తులసి కోపంగా ఇంటికి వచ్చి లాస్య అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులకు ఇంట్లో అందరూ బయటకి వస్తారు. ఎందుకు అలా అరిచావ్ నాతో మాట్లాడాలంటే గదికి వచ్చి పిలువు ఇలా అరవొద్దని అంటుంది. రాజ్యలక్ష్మి హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళావని నిలదీస్తుంది. వెళ్తే తప్పేంటి వియ్యపురాలు హాస్పిటల్ ముందు నుంచి వెళ్తూ క్యాజువల్ గా పలకరించానని అంటుంది.


తులసి: క్యాజువల్ గా పలకరించినందుకు నోట్ల కట్టలు బ్రీఫ్ కేసులో పెట్టి వాయనంగా ఇచ్చిందా


లాస్య: నోట్ల కట్టలు ఏంటి ఏం మాట్లాడుతున్నావ్


తులసి: నందగోపాల్ గారు మీ ఆవిడ బాగా అమాయకంగా మాట్లాడుతుంది. ఇంట్లో బ్రీఫ్ కేసు వెతుకుదాం నేను చెప్పింది అబద్దమని తేలితే లాస్య కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తాను


Also Read: ముకుంద మీద ఫైర్ అయిన రేవతి- మంచం పట్టిన భవానీ, వైద్యం చేసిన కృష్ణ


నందు: డబ్బు ఎందుకు తీసుకున్నావని కొట్టేందుకు చెయ్యి ఎత్తుతాడు


లాస్య: నా వల్ల తప్పు జరిగింది దాని నుంచి బయట పడటం కోసం రాజ్యలక్ష్మి దగ్గర అప్పుగా తీసుకున్నా. మీ ఫ్రెండ్ బిజినెస్ కోసం ఇచ్చిన డబ్బు ఫ్రెండ్ దగ్గర ఇన్వెస్ట్ చేసి పోగొట్టాను. నీకు భయపడి ఆ విషయం చెప్పలేదు రేపు ఇంజినీర్ కి అడ్వాన్స్ ఇవ్వమని చెప్పావ్ కదా అందుకని రాజ్యలక్ష్మి దగ్గర అడిగి తీసుకున్నా


నందు: నీకు ఎన్ని సార్లు చెప్పినా సిగ్గు రాదు. నువ్వు మొదటి నుంచి అవసరమైన దాని కంటే ఎక్కువగా రాసుకు పూసుకుని తిరుగుతున్నావ్ వద్దని అప్పుడే చెప్పా


లాస్య: రాజ్యలక్ష్మి మనస్పూర్తిగా ఇచ్చారు


నందు: దాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యలక్ష్మి దివ్యని టార్చర్ చేస్తే


లాస్య: నేను డబ్బు తీసుకుంటున్న విషయం ఇంట్లో ఎవరికీ తెలియదని చెప్పాను అది మా ఇద్దరి మధ్య ఉంటుంది. మన అవసరం తీరగానే డబ్బు తిరిగి ఇచ్చేస్తాను


తులసి: నోర్ముయ్ దీనికి నేను ఒప్పుకోను ఇంట్లో ఎవరూ కూడా డబ్బు తీసుకోవడానికి అంగీకరించరు. నందు మీకు లాస్య మీద నమ్మకం ఉందా


అనసూయ: మొహమాటం లేకుండా చెప్తున్నా మాకు లాయ మీద నమ్మకం లేదు


నందు: నాకు కూడా నమ్మకం లేదు గతంలో నువ్వు చేసిన మోసాలు అటువంటివి


తులసి: ఇక డిస్కషన్ అనవసరం రాజ్యలక్ష్మి దగ్గర తెచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నాం


డబ్బు రాజ్యలక్ష్మి తిరిగి ఇవ్వకపోతే ఏంటి నా పరిస్థితని లాస్య టెన్షన్ పడుతుంది. విక్రమ్ తాతయ్య దివ్య వాళ్ళని పిలుస్తాడు. హనీ మూన్ టికెట్స్ తీసుకొచ్చానని చెప్తాడు. అది విని విక్రమ్ సంతోషిస్తాడు. టికెట్స్ కులుమనాలికి బుక్ చేశానని చెప్తాడు. రాజ్యలక్ష్మి వచ్చి విక్రమ్ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది. హనీ మూన్ కి వెళ్లాలంటే కొన్ని ఫార్మాలటీస్ ఉన్నాయని పుల్ల వేస్తుంది. మొదటి రాత్రి సరైన ముహూర్తంలో జరగాలి లేదంటే దాని ప్రభావం పుట్టే బిడ్డ మీద పడుతుందని ప్రసన్న అనేసరికి అయితే హనీమూన్ క్యాన్సిల్ అని విక్రమ్ చెప్తాడు. రేపే మొదటి రాత్రికి ముహూర్తమని రాజ్యలక్ష్మి చెప్తుంది.


Also Read: కాలేజ్ లో శైలేంద్రకి షాకుల మీద షాకులు- ఎండీ సీట్ లో అన్నయ్యని కూర్చోబెట్టిన రిషి


తులసికి ఫోన్ చేసి ఫస్ట్ నైట్ గురించి చెప్తుంది. తెల్లారగానే విషయం తెలిసి తులసి ఫ్యామిలీ మొత్తం రాజ్యలక్ష్మి ఇంటికి వచ్చేస్తారు. ఈ మొదటి రాత్రి ఏ క్షణమైన ఆగిపోతుందని లాస్య మనసులో అనుకుంటుంది. నందు చేతిలో ఉన్న బ్రీఫ్ కేసు చూసి రాజ్యలక్ష్మి టెన్షన్ పడుతుంది. మాకు అంతా తెలుసు లాస్య మొత్తం చెప్పేసిందని తులసి అనేసరికి రాజ్యలక్ష్మికి ఫ్యూజులు ఎగిరిపోతాయి.