ధరణి చాప తీసుకుని వెళ్ళడం చూసిన వసు ఆవేశంగా వెళ్లబోతుంటే జగతి ఆపుతుంది. ఇది కరెక్ట్ టైమ్ కాదు భార్యాభర్తల విషయంలో బయట వాళ్ళు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. కొన్ని గుట్టుగా ఉండాల్సినవి గుట్టుగానే ఉండాలి. వాళ్ళ మధ్య ఏం జరుగుతున్నాయో మనకి తెలియదు. ఏవేవో ఊహించుకుని నోరు జారితే ప్రమాదం. మనం ఇప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకుంటే తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. నువ్వు తనని ఏమి అడగకని చెప్తుంది. రిషి నాలుగు కోట్స్ ముందు పెట్టుకుని ఏ డ్రెస్ వేసుకుంటే సెట్ అవుతుందా అని చూస్తూ ఉంటుంటే వసు వచ్చి లోపలికి రావచ్చా అంటుంది. ఏ కోత బాగుంటుందో తనే సెలెక్ట్ చేస్తానని చెప్తుంది. కోట్ సెలెక్ట్ చేసి రిషికి వేస్తుంది. ఈ కోట్ అంటే చాలా ఇష్టం మీలోని కోపం, బాధ అన్నీ ఎమోషన్స్ ఇందులో కనిపిస్తాయి అందుకే వేశానని చెప్తుంది.


రిషి: నీకు నా మీద ఉన్న ప్రేమ నీ కళ్ళలో కనిపిస్తుంది. మనం మళ్ళీ ఇలా ఉంటామని అనుకోలేదు. గతంలో మన మధ్య ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. కానీ వాటిని దాటుకుని స్వచ్చమైన ప్రేమకి అడ్డంకులు ఉండవని తెలిసింది. ఇక మన మధ్య చిన్న ఎడబాటు కూడా ఉండకూడదు. ఎప్పుడూ మనం కలిసే ఉండాలి.


Also Read: రాజ్యలక్ష్మి దగ్గర డబ్బు ఎందుకు తీసుకున్నావని నిలదీసిన నందు- నిజం కక్కేసిన లాస్య


వసు: ఈ వసుధార మీ ప్రాణం సర్ మిమ్మల్ని వదిలి ఉండలేదు. మీరు నా ప్రిన్స్ ఎప్పుడు రాజకుమారుడిలా దర్జాగా ఉండాలి


ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా శైలేంద్ర వచ్చి పిలుస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి రావడం చూసి దేవయాని కుళ్ళుకుంటుంది. మనకి కావాల్సింది జరగాలంటే అన్నీ చూస్తూ ప్రేమగా నటించాలని శైలేంద్ర తల్లికి చెప్తాడు. రిషి కారు డోర్ తీసి ముందు సీట్లో తన అన్నయ్యని కూర్చోమని పిలుస్తాడు. కానీ శైలేంద్ర మాత్రం వసుధార మాత్రమే కూర్చోవాలని చెప్పేసి వెనక కూర్చుంటాడు. అది చూసి వాళ్ళు అలా కలిసి వెళ్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదని ధరణి దేవయానితో అంటుంది. రిషి తన అన్నయ్య గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు. శైలేంద్ర మీ అన్నయ్య కాదు దేవయాని కొడుకు ఎవరి మీద ప్రేమ ఉండదు ప్రేమ ఉన్నట్టు నటిస్తారు అది మీకు అర్థం కావడం లేదని వసు మనసులో అనుకుంటుంది.


రిషి వాళ్ళు కాలేజ్ కి వస్తారు. కాలేజ్ స్టూడెంట్ వచ్చి రిషిని విష్ చేసి బొకే ఇస్తారు. ఏంటి స్పెషల్ అంటాడు. అది మేము చెప్పము లోపలికి రండని అంటారు. మీ పక్కన ఉన్న నన్ను ఎవరిని కూడా అడగకుండా మీ స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చారా అని శైలేంద్ర అంటాడు. అదేమీ లేదు నువ్వు ఎవరో తెలిస్తే నాకంటే ఎక్కువ గౌరవం ఇస్తారని రిషి చెప్తాడు. ఫణీంద్ర రిషి వాళ్ళని చూసి సంతోషపడతాడు. అవును మన మధ్య చిచ్చు పెట్టాలని చాలా మంది చూశారు కానీ అది మనం జరగనివ్వలేదని మహేంద్ర చెప్తాడు. శైలేంద్ర అక్కయ్యలాగే స్వార్థపరుడు కానీ ఈ నిజం మీకు తెలిస్తే చాలా బాధపడతారని జగతి మనసులో అనుకుంటుంది. శైలేంద్ర కూడా కాలేజ్ పనులు చూసుకుంటే బాగుంటుందని ఫణీంద్ర అంటాడు.


Also Read: మనసుల్ని మెలిపెట్టించేసిన కృష్ణ, భవానీ- భార్యని చూసి మురిసిపోతున్న మురారీ


స్టూడెంట్స్ అందరూ మీటింగ్ హాల్ లో వెయిట్ చేస్తున్నారని ప్యూన్ వచ్చి చెప్తాడు. రిషి శైలేంద్రని కూడా తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేస్తాడు. ఫణీంద్ర సార్ అబ్బాయి. ఇన్ని రోజులు ఫారిన్ లో ఉన్నాడు. ఇక నుంచి ఇక్కడే ఉంటాడని చెప్తాడు. మీ తర్వాతే ఎవరైనా అది మీ అన్నయ్య అయినా ఇంకెవరైనా అని స్టూడెంట్స్ అనేసరికి శైలేంద్ర షాక్ అవుతాడు. మీ ఉద్దేశం తప్పు ముందు మనం కాలేజ్ కి ప్రయారిటీ ఇవ్వాలి ఆ తర్వాత ఎవరైనా అని రిషి చెప్తాడు. మెడికల్ కాలేజ్ కి సంబంధించి వసు, జగతి మేడమ్ ఐడియా ఇస్తే లోగో తయారు చేశామని స్టూడెంట్ చెప్తారు. అది విని రిషి చాలా సంతోషపడతాడు. రిషి వసు, జగతి వాళ్ళ వైపు ప్రేమగా చూస్తూ ఇది లోగో ఓపెన్ చేయాల్సింది నేను కాదు అంటాడు. శైలేంద్ర తనతోనే ఓపెన్ చేయిస్తాడని అనుకుంటాడు. కానీ రిషి జగతి మేడమ్, వసుధార ఓపెన్ చేయాలని చెప్పేసరికి శైలేంద్ర మొహం మాడిపోతుంది.