నందుని బెయిల్ మీద తులసి ఇంటికి తీసుకొస్తుంది. లాస్యకి విడాకులు ఇద్దామని అనుకుంటున్నానని చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. ఆవేశంలో ఉన్నావ్ తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందామని పరంధామయ్య అంటాడు. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు తను ఎప్పుడైతే నా మీద కేసు పెట్టిందో అప్పుడే ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. అది మిమ్మల్ని నన్ను పెట్టిన కష్టాలు గుర్తు చేసుకోండి. మీరు ఇల్లు వదిలి వెళ్ళడానికి కారణం అయ్యింది. మిమ్మల్ని తిండి పెట్టకుండా మార్చింది. ఇంటిని తన పేరు మీద రాయించుకుని పిల్లల మధ్య గొడవలు పెట్టింది. ఇప్పుడు డబ్బు కోసం నా కూతురి సంతోషాన్ని రాజ్యలక్ష్మికి అమ్ముకుంది. ఈ కారణాలు సరిపోవా డివోర్స్ ఇవ్వడానికని ఆవేశపడతాడు. వింటున్నావా తులసి మరి ఏమి మాట్లాడవు ఏంటని అనసూయ అడుగుతుంది. అది నాకు సంబంధించిన విషయం కాదు మీరు మీ కొడుకుతో మాట్లాడుకుంటున్నారని చెప్తుంది.
Also Read: భార్యతో సరసాలు, ప్రేమికురాలితో ఎంగేజ్మెంట్- మురారీతో భవానీ మాట్లాడుతుందా?
పరంధామయ్య: వాడికి నీకు ఏ సంబంధం లేదా?
అనసూయ: ఏ సంబంధం లేకపోతే దేవ్ బిజినెస్ కోసం భార్యగా ఎందుకు నటించావు కష్టపడి జైలు నుంచి బయటకి ఎందుకు తీసుకొచ్చావ్
తులసి: చిన్న విషయానికి భార్యకి విడాకులు ఇవ్వడం ఏంటి తప్పని చెప్పాల్సింది పోయి నన్ను సలహా అడుగుతారు ఏంటి మావయ్య
అనసూయ: వాడిని జైల్లో పెట్టడం చిన్న విషయమా
తులసి: ఇందులో లాస్య తప్పు మాత్రమే లేదు మనది కూడా ఉంది. ఒక తల్లిగా నేను కూడా జాగ్రత్త పడాల్సింది
నందు: లాస్య చేసింది మామూలు తప్పులు కాదు
తులసి: వీలైతే సర్దుకుపోండి లేదంటే గొడవ పదండి అంతే కానీ విడాకులు పరిష్కారం కాదు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు లాస్య అంత పెద్ద తప్పు ఏమి చేయలేదు. భార్యాభర్తల మధ్య గొడవలకు పరిష్కారం డివోర్స్ కాదు సర్దుకుపోవాలి. అలా చేయకపోతే ఎంత మందికని డివోర్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. నా విషయంలో చేసిన తప్పు లాస్య విషయంలో చేయొద్దు
Also Read: వామ్మో, రాహుల్ జగత్ కంత్రిగాడు- రాజ్ మైండ్ పొల్యూట్, కావ్య మాటలు నమ్మనట్టేనా?
దివ్య ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటే విక్రమ్ వచ్చి తన కాళ్ళు పట్టుకోబోతాడు. వెంటనే దివ్య పైకి లేచి వెళ్ళిపోతుంది. విక్రమ్ తో మాట్లాడకుండా ఉంటుంది. జరిగింది చెప్పేలోపు నా మీద ఎందుకు అరిచారో అడుగు ప్రియ అంటుంది. కాసేపు విక్రమ్, దివ్య పోట్లాడుకుంటారు. సమస్య వచ్చినప్పుడు కూర్చుని పరిష్కరించుకోవాలని చెప్తాడు. అందరిలోనూ నన్ను తలవంచుకునేలా చేశావు ఈ ఇంటి కోడల్ని కానీ నాకు ఆత్మాభిమానం ఉంటుంది. రాత్రంతా ఇంటికి రాలేదు నాకు టెన్షన్ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇంటికి రాగానే నా చెంప పగలగొట్టొచ్చు కదా అందరి కళ్ళు చల్లబడేవి. భార్యతో ఎలా ఉండాలో నీకు నువ్వుగా నేర్చుకోమని చెప్తుంది. అందరూ రెచ్చగొట్టారు మీరు రెచ్చిపోయారు చెప్పుడు మాటలు విని అరిచారు మీ మనసు మంచిది మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇంకోసారి ఇలాంటి పరిస్థితి రాదని ప్రియ సలహా ఇస్తుంది.