ఈ ఇంట్లో ముకుంద, కృష్ణతో ఎవరూ మాట్లాడకూడదని కండిషన్ పెట్టారు. అందరి పరిస్థితి ఏమో కానీ నాకు మాత్రం పరీక్షలాగా ఉంది. మురారీతో మాట్లాడకుండా ఉండలేను. చాటుగా పిలిచి మాట్లాడలేను. కానీ మురారీ దిగులుగా ఉండటం చూడలేకపోతున్నా. తనతో ఎలా మాట్లాడాలి, తనని ఎలా ఓదార్చాలని అనుకుంటూ మాట్లాడొద్దని అన్నారు కానీ మెసేజ్ చేయవద్దని చెప్పలేదుగా అని కలవమని మెసేజ్ పెడుతుంది. మురారీ తనని ఎదిరించిన సంఘటనలని భవానీ గుర్తు చేసుకుంటుంది. నేను రాను ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న గొడవలు చాలు. నువ్వు నేను మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే నీకే నష్టం. కాబట్టి నాతో మాట్లాడటానికి ట్రై చేయవద్దని మురారీ రిప్లై ఇస్తాడు. భవానీ దిగులుగా ఉంటే ముకుంద వచ్చి పలకరిస్తుంది.


Also Read: కాలేజ్ లో శైలేంద్రకి షాకుల మీద షాకులు- ఎండీ సీట్ లో అన్నయ్యని కూర్చోబెట్టిన రిషి


ముకుంద-భవానీ: ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలని అనిపిస్తుందని చెప్తుంది. మురారీని క్షమించేలా లేరు దీనికి కారణమైన కృష్ణని బయటకి పంపించాలని మనసులో అనుకుని తన మీద ఎక్కించేందుకు ట్రై చేస్తుంది. జరిగిన దాంట్లో మురారీ తప్పేమీ లేదు బయట నుంచి వచ్చిన కృష్ణదే కదా తప్పు ఇటు నందిని, అటు మురారీని దూరం చేసింది. అందుకే కృష్ణని పంపించేస్తే ఈ ఇంట్లో గొడవలు లేకుండా పోతాయి. ఒక్కసారి ఆలోచించండి. ముకుంద నా మాట వినకుండా కృష్ణ మాట వినడం తప్పు కదా. నీ మాట ఇప్పుడు నేను వింటే వాడికి నాకు తేడా లేదు. వెళ్ళి ఏదైనా మంచి పుస్తకం చదువుకోమని చెప్తుంది.


నందినికి పెళ్లైంది సెలెబ్రేట్ చేసుకోవాలని కృష్ణ రూమ్ లో గంతులు వేస్తుంటే మురారీ వచ్చి డాన్స్ స్టార్ట్ చేస్తాడు. ఇద్దరూ డాన్స్ ఇరగదీస్తారు. నువ్వు డైనమిక్ గా ఉంటావ్ కృష్ణ. ఎంతైనా ఒక పోలీసాయన కూతురివి. ఒక పోలీసాఫీసర్ భార్యవి. నేను కట్టిన తాళి నీ మెడలో ఉంది నువ్వు నా భార్యవేనని మురారీ అనేసరికి కృష్ణ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భవానీ జ్వరంతో మంచాన పడుతుంది. రేవతి వచ్చి ట్యాబ్లెట్స్ ఇస్తుంది. నువ్వు కొడుకుని కని ఇచ్చి ఇవ్వకుండా ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదు కదా అంటుంది. రేవతిని మాటలని వెళ్లిపొమ్మని సీరియస్ అవుతుంది. నా కూతుర్ని నా నుంచి దూరం చేస్తే పడే బాధ నువ్వు కూడా పడాలి కదా ఎంత శాడిస్ట్ ని నేను అని తనని తాను నిందించుకుంటుంది.


మురారీ ఎదురుపడితే ముకుంద ఆపుతుంది. నీతో ఇంట్లో ఎవరూ మాట్లాడటం లేదు నేను మాట్లాడకపోతే నాకు పిచ్చి పడుతుంది. నందిని పెళ్లి విషయంలో నీ తప్పేమీ లేదు మొత్తం కృష్ణ చేసింది. పెద్దత్తయ్య దృష్టిలో నువ్వు తప్పు చేసిన వాడిలా నిలబడ్డావ్. నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోకు. పెద్దత్తయ్యకి నీకు ఉన్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరు ఆ నమ్మకంతోనే ఉండమని అంటుంటే రేవతి వచ్చి అరుస్తుంది. ఈ ఇంట్లో ఏం ఆంక్షలు విధించారు నువ్వు మురారీతో ఎందుకు మాట్లాడుతున్నావని నిలదీస్తుంది. బాధలో ఉన్నాడు ఓదారుస్తున్నారని అంటుంది. వాడికి ఒక పెళ్ళాం ఉంది తను చూసుకుంటుందని చెప్తుంది.


Also Read: వేద, యష్ క్యూట్ రొమాన్స్- పుల్ల పెట్టేందుకు రెడీ అయిన మాళవిక


ముకుంద: ఈ పరిస్థితికి కారణం నీ కోడలు అత్తయ్య


రేవతి: ఏం చేసింది నా కోడలు. నందినికి మంచి జీవితం ఇచ్చింది త్వరలోనే భవానీ అక్క కూడా అర్థం చేసుకుంటుంది


దీన్ని అడ్డం పెట్టుకుని మురారీని నన్ను విడదీయాలని అనుకుంటున్నారు అది అంత ఈజీ కాదని ముకుంద మనసులో అనుకుంటుంది. భవానీకి జ్వరం ఎక్కువగా ఉందని కృష్ణ తెలుసుకుంటుంది. వాళ్ళ కోసం వెతుకుతూ ఈశ్వర్ దగ్గరకి వస్తుంది. ఇంట్లో వాళ్ళు మాట్లాడొద్దని వంకతో ఇద్దరూ కలిసి తినడానికి బయటకి వెళ్లారని ముకుంద ఈశ్వర్, ప్రసాద్ కి ఎక్కించేందుకు ట్రై చేస్తుంది. కృష్ణనే మురారీని చెడగొడుతుంది. పెద్దత్తయ్యకి బాగోలేదని కూడా చూడకుండా బయటకి తీసుకుని వెళ్ళిందని ఎక్కిస్తుంది. తప్పు కృష్ణది మాత్రమే కాదు మురారీది కూడా అని ఈశ్వర్ అంటాడు.