Krishna Mukunda Murari October 18th: పెద్దపల్లి ప్రభాకర్ భవానీ ఇంటికి వచ్చి కృష్ణ గురించి అడుగుతాడు. తనని మెడ పట్టుకుని ఇంట్లో నుంచి గెంటేశామని ముకుంద పొగరుగా సమాధానం ఇస్తుంది.
ప్రభాకర్: నా బిడ్డ అంత పెద్ద తప్పు ఏం చేసింది. అది ఏం తప్పు చేసిందో చెప్పండి
ముకుంద: ఈ ఇంట్లో మా మురారీకి భార్యగా నటిస్తూ మా ఇంటి డబ్బులతో చదువుకుని సకల సదుపాయాలు అనుభవిస్తూ మామీద పెత్తనం చెలాయిస్తుంటే పోనీలే అల్లరిది అనుకున్నా కానీ ఇంత చిల్లరది అనుకోలేదు
ప్రభాకర్: జర మంచిగా మాట్లాడు బిడ్డా
ముకుంద: నీకూతురిది మురారీది అగ్రిమెంట్ మ్యారేజ్. బయటకి భార్యాభర్తలుగా ఒప్పందం మీద నటించారు. ఆ విషయం నిన్న మాకు తెలిసింది
ప్రభాకర్: అసలు నీ ప్రవర్తన బాగోలేదు మొన్న వచ్చినప్పుడే చూశాను నీ సంగతి ఇక్కడ చెబితే బాగోదు. నా కూతురు తప్పు చేయదు. రేవతమ్మ నా బిడ్డకి అన్యాయం జరుగుతుంటే ఫోన్ కూడ చేయలేదు. నా బిడ్డ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. మురారీ ఎక్కడ తాను మీతో చేరిపోయాడా?ఆ విషయం గురించి మాట్లాడకుండా ఎందుకు ఉన్నాడు
Also Read: పోలీసులకి దొరికిపోయిన రాజ్, కావ్య- దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్కైన రాహుల్!
భవానీ: నీ బిడ్డ కంటే ముందే మురారీ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. జరిగిన దాని గురించి ఎక్కువగా మాట్లాడను అనేసి వెళ్లిపొమ్మని చెయ్యి చూపిస్తుంది
ప్రభాకర్ జరిగింది తలుచుకుని బాధగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. రేవతి ఎదురుపడి మాట్లాడుతుంది. జరిగిన విషయం మొత్తం ప్రభాకర్ కి రేవతి అర్థం అయ్యేలా చెప్తుంది.
రేవతి: వాళ్ళది జన్మజన్మల బంధం ఎవరూ విడదీయలేరని అంటుంది. కృష్ణ అంటే తనకి ప్రాణమని నా కొడుకు నాదగ్గర చెప్పుకున్నాడు. కృష్ణకి కూడా మురారీ అంటే పీకల్లోతు ప్రేమ. మురారీ చెప్పే వరకు తాను చెప్పాలని అనుకోలేదు. ఈరోజు నాకొడుకు తన మనసులో మాట కృష్ణకి తెలియజేశాడు. అది తెలిసి కృష్ణ వాడిని కలవడానికి వెళ్ళింది
ప్రభాకర్: ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వెంటనే వాళ్ళని కలిసి మాట్లాడాలి
రేవతి: వాళ్ళని ఎవరూ విడదీయలేరు
మురారీ, కృష్ణ కారులో వెళ్తూ ఉంటారు. మురారీ మౌనంగా ఉండటం చూసి ఏంటి అలా ఉన్నారని అడుగుతుంది.
