేను చెప్పానా?


దివ్య: జానూకి వాళ్ళ బావ అంటే ఎంత ఇష్టమో నాకు తనంటే అంత ఇష్టం. ఫోటోలు చూసి అబ్బాయి బాగున్నాడో లేదో చెప్తే మాట్లాడుకుందాం అనగానే జాహ్నవి వచ్చి వాటిని చింపి దివ్య మొహం మీద విసిరికొడుతుంది


జానూ: నాకు ఫోటో కాదు నచ్చనిది నీ పద్ధతి. ఎవరిని అడిగి ఈ సంబంధం తీసుకొచ్చావ్


విక్రమ్: సంబంధం తీసుకొచ్చింది దివ్య కాదు నేను


రాజ్యలక్ష్మి: దాని గురించి ఆలోచించడానికి నేను ఉన్నాను


Also Read: పోలీసులకి దొరికిపోయిన రాజ్, కావ్య- దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్కైన రాహుల్!


జానూ: నా మొగుడ్ని నేను డిసైడ్ చూసుకోగలను


విక్రమ్: తనని అలా వదిలిపెట్టొద్దు పెళ్లి విషయంలో నచ్చజెప్పండి


తులసి ఇంట్లో సీసీటీవీ కెమెరాలు పెట్టిస్తుంటే వాటి అవసరం ఏమొచ్చిందని నందు వాళ్ళు అడుగుతారు. అన్నీ రోజులు ఒకేలా ఉండవు కదా అంటుంది.


నందు: మార్పు పరిస్థితిలో కాదు నీలో కనిపిస్తుంది. ఎవరి వల్ల అయినా సమస్య ఉంటే చెప్పు


తులసి: భయమంటే భయపడటం మానేశాను


నందు: కానీ నీలో తెలియని మార్పు కనిపిస్తుంది