దివ్య, విక్రమ్ కారులో వెళ్తు ఉంటారు. అప్పుడే ఎదురుగా వచ్చిన బైక్ ని ఢీ కొట్టేస్తారు. బైక్ మీద ఉన్న జంట కిందపడిపోతే దెబ్బలు తగులుతాయి. ఆ అమ్మాయి చేతికి గాయం అవడంతో దివ్య తనకి ట్రీట్మెంట్ ఇస్తుంది. ఆ అమ్మాయి అబ్బాయికి ఎలా ఉందోనని కంగారుగా అడుగుతుంది. దీంతో అతడు ఆ అమ్మాయిని తిడుతుంటే విక్రమ్ ఆపుతాడు. ప్రేమ అంటే పెదాలతో పలికేది కాదు మనసులో నుంచి రావాలి. నీకోసం ఎంత తాపత్రయ పడుతుందో చూడమని విక్రమ్ ఆ అబ్బాయికి కాస్త నాలుగు మంచిమాటలు చెప్తాడు. ఆ మాటలకి దివ్య ఇంప్రెస్ అయిపోతుంది. విక్రమ్ ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. తను వెళ్లిపోతుంటే విక్రమ్ కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు.


Also Read: చూడముచ్చటైన జంట- కనకాన్ని గుర్తుపట్టిన కావ్య, రిసెప్షన్ కి వచ్చిన స్వప్న


దివ్య తల్లికి ఎలా ఉందోనని కంగారు పడుతూ ఇంటికి వస్తుంది. నందు తులసికి ప్రేమగా సూప్ తాగిస్తూ ఉంటాడు.  అది చూసి దివ్య ఆశ్చర్యపోతూ సంబరపడుతుంది. అనసూయ, పరంధామయ్య వాళ్ళు కూడా చూస్తారు. తులసి వద్దని చెప్తున్నా నందు బతిమలాడి తాగిస్తాడు. వాళ్ళిద్దరినీ ప్రేమగా ఒక దగ్గర చూడటం ఇదే మొదటిసారి అని దివ్య అంటుంది. సముద్రం, మల్లెతీగ, ఉంగరం, చెరువు, కలువ పువ్వు అంటూ పరంధామయ్య, అనసూయ ఏదేదో మాట్లాడతారు. నందు మారిపోయి భర్తకి కావలసిన లక్షణాలు నేర్చుకునే సమయానికి తులసిని తన జీవితంలో లేకుండా చేసుకున్నాడని పరంధామయ్య బాధపడతాడు. దివ్య దగ్గరకి తులసి శకుంతల అనే ఆవిడని పంపిస్తుంది. మీ హాస్పిటల్ లో ఆమె ఆపరేషన్ చేయించుకుందట కడుపులో కత్తెర పెట్టి కుట్టేశారని చెప్తుంది. బయటకి వెళ్తే ఎవరూ ట్రీట్మెంట్ చేయడం లేదని చెప్పేసరికి దివ్య ఆమె ఫైల్ చూస్తుంది.


ఈ హాస్పిటల్ కి రావాలంటే భయంగా ఉంది, నష్టపరిహారం ఇప్పించమని శకుంతల అడుగుతుంది. దివ్య కపంగా రాజ్యలక్ష్మి దగ్గరకి ఫైల్ తీసుకుని వస్తుంది. రాను రాను హాస్పిటల్ లో పరిస్థితులు దిగజారుతున్నాయని దివ్య అంటుంది. ఈ పేషెంట్ కి అవసరం లేకపోయినా ఆపరేషన్ చేసి కత్తెర పెట్టి కుట్లు వేశారని చెప్తుంది. ఫైల్ ఇక్కడ పెట్టేసి వెళ్ళు నేను చూస్తానని చెప్తుంది. పేషెంట్ కి ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యతని దివ్య నిలదీస్తుంది. ఆపరేషన్ చేసిందేవరని రాజ్యలక్ష్మి అంటే డాక్టర్ సంజయ్ అని చెప్తుంది. పేషెంట్ ని వెంటనే జాయిన్ చేసి కత్తెర తీసేద్దామని అంటుంది. కానీ వాళ్ళు మన దగ్గర ఆపరేషన్ చేయించుకోవడానికి రెడీగా లేరని పది లక్షలు పరిహారం అడుగుతున్నారని దివ్య చెప్తుంది. పైసా కూడా ఇవ్వనని సంజయ్ అరుస్తాడు. అయితే పోలీస్ కేసు పెట్టి జైల్లో పెట్టించమంటారా అని దివ్య బెదిరిస్తుంది. పేషెంట్ ని పిలిపించి సంజయ్ తో రాజ్యలక్ష్మి సోరి చెప్పిస్తుంది.


Also Read: వేదని కాపాడి తీసుకొచ్చిన ఖుషి- బరువు తూగని యష్, విన్నీ కోరికే ఫలిస్తుందా?


దివ్య రానురాను చెప్పులో రాయిలా మారుతుందని రాజ్యలక్ష్మి పగతో రగిలిపోతుంది. నందు కిచెన్ లో తులసి కోసం వంట చేస్తూ ఉంటాడు. అప్పుడే లాస్య ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావ్ అని అడిగితే వంటింట్లోనని చెప్తాడు. తన మనసులో ఉన్న కుళ్ళు మొత్తం బయటపెడుతుంది. నాకు డివోర్స్ ఇచ్చే ఐడియా ఏమైనా ఉందాఅని లాస్య నందుని అడిగేస్తుంది. నా కళ్ళ ముందే తెగించి తులసి మెడలో నెక్లెస్ వేశావంటే నీ మనసులో ఏదో ఉందని తెలిసిపోతుందని అంటుంది.