కృష్ణ: ఇన్నాళ్ళూ మనం భార్యాభర్తలు అని అనుభూతిని అనుభవించింది వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు మీ పెళ్ళాంగా నేను మాట్లాడుతున్న శ్రీవారు. ఇన్నాళ్ల పాటు నా మనసులో ఉన్న విషయాలు అన్నీ బయట పెట్టేస్తున్నా.. ఐలవ్యూ అనగానే వెనుక నుంచి లారీ మురారీ కారుని ఢీ కొడుతుంది. ఇద్దరూ దెబ్బలతో కారులో నుంచి బయటకి పడిపోతారు. అప్పుడే వెనుక అంబులెన్స్ నుంచి విలన్ దిగుతాడు. మురారీ రాళ్ళ మధ్యలో రక్తపు మడుగులో పడి ఉంటాడు. అటు కృష్ణ కూడ కొండ రాయి మీద పడిపోయి ఉంటుంది. మురారీ వాళ్ళకి యాక్సిడెంట్ చేయించిన వ్యక్తి ముకుంద తండ్రి శ్రీనివాస్ దగ్గరకి వస్తాడు.
శ్రీనివాసరావు: అసలు నువ్వు ఎందుకు వచ్చావ్? జైలు నుంచి ఎప్పుడు వచ్చావ్? నువ్వు బతికున్నావ్ అనే విషయం మర్చిపోయాం . నీలాంటి వాడిని నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది
కొడుకు: ఈ ఇంటికి వచ్చింది మీకోసం కాదు నా చెల్లి కోసం. ఎక్కడ నా చెల్లి ఎలా ఉంది. నాకు తన సంతోషం తప్ప ఏమి ముఖ్యం కాదు
శ్రీనివాసరావు: నీకు తన గురించి అనవసరం. తన విషయంలో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తాను ఇప్పుడు బాగుంది చూసుకోవడానికి నేను ఉన్నాను
కొడుకు: సరే పోతాను అనేసి ఇంట్లోకి వెళ్ళి అన్నం తిని వెళ్తానని కూర్చుంటాడు
Also Read: శైలేంద్ర మాటలు వినేసి రివర్సైన రిషి, వసు సేవలో తరిస్తోన్న ఈగోమాస్టర్!
ముకుంద విషయం తెలియకపోవడమే మంచిదని శ్రీనివాస్ మనసులో భయపడతాడు. సరిగా అప్పుడే ముకుంద ఆవేశంగా ఇంటికి రావడం శ్రీనివాస్ చూసి గుమ్మం దగ్గర ఆపేస్తాడు.
ముకుంద: అక్కడ ఏదేదో జరుగుతుంది. నా జీవితం ఏమైపోతుందో భయం పట్టుకుంది అసలు నేను చచ్చిపోవాలో బతికి ఉండాలో అర్థం కావడం లేదు. మురారీ నన్ను దగ్గరకి తీసుకుంటాడని ఎదురు చూశాను కానీ అది జరగడం లేదు. ఇంకా ఇలా చస్తూ బతకడం నావల్ల కాదు. కృష్ణ, మురారీ ఒక్కటి అయ్యారని అనిపిస్తుంది. అక్కడ ఏదో జరుగుతుంది తట్టుకోవడం నావల్ల కావడం లేదు అనేసి ఇంట్లోకి చూడగానే తన అన్న కనిపిస్తాడు. బయటకి వచ్చి తండ్రిని లాగిపెట్టి కొడతాడు. అన్నని చూసి సంతోషంగా కౌగలించుకుంటుంది. ఏం జరిగిందని అడుగుతాడు. ముకుంద జరిగింది మొత్తం చెప్పేస్తుంది.
ముకుంద అన్న: ఇక ఈ అన్నయ్య వచ్చాడు ఏ ప్రాబ్లం లేదు సాయంత్రం లోగా నీకోక గుడ్ న్యూస్ చెప్తాను. నెల రోజులు తిరిగే లోపు నువ్వు ప్రేమించిన వాడితో నీ పెళ్లి చేస్తాను. నీకు కావలసింది నేను చేసి పెడతాను
ముకుంద: సరే తండ్రి మీద చెయ్యి చేసుకోవడం తప్పు కదా నాన్నకి సారీ చెప్పు