జాహ్నవికి వెంటనే మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని దివ్య విక్రమ్​కి చెప్తుంది. ఎంత చెప్పిన తులసి వినిపించుకోవడం లేదని ప్రమాదానికి ఎదురువెళ్తుందని నందు తల్లిదండ్రుల దగ్గర ఆందోళన పడతాడు. తన సంగతి తెలిసిందే కదా ఎన్ని చెప్పిన కూడ వినిపించుకోదని అంటారు. వద్దని చెప్పినా కూడా అక్కడికి వెళ్ళిందని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే తులసి ప్రశాంతంగా ఇంటికి వస్తుంది. అక్కడ ఏం జరిగిందో చెప్పమని పరంధామయ్య అడుగుతాడు. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉందామని చెప్పాను అందుకు సరే అన్నారు. హనీ కూడా మన దగ్గరే ఉంటుందని చెప్తే ఒప్పుకున్నారని చెప్తుంది. కానీ తులసి మాటలు మాత్రం నందు నమ్మడు. నిజం చెప్పమని అడుగుతాడు. అక్కడ ఉంది లాస్య తాను ఎంత మాత్రం తగ్గదు. ఒకవేళ తగ్గిందని అన్నా నేను నమ్మను. దెబ్బ కొట్టకుండా ఉండదని అనసూయ అనుమానపడుతుంది. కానీ పరంధామయ్య మాత్రం తులసిని వెనకేసుకొస్తాడు.


Also Read: ఊహించని ట్విస్ట్.. చావుబతుకుల్లో కృష్ణ, మురారీ.. ఎంట్రీ ఇచ్చిన కొత్త క్యారెక్టర్


విక్రమ్ దివ్యతో సంతోషంగా ఉండటం చూసి జానూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే రాజ్యలక్ష్మి వచ్చి నాటకం మొదలుపెడుతుంది.


రాజ్యలక్ష్మి: నీకు జరిగిన అవమానానికి కారణం నేనే నన్ను క్షమించు.


జానూ: తప్పు నాది మత్తులో ఉన్నాడు కదా బావ మాట వింటాడని అనుకున్నా. కానీ రూమ్ లో దివ్య ఫోన్ పెడుతుందని అసలు ఊహించలేదు అలా ఎవరైనా పెడతారా?


రాజ్యలక్ష్మి; తన బెడ్ రూమ్​లో ఫోన్ పెట్టిందంటే ఏ లెవల్​లో మీ బావ మీద నిఘా పెట్టిందో ఆలోచించు.


జానూ: ఎందుకు బావ మౌనంగా ఉంటున్నాడు?


రాజ్యలక్ష్మి: ఈరోజు జరిగిన దానితో విక్రమ్ దివ్యని మరింత నమ్ముతాడు. ఇంత అవమానం జరిగిన కూడ నువ్వు బావకి దూరం జరుగుతావు. ఇక చాలు ఇన్ని ఇబ్బందులు పడుతూ నువ్వు ఇక్కడ ఉండటం ఎందుకు? బావని మర్చిపో నీ దారి నువ్వు చూసుకో.


జానూ: నా దారి బావ వైపు.


రాజ్యలక్ష్మి: అనవసరంగా నీ జీవితం ప్రమాదంలో పడుతుంది.


జానూ: దివ్యది కన్నింగ్ మెంటాలిటీ. తనని ఎలాగైనా దూరం చేసి తన స్థానంలో నేను నిలబడతాను. బావ మనసులో దివ్య మీద ఉన్న ప్రేమని చంపేస్తాను అప్పుడు నా దారిలోకి వస్తాడు.


ఏం చేయబోతున్నామని రత్నప్రభ లాస్యని అడుగుతుంది. వీర లెవల్​లో తనని బెదిరించావ్ కానీ ఇప్పుడు సైలెంట్​గా ఉన్నావ్ ఏంటని అంటారు. హనీ తులసి దగ్గర ఉండిపోతే తమ చేతులు కట్టేసినట్టే అవుతుందని ఏమి చేయలేమని రత్నప్రభ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. తులసిని భయపెట్టే బాధ్యత తనదని లాస్య ధీమాగా చెప్తుంది.


లాస్య: తులసితో యుద్ధం అంటే మామూలు విషయం కాదు ఎగేసుకుని వెళ్తే ఎదురు దెబ్బలు తగులుతాయి. ఒక్కరోజుతో తను మాట వినదు నెమ్మదిగా భయాన్ని ఎక్కించాలి. స్ట్రాటజీ ఉపయోగించి దెబ్బకొట్టాలి. తులసిని ఎదుర్కోవడం కష్టం కానీ అది అసాధ్యం కాదు. కళ్ల ముందు కనిపించకుండానే పరుగులు పెట్టిస్తాను అని చెప్పి రౌడీకి ఫోన్ చేసి ఏదో మాట్లాడుతుంది


తులసి నడుస్తూ ఉండగా ఒక అమ్మాయి వచ్చి కావాలని డాష్ ఇస్తుంది. దీంతో తులసి బ్యాగ్ కిందపడిపోతే ఆ అమ్మాయి కావాలని ఆ బ్యాగ్ తీసి ఇస్తుంది. అప్పుడే లాస్య తులసికి ఫోన్ చేస్తుంది. ఎందుకు ఫోన్ చేసి విసిగిస్తావని తులసి అంటుంది.


లాస్య: నిన్ను విసిగించడమే నా పని. నీ మాజీ మొగుడితో కలిసి ఎంజాయ్ చేయడానికి బయటకి వచ్చావని నాకు తెలుసు. నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో నాకు తెలిసిపోతుంది.


తులసి: ఎందుకు ఫోన్ చేశావ్?


Also Read: కావ్యతో బైక్ మీద రాజ్ షికార్లు - కళ్యాణ్ పెళ్లి వార్తతో కన్నీళ్లు పెట్టుకున్న అప్పు


లాస్య: ఏం లేదు హ్యాండ్ బ్యాగ్​లో రివాల్వర్ పెట్టుకుని తిరగాల్సిన పని ఏమొచ్చింది నేనంటే భయమా. ఇప్పుడు నువ్వు సెక్యూరిటీ దగ్గరకి వెళ్తే రివాల్వర్ దొరికిపోతుంది. పోలీసులు పట్టుకుంటారు జైలుకి వెళ్లిపోతావు. హనీ నందు దగ్గర ఉండిపోతుంది. తనని గట్టిగా బెదిరిస్తే హనీని తిరిగి తీసుకొస్తాడు. నన్ను బెదిరించి ఏం సాధించావ్? జైలుకి వెళ్ళాక వచ్చి పలకరిస్తానులే అనేసి ఫోన్ పెట్టేస్తుంది.


తులసి బ్యాగ్ చూసుకుని కంగారుపడుతుంది. రెస్టారెంట్​కి వద్దని వేరే దానికి వెళ్దామని చెప్తుంది. కానీ హనీ మాత్రం కుదరదని లోపలికి వెళ్దామని అంటుంది. నందు, హనీ లోపలికి వెళతారు. సెక్యూరిటీ చెక్ చేసిన కూడా బ్యాగ్​లో రివాల్వర్ ఉన్నా.. సౌండ్ రాదు దీంతో ఊపిరి పీల్చుకుంటుంది. వెంటనే లాస్య మళ్ళీ ఫోన్ చేసి భయపడిపోయావా అది ఒరిజనల్ కాదు డూప్లికేట్ ఇందాక నిన్ను డాష్ కొట్టిన అమ్మాయి నీ బ్యాగ్​లో రివాల్వర్ పెట్టిందని చెప్తుంది. కాసేపటిలో ఇంకొక సర్ ప్రైజ్ రెడీ చేయబోతున్నా హనీని ఇంటికి పంపించు లేదంటే వదిలిపెట్టనని బెదిరిస్తుంది.