మురారీ పుట్టినరోజు సందర్భంగా ఇల్లంతా అందంగా డెకరేట్ చేసి కృష్ణ ఎదురుచూస్తుంది. అప్పుడే కిందకి రాగానే తల్లి రేవతి విషెస్ చెప్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకని అంటాడు. పెద్దత్తయ్య తప్పకుండా వస్తారని ధీమాగా చెప్తుంది. ఆవిడకి కోడలంటేనే కోపం కొడుకంటే ప్రాణమని అంటుంది. ముకుంద బాధగా కిందకు వస్తుంది. నేను మురారీతో మాట్లాడిన విషయం చెప్తుందని అంటుంది. ముకుంద వచ్చి విష్ చేసి రాత్రి కేక్ కట్ చేయించావనుకుంట కదా అంటే అవునని చెప్తుంది. వెళ్ళి పెద్దమ్మని పిలుస్తానని రేవతి అంటే వద్దు నా వల్ల నువ్వు మాటలు పడితే తట్టుకోలేనని అంటాడు. అప్పుడే భవానీ బొకే పట్టుకుని కిందకి వస్తుంది.


Also Read: రాహుల్ కి వార్నింగ్ ఇచ్చిన కావ్య- స్వప్నకి పెళ్లి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కృష్ణమూర్తి


కృష్ణ జరిగింది గుర్తు చేసుకుంటుంది. భవానీ బాధపడుతుంటే కృష్ణ ఫోటో పట్టుకుని వెళ్తుంది. గోడకి ఉన్న ఒక ఫోటో తీసేసి యశోధమ్మ చిన్ని కృష్ణుడు ఫోటో తగిలిస్తుంది. అలకలు అపార్థాలు వదిలేసి మీరు వస్తే నా భర్త చాలా సంతోషపడతాడు. కృష్ణుడి పుట్టినరోజుకి యశోధ రాకుండా ఉంటుందా? అనేసి వెళ్ళిపోతుంది. పెద్దమ్మ రావడంతో మురారీ కృష్ణకి థాంక్స్ చెప్తాడు. కొడుకుకి పుట్టినరోజు విషెస్ చెప్పగానే సంతోషపడతాడు. ప్రేమగా కొడుకుని దగ్గరకి తీసుకుని మురిసిపోతుంది. చూశావా పెద్దమ్మ అంటే ఎంత ప్రేమో కన్నతల్లిని నా కాళ్ళకి నమస్కారం చేయలేదని రేవతి బుంగమూతి పెడుతుంది. పెద్దత్తయ్య గిఫ్ట్ ఏం లేదా ఒక్క బొకేనేనా అంటుంది. ఇదే గిఫ్ట్ నేను మీ అందరితో మాట్లాడుతున్నానని చెప్పేసరికి కృష్ణ సంతోషపడుతుంది. మీరిద్దరూ ఇక అందరితో మాట్లాడొచ్చు నేను పెట్టిన నిబంధనలు తుడిచేశానని భవానీ చెప్తుంది.


Also Read: భార్యని ముద్దులతో ముంచెత్తుతున్న యష్- చిత్ర మీద అఘాయిత్యానికి తెగబడ్డ అభిమన్యు


నిజంగా పెద్ద వరమే ఇచ్చారని కృష్ణ అంటుంది. అందరి కంటే ముందుగా మీరే విషెస్ చెప్పేవారు కదా ఈసారి లేట్ చేశారని రేవతి అడుగుతుంది. నేను రాత్రే విష్ చేశానని గది దగ్గరకి వెళ్ళి ఆశీర్వదించిన విషయం చెప్తుంది. మా పెద్దమ్మ చాలా మంచిదని మురారీ గాల్లో ఎగురుతాడు. ఈ క్రెడిట్ అంతా తనకేనని కృష్ణ అంటే అవును నువ్వు పెంచిన దూరం నువ్వే తగ్గించావని భవానీ హ్యపీగా చెప్తుంది. మీరు ఇంత త్వరగా క్షమిస్తారని అనుకోలేదని ముకుంద కూడా నవ్వుతుంది. కేక్ కట్ చేసిన తర్వాత ముకుందకి తినిపించకుండా చేతికి ఇస్తాడు. దీంతో బాధగా దాన్ని ఎవరూ చూడకుండా విసిరికొడుతుంది. కృష్ణ మురారీకి బహుమతి ఇస్తుంది. అందరం కలిసి గుడికి వెళ్దామని భవానీ చెప్తుంది. దేవుడి సాక్షిగా ఆ గుడిలోనే నీ వేలికి ఉంగరం తొడుగుతానని ముకుంద మనసులో అనుకుంటుంది. పెద్దమ్మ మాట్లాడినందుకు సంతోషంగా ఉన్నారా అని కృష్ణ అడుగుతుంది. మురారీ చాలా హ్యపీగా ఉందని భార్యని దగ్గరకి తీసుకుని తనతో డాన్స్ వేస్తాడు. ఇద్దరూ హ్యపీగా ఉంటారు.