నందు అయోమయంలో కొట్టుకుంటున్నాడు, ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారని రాములమ్మ తులసిని అడుగుతుంది. ఆయన మొహం చూస్తుంటే జాలి వేసిందని అంటుంది. కాసేపు తులసి కన్నీళ్ళ గురించి వేదాంతం మొదలుపెడుతుంది. దివ్య బాధగా కూర్చుని ఉంటే విక్రమ్ వస్తాడు. తన భుజం మీద తల పెట్టి మనసులో బాధ చెప్పుకుంటుంది. చిన్నప్పుడు నన్ను భుజాల మీద మోసిన నాన్నని కొన్ని విషయాల్లో నేను ద్వేషించిన కూడా ఆయన్ని సెల్ లో చూసి గుండె పగిలిపోయింది. నీ ఒడిలో తల పెట్టి సేద తీరాలని అనుకున్నా కానీ నువ్వు నన్ను దోషిగా చూసేసరికి హర్ట్ అయ్యేలా మాట్లాడానని సోరి చెప్తుంది. తప్పు చేసింది నేను సోరి చెప్పాల్సింది నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది అమ్మ ప్రేమ ఒకటే. నా ప్రపంచం అమ్మ మాత్రమే. నీకోసం అమ్మ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటే చూడలేకపోయాను నీవైపు నుంచి ఆలోచించలేదు కొద్దిగా ఆవేశపడ్డాను అంతే కానీ నీమీద ప్రేమ లేకకాదని అంటాడు.
Also Read: కరిగిన తల్లి మనసు, కొడుకుని దగ్గరకి తీసుకున్న భవానీ- మురారీ బర్త్ డే కి గొప్ప బహుమతి ఇచ్చిన కృష్ణ
మావయ్య మీద కేసు పెట్టడం ఏంటని అడుగుతాడు. పైకి అందంగా నవ్వుతూ ఆపేక్షగా మాట్లాడుతుంది కానీ తను మంచిది కాదు విషం చిమ్ముతుంది. మా అమ్మ అంటే అసలు పడదని చెప్తుంది. మావయ్యని కేసు నుంచి కాపాడటానికి ఎలాంటి సహాయం కావాలని తను చూసుకుంటానని విక్రమ్ దివ్యకి ధైర్యం చెప్తాడు. అది చూసి బసవయ్య గుండెలు బాదుకుంటాడు. వెంటనే రాజ్యలక్ష్మి దగ్గరకి వచ్చి ఊదేస్తాడు. విక్రమ్ పెళ్ళాం చేతిలో చెయ్యి వేసి చెప్పాడు మావయ్యని విడుదల చేస్తానని మాట ఇచ్చాడని ఆవేశంగా చెప్తాడు. ఆ మాట విని రాజ్యలక్ష్మి నవ్వుతుంది. నన్ను ఆడగకుండా పెళ్ళాంకి మాట ఇచ్చాడు నా మాటకి కట్టుబడి మాట తప్పుతాడు అప్పుడు ఎవరు గెలిచినట్టు అని సంబరంగా చెప్తుంది. దీని వల్ల దివ్యకి ఒకటే అర్థం అవుతుంది తల్లిని మించిన దైవం విక్రమ్ కి లేదని తెలిసి ఏడుస్తుందని బసవయ్య కూడా ఆనందపడతాడు.
నందు భోజనం చేయలేదని రాములమ్మ చెప్పడంతో బాధపడుతుంది. ఇదే విషయం తులసి అనసూయకి చెప్తుంది. తిండి మీద అలిగావా ఏంటని వచ్చి కొడుకుని నిలదీస్తుంది. తులసి రావడంతో నందు మొహం పక్కకి తిప్పుకుంటాడు. జీవితం మీద విరక్తిగా ఉందని నందు అసహనంగా మాట్లాడతాడు. మీ సమస్యలోకి తనని తీసుకురావద్దని తులసి అంటుంది. అప్పుడే లాస్య కొంత మంది ఆడవాళ్ళని వెంట పెట్టుకుని నందగోపాల్ డౌన్ డౌన్ అంటూ అరుస్తారు. అన్యాయం చేస్తున్న నీ మెడలు వంచుతామని ఆడవాళ్ళందరూ అంటారు. నందు వాళ్ళని తిడతాడు. విడాకులు ఇచ్చిన కూడా మొగుడితో ఉంటున్న పతివ్రత ఎక్కడ ఇంట్లో దాక్కుందా తులసి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతారు. తులసి ఆవేశంగా బయటకి వస్తుంది. డైవర్స్ తీసుకుని మొగుడితో కలిసి ఉండటానికి సిగ్గులేదా అని నిలదీస్తుంది.
Also Read: రాహుల్ కి వార్నింగ్ ఇచ్చిన కావ్య- స్వప్నకి పెళ్లి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కృష్ణమూర్తి
నేను నా మాజీ భర్త ఇంట్లో ఉండటం కాదు ఈ లాస్య వాళ్ళ ఆయన నా ఇంట్లో ఉంటున్నారని తులసి చెప్తుంది. వాళ్ళు మీ ఇంట్లో ఎందుకు ఉంటున్నారని ఆడవాళ్ళు అంటారు. వచ్చిన ఆడవాళ్ళకి గట్టిగానే బుద్ధి చెప్తుంది. లాస్య దగ్గర డబ్బు తీసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని అంటుంది.