రాహుల్ మాటలు గుడ్డిగా నమ్మొద్దని కావ్య చెప్తుంది. నిజంగా నువ్వు చెప్పినట్టు స్వప్న ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయింది రాహుల్ ఏ తప్పు చేయలేదు కాబట్టి మనల్ని చూసి పారిపోలేదు, నాకు రాహుల్ చెప్పేది కూడా నిజమని అనిపిస్తుందని అంటాడు. ఇతను మోసం చేయాలని చూస్తున్నాడని చెప్తుంది.


రాజ్: నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉందని అనిపిస్తుంది అలా అని ఎన్నో ఏళ్లుగా నాతో కలిసి పెరిగిన వ్యక్తిని తప్పు చేశాడని అతని మీద నింద వేయలేను దూరం చేసుకోలేను అందుకే నీకోక అవకాశం ఇస్తాను. నిజంగా రాహుల్ తప్పు చేశాడని స్వప్నతో నిరూపించు అప్పుడు నువ్వు చెప్పింది నిజమని నమ్ముతాను


రాహుల్: నువ్వు ఎందుకు తనకోక అవకాశం ఇస్తున్నావ్ ఇదంతా ప్లాన్ చేసి నన్ను ఇరికిస్తున్నారు


Also Read: జానకికి ప్రమోషన్, మనోహర్ సస్పెండ్- నిర్దోషిగా ఇంటికి వచ్చిన రామ


రాజ్: నిజానిజాలు ఏంటో నాకు తెలుసు. నన్ను ఎవరూ మోసం చేయలేరు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తనని ఎన్నో సార్లు అవమానించాను నీదే తప్పని అన్నాను. అయినా సరే ఏరోజు నాకు ఎదురు చెప్పలేదు. ఇప్పుడు కూడా దాని కోసమే ఇక్కడి దాకా తీసుకొచ్చింది. నిజం బయట పెడతానని చెప్పింది. అయినా నువ్వు ఎందుకు భయపడుతున్నావ్ నువ్వు తప్పు చేయలేదు కదా. తప్పు చేసింది కళావతి అయితే తనకే శిక్ష వేస్తాను కానీ తప్పు చేసింది నువ్వని తెలిస్తే నాలో ఇంకొక రాజ్ ని చూస్తావ్


నువ్వు ఒక సెంటిమెంట్ ఫూల్ వి అని నాకు తెలుసు, ఎక్కడ నొక్కితే నువ్వు లొంగుతావో తెలుసు ఈసారి అవకాశం నాదని మనసులో అనుకుంటాడు. గుడి దగ్గర నుంచి అందరూ వెళ్లిపోదామని అపర్ణ అంటుంది. మీరంతా ఉండండి కావాలంటే నేను వెళ్తున్నానని అపర్ణ వెళ్లబోతుంటే రాజ్ వాళ్ళు వస్తారు. మీరేమైన చిన్న పిల్లలా ఎక్కడికి వెళ్లారని శుభాష్ నిలదీస్తాడు. ఇంత టెన్షన్ పెట్టి ఎక్కడికి వెళ్లారో అందరికీ మీరు చెప్పక తప్పదని రుద్రాణి నిలదీస్తుంది. అందరూ నా కొడుకుని నిలదీస్తున్నారు తీసుకువెళ్ళింది నువ్వు నువ్వే చెప్పాలని అపర్ణ అడుగుతుంది.


రాజ్: నిజమెంటో పూర్తిగా తెలియకుండా రాహుల్ పేరు బయట పెట్టడం కరెక్ట్ కాదు ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎవరూ తట్టుకోలేరని మనసులో అనుకుంటాడు. నేనే ఈ కళావతిని బయటకి తీసుకెళ్ళాను ఇందులో తన తప్పేమీ లేదు అనేసరికి అపర్ణ షాక్ అవుతుంది.


Also Read: అదిరిపోయే ట్విస్ట్, ఇక రాజ్యలక్ష్మి ఆట కట్టు- నందు ఇంటి ముందు ధర్నాకు దిగిన లాస్య


విన్నావుగా కావ్యని రాజ్ బయటకి తీసుకెళ్తే తనని నానా మాటలు అన్నావని ఇంద్రాదేవి తిడుతుంది. అసలు ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్లారని సీతారామయ్య అంటే ముహూర్తం మించి పోతుందని పంతులు అంటాడు. ఇద్దరూ వెళ్ళి పీటల మీద కూర్చుంటారు. కావ్య మెడలో కట్టిన పసుపు తాడు విప్పి నల్లపూసలు గుచ్చిన తాళి వేయమని పంతులు చెప్పడంతో రాజ్ అలాగే చేస్తాడు. ఈ బంధం శాశ్వతం కావాలని కావ్య అమ్మవారిని వేడుకుంటుంది. కావ్య రాజ్ బెడ్ రూమ్ సర్దుతూ ఉంటే వస్తాడు. ఇవాళ జరిగింది మర్చిపొమ్మని చెప్తాడు. రాహుల్ విషయం బయట పెట్టాలనే కదా నేను వెయిటింగ్ అంటుంది. నిజానిజాలు తేలకుండా ఇంట్లో అందరికీ చెప్పి బాధ పెట్టడం కరెక్ట్ కాదని చెప్తాడు.


ఇద్దరూ కాసేపు పోట్లాడుకుంటారు. రాహుల్ తప్పు చేశాడని నిరూపిస్తానని ఛాలెంజ్ చేస్తుంది. ఇంట్లో కనకం వాళ్ళు స్వప్న వాళ్ళ కోసం ఎదురుచూస్తారు. స్వప్న అప్పుడే ఇంటికి వస్తే  ఎక్కడికి వెళ్ళావని నిలదీస్తుంది. తనకి ఒక్క అవకాశం ఇవ్వమని స్వప్న అడుగుతుంది. మంచి సంబంధం చూశాను నీకు నచ్చినా నచ్చకపోయినా అతనితో పెళ్లని కృష్ణమూర్తి తెగసి చెప్తాడు. మీరు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకొను మీరు మొండికేస్తే నేను మొండికేస్తానని చెప్పేసి వెళ్ళిపోతుంది. తను ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన మనం చూసిన అబ్బాయితోనే పెళ్లి జరుగుతుందని అంటాడు. రాహుల్ మెట్లు దిగుతుంటే కావ్య ఎదురుపడుతుంది. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాం ఏం చేయగలిగావ్ అని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. నిజం నిరూపించి అసలు స్వరూపం అందరి ముందు బయట పెట్టి తీరతానని కావ్య వార్నింగ్ ఇస్తుంది